Рет қаралды 1,383
గంగలో లేదా గోదావరిలో అస్తికలు నిమజ్జనం చేయడం సంస్కృతిలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తున్నది. అస్థికలను లేదా బొక్కలను గంగలో ఎందుకు కలపాలి? ఎందుకు కలుపుