🌺🍃🌺🍃🌺🍃🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 199 ( ADE SRI VENKATA PATI ALAMELUMANGAYUNU ) 🌺🍃🌺🍃🌺🍃🌺 PREFACE :-- 🌹🌹👇 Annamacharya has praised in many sankeertanas with great joy ,the grand wedding celebration of The Lord Sri Venkateswara and Mother Alamelumanga . 🙏 Wedding songs are more popular in South Indian Families , and they are sung with great joy and fervor .🙏 Infact every bride and groom are seen as the Lord Narayana and Mahalakshmi during wedding time . 🙏 Such is the grandeur of every hindu wedding .🙏 Here in this sankeertana annamacharya narrates all the important events that are celebrated in every wedding and thus bringing Lord Venkateswara and Alamelumanga closer to everyone’s heart as bride and groom .🙏 Here goes the keertana as below ! 🙏👇 🌺🍃🌺🍃🌺 🌹🌹 Look ! Here They Are! The Lord Sri Venkatesa And Alamelumanga Delightfully Together and Eagerly waiting for their Wedding ! 🙏 🌹🙏🌹 🌹🌹 Adorn The Foreheads Of The Couple Now With the Wedding Chaplets !🙏 Offer Holy Rice grains ,To Their Hands Now ! 🙏 Oh Holy Women ! Joyfully Sing All The Wedding Songs Now !🙏 Without getting Disappointed , Be Well Known By Asking The Wedlock Time ! 🙏 🌹🙏🌹 🌹🌹 Quickly Chant All The Prayers , Of Auspiciousness !🙏 Do Not Forget To Make Her ,Wear The Sacred Holy Bangles ! 🙏 With All Anxiety They Want To See Each Other , Do Remove The Curtain In Between Them Now !🙏 Now That They Became One , Elegantly Tie The Hems Of Their Garments With a Knot ! 🙏 🌹🙏🌹 🌹🌹 Make Them Seated On The Beautiful Wedding Planks !🙏 This Lord Sri Venkatesa And Alamelumanga Have turned As The Great Couple Now ! 🙏 Bless Them Now And Make Them Delightfully Settled On The Bed Now ! 🙏 🌹🙏🌹 OM SRI ALAMELUMANGA SAMETHA SRI VENKATESWARA SWAMINEY NAMAHA 🙏🙏 ✍️ -- VENUGOPAL🙏🙏
@praveenavadakattu4120 Жыл бұрын
Chala bavundi andi కీర్తన అర్దం....అంత చాలా చక్కగా వివరించారు.....అలానే.....తాళం and రాగం కూడా petandi....ఓం నమో భగవతే వాసుదేవాయ
@VsvlsraoAyithy9 ай бұрын
Om namo venkatesaya Govinda
@vijayabharathialluri1023 Жыл бұрын
Madhu ramina Keerthana excellentbhavamu meaning and visuals om alivelumanga Samatha Venkateswara Swamynaynamaha🙏🙏🙏 Abhinandan alu
@tvraorao2509 Жыл бұрын
Very beautiful &highly spiritual visuals with clear lyrics in Telugu & English ,nice explanations by Sri VENUGOPAL YELLIPEDDI garu with melodious singer Vani Jayaram madam & best composition by Sri Parupalli Ranganath garu in MADHYAMAAVATI RAAGSM.GOD BLESSINGS to the entire team of YVG ANNAMAIAH AKSHARA VEDAM 🌷🙏
@endlaedukondalu24722 жыл бұрын
Good song PENTASTIC 🕉 NAMO VENKATESAYA 👏 👌
@gantishankerlal4202 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏కళ్యాణపు కీర్తన మీ వివరణతో చాలా బాగుంది
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
చాలా ధన్యవాదములు అండి
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 199 ( అదె శ్రీ వేంకటపతి యలమేలుమంగయును .. ) 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 199 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్ధన ః-- 🌹🌹 పద్మసరోవర మందున , పద్మావతి వేంకటేశు , బరిణయ మదిగో ! పద్మాక్షి సిగ్గు లన్నియు , బద్మనయను వేడ్కలాయె , పడతులు గనరే !! 🌺🙏🌺 *( స్వీయ పద్యము కందము )*🙏 ✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏 *భావము ః--* 🌹🌹👇 అందమైన పద్మములతో అలరారు సరోవరములు గల వనము వద్ద , ఆ పద్మావతీ శ్రీ వేంకటేశుల కళ్యాణము జరుగుతున్నది అదిగో !🙏 ఓ ముత్తైదువులారా చూడండి , ఆ పద్మాక్షి ఎంత సిగ్గులు ఒలకబోయుచున్నదో ! 🙏 ఆ సిగ్గులనన్నీ వేడుకగా ఈ పద్మనయనుడైన శ్రీనివాసుడు ఆనందముగా చూచుచున్నాడు !🙏 పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణము , సర్వలోకములకూ శుభప్రదమగు గాక !!🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమాచార్యుల వారికి , అమ్మ అలమేలుమంగ కళ్యాణ వేడుక అంటే చెప్పరాని తన్మయత్వము !🙏 అమితమైన పారవశ్యము !🙏 అమ్మ దగ్గరి చెలికత్తెగానో , పెళ్లి పనులను పురమాయించే పెద్దముత్తైదువగానో ,మారిపోతాడు అమితానందముతో !🙏 ఇక్కడ ఈ పెళ్లి వేడుకలో కూడా అలాగే మనకు దర్శింపచేస్తున్నాడు వారి కళ్యాణ వైభోగమంతా !🙏 మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 అదిగో చూడండి , ఆ *శ్రీ వేంకట పతినీ , ఆ అలమేలుమంగనూ !* 🙏 ఒద్దికగా ఒక చోటకు చేరారు ! 🙏ఇక ఒకరిపై ఒకరు మోహము పెంచుకుని త్వరపడుతున్నారు , వివాహానికి !🙏 చూడండి ఆ వేడుకను !🙏 🌹🙏🌹 🌹🌹 ఓ ముత్తైదువులారా , వారిరువురికీ తలకు చక్కని బాసికములను కట్టండి ! 🙏 దంపతులు కాబోతున్న వారికి అక్షతల తలంబ్రాలు చేతికి చక్కగా అందించండి ! 🙏 గుసగుసల మాటలు ఆపి , ఓ పేరటాండ్లారా ,చక్కగా పెళ్లి పాటలను పెద్దగా ఆనందముగా పాడండి ! 🙏 ఈ హడావుడిలో ముహూర్త సమయము ఎప్పుడో సరిగ్గా అడిగిమరీ తెలుసుకోండి !🙏 ఆ తరువాత తెలియలేదని మోసపోకండి , మీరు వారిని ఆశీర్వదించాలి కదా !🙏 🌹🙏🌹 🌹🌹 గబ గబా మంగళ గౌరి పూజలు , మంగళకరమైన మంత్రములనూ చదవండి ! 🙏 అలాగే ఈ ఇంతికి మంగళకరమైన గాజులను తొడిగి మరీ తీసుకురండి మర్చిపోకుండా !🙏 జీలకర్ర బెల్లము మూహూర్త సమయము వరకూ ఆగలేకుండా ఉన్నారు వీరు !🙏 అమితమైన ఆత్రుతతో తలలు ఎత్తి ఒకరినొకరు చూసుకొనుటకు ఆరాటపడిపోతున్నారు !🙏 ఇక వారిమధ్య కట్టిన తెరను దించండి త్వరగా !🙏 ఇద్దరినీ పక్కన కూర్చోబెట్టి వారి కొంగులను ముడివేసి ఒక్కటి చెయ్యండి వారిని !🙏 🌹🙏🌹 🌹🌹 చక్కగా మంత్రోచ్చారణల నడుమ ఇరువురి చేతులకూ కంకణ ధారణ తోరములను కట్టండి ! 🙏 అందముగా అలంకరించిన పెళ్లిపీటలపై చక్కగా కూర్చోపెట్టండి వారిని !🙏 ఇద్దరికీ కూడిక చక్కగా కుదిరనది ఇప్పుడు ! 🙏 ఆ శ్రీ వేంకటేశ్వరునీ , ఆ అలమేలుమంగనూ* అందరూ చక్కగా దీవించి , ముచ్చటగా పాన్పుపై ,చక్కగా అన్నీ అమరినట్లుగా ఆసీనులను చెయ్యండి !🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః ! 🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 199 ) ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏 🌺🍃🌺🍃🌺 సంకీర్తన 🌹 ॥పల్లవి॥ అదె శ్రీవేంకటపతి అలమేలు మంగయును కదిసివున్నారు తమకమునఁ బెండ్లికిని ॥చ1॥ బాసికములు గట్టరో పై పై దంపతులకు శేసపాలందియ్యరో చేతులకును సూసకాల పేరటాండ్లు సోబానఁబాడరో మోసపోక యిట్టే ముహూర్తమడుగరో ॥చ2॥ గక్కునను మంగళాష్టకములు చదువరో తక్కక జేఁగట వేసి తప్పకుండాను నిక్కి నిక్కి చూచేరదే నెరిఁ దెర దియ్యరో వొక్కటైరి కొంగుముళ్లు వొనరఁగ వేయరో ॥చ3॥ కంకణదారములను కట్టరో యిద్దరికిని సుంకులఁ బెండ్లిపీఁటఁ గూచుండఁ బెట్టరో లంకె శ్రీవేంకటేశు నలమేల్‌మంగను దీవించి అంకెలఁ బానుపుమీఁద నమరించరో 🌹🙏🌹