అధ్యాత్మవిద్య ప్రవచనం-22

  Рет қаралды 358

Medha Spiritual

Medha Spiritual

Ай бұрын

Pravachanam_0022at_RnD260724
ముఖ్యాంశాలు
1. మరణభయం: సృష్టిలో ఏ ప్రాణికైనా మరణభయం ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోతే నేనుండనేమోనని భయం. దేహంతోనే నేనున్నానని వాళ్ళ విశ్వాసం. కనుక, దేహం పోతే నేనేమౌతానోనని భయం. ఆత్మజ్ఞానికి దేహం పోయినా తానుంటానని తెలుసుగనుక భయం లేదు. 84 లక్షల జీవరాసుల గర్భాలలో కోటానుకోట్ల సార్లు మరణించినా పూర్వస్మృతులు లేవుగనుక భయం. దేహం కంటే వేరైన తన రూపాన్ని దేహంలో ఉండగానే ౘూౘుకోగలిగితే, భయం ఉండదు. ఆధ్యాత్మికజ్ఞానం ఉంటే అభయం.
2. స్థూలశరీరం మార్పులుచెందటంలో దిట్ట. ప్రతి క్షణము పాత కణములు కొన్ని ౘచ్చిపోతాయి కొత్తవి వస్తాయి. ఏడు సంవత్సరాలకొకసారి పాతకణములన్నీ పోయి పూర్తిగా కొత్తకణములు వస్తాయి. కనుక, మాంసం తినడం తప్పని తెలిసి మానేసిన తరువాతకూడా, ఈ దేహం శుద్ధి అవాలంటే ఏడు సంవత్సరాలు పడుతుంది.
3. సూక్ష్మశరీరం: స్థూలశరీరాన్ని(Hardware ను) లోపలనుండి నడిపించేది సూక్ష్మశరీరం (Software). 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, అనే 17 అంశములు కలిపి సూక్ష్మశరీరం. ఇది అభౌతికము.
4. కర్మేంద్రియములు: వాక్(వాగింద్రియము-మాట్లాడేది), పాణి(చేతులు), పాద(కాళ్ళు), పాయు(మలమూత్ర విసర్జనలుచేసేది), ఉపస్థ(జననేంద్రియము) అనునవి కర్మేంద్రియములు.
5. జ్ఞానేంద్రియములు: శ్రోత్ర(చెవి-వినుట), త్వక్(చర్మము-స్పర్శ), చక్షుః(కళ్ళు-ౘూచేవి), జిహ్వా (నాలుక-రుచి ౘూచేది), ఘ్రాణ(ముక్కు-వాసన ౘూచేది) అనునవి జ్ఞానేంద్రియములు.
6. లోపలి తేజస్సు/శక్తి ఇంద్రియము: ఏ శక్తిచేత మాట్లాడుతున్నామో ఆ శక్తి వాగింద్రియము. అట్లాగే చేతికి పట్టు-విడుపు అనే శక్తి, కాళ్ళకు నడిపించే శక్తి, పాయు-మలమూత్ర విసర్జన శక్తి, ఉపస్థ-ప్రత్యుత్పత్తి శక్తి, అనే 5 శక్తులు కర్మేంద్రియములు. అట్లాగే శ్రోత్ర-వినికిడి శక్తి, త్వక్-స్పర్శ శక్తి, చక్షుః-ౘూచే శక్తి, జిహ్వా-రుచిౘూచే శక్తి, ఘ్రాణ-వాసన ౘూచే శక్తి, అనే 5 శక్తులు జ్ఞానేంద్రియములు.
7. మనస్సు: పంచకర్మేంద్రియములచేత పనిచేయించే మఱియు పంచజ్ఞానేంద్రియములనుండి సమాచారమును (information ను) గ్రహించే స్థానము మనస్సు. మనస్సుంటేనే ఏ ఇంద్రియమైనా పనిచేస్తుంది.
8. బుద్ధి: మనస్సు తెచ్చిన సమాచారమును (information ను) అర్థం చేసికొనేది, విశ్లేషించి నిశ్చయం చేసేది బుద్ధి.
9. ప్రాణమయకోశము: కర్మేంద్రియైస్సహ ప్రాణాదిపఞ్చకం ప్రాణమయకోశః. అంటే 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు కలిసి ప్రాణమయకోశం. ఇది అభౌతికం, Software. ప్రాణం కలవాడు ప్రాణి.
10. పంచప్రాణములు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు పంచప్రాణములు. ఒకే వాయువు ఐదు రూపాలలో పనిచేస్తుంది. వాయువంటే గాలి కాదు, శక్తి(Vital life force). ప్రాణము ఆత్మనుండి పుడ్తుంది. మనస్సువలన శక్తిని పొందుతుంది.
11. ప్రాణవాయువు: హృదయానికి పైన సంచరించి, ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలను నియంత్రించేది ప్రాణవాయువు. కంటియొక్క తేజస్సు, వినికిడి తేజస్సు, కూడా ప్రాణవాయువే.
12. అపానవాయువు: హృదయానికి క్రింద సంచరించి, మలమూత్రములను, పురుషులలో వీర్యమును బయటికి నెట్టేది అపానవాయువు.
13. వ్యానవాయువు: దేహమంతా వ్యాపించివున్న నాడీమండలము ద్వారా ప్రాణశక్తిని పంపిణీ చేసేది వ్యానవాయువు. ఇది దేహమంతా రక్త ప్రసరణ చేయిస్తుంది. చేయి కదలాలన్నా, తల ఊపాలన్నా, దేహములో ఏ కదలిక ౙరగాలన్నా వ్యానవాయువే చేయిస్తుంది. దీని సంచారమునకు ఎక్కడ ఆటంకం వస్తే అక్కడ కదలిక ఆగిపోతుంది.
14. ఉదానవాయువు: ఇది పైకి సంచారము కలిగి, దేహమునుండి ప్రాణము పోయేటట్లు చేస్తుంది. స్థూలశరీరం వంటి సూక్ష్మశరీరం ఏర్పడటానికి కావలసిన శక్తిని, పురుషుని వీర్యకణములలో ఉంౘుతుంది. తద్వారా మనిషికి మనిషియే పుడతాడు.
15. సమానవాయువు: ఇది నాభినందుండి జీర్ణప్రక్రియను నడిపిస్తుంది. సప్తధాతువులు దీనివలననే ఏర్పడుతాయి. అన్ని అంగములు సమంగా (Bilateral symmetry తో) ఏర్పడేటట్లు చేసేది సమానవాయువు.
16. ప్రాణశక్తి: అన్నం తింటే స్థూలదేహం బలంగా తయారవుతుంది, కానీ ప్రాణశక్తి బలంగా కాదు. ప్రాణశక్తి మనస్సునుండి ఉద్భవిస్తుంది. అంటే మనస్సుయొక్క భావోద్వేగాలవలన (emotions) ప్రాణానికి ఈ శక్తి వస్తుంది. భయంతో వేగంగా పరుగెత్తాలన్నా, భక్తితో ఉపవాసం ఉండాలన్నా ప్రాణశక్తితోనేచేస్తారు. మనలోపల ఉన్న యంత్రాంగాన్ని తెలిసికొంటే, మనలో ఉన్న అద్భుతమైన ప్రాణశక్తిని లౌకికజీవితము, భౌతికమైన సుఖాలవంటివాటికి వృథాగా వాడుకోము. స్థూలదేహం నేను కాదు అని ముందుగా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉన్న ప్రాణశక్తియే (vital life force యే), దేహాన్ని నడిపించే software.
ఓం తత్ సత్

Пікірлер
అధ్యాత్మవిద్య ప్రవచనం-23
1:10:11
అధ్యాత్మవిద్య ప్రవచనం-24
1:10:09
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 47 МЛН
అధ్యాత్మవిద్య ప్రవచనం-22
1:06:15
అధ్యాత్మవిద్య ప్రవచనం-21
1:12:00
అధ్యాత్మవిద్య ప్రవచనం-18
1:06:11
గణపతి పండుగ నాన్ స్టాప్ పాటలు - VINAYAKA CHAVITHI 2024 - GANESH CHATURTHI - VINAYAGAR  MANASASMARAM
43:10
భక్తి పాటలు తెలుగు - Bhakthi Patalu Telugu
Рет қаралды 132 М.
అధ్యాత్మవిద్య ప్రవచనం-24
1:09:23
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН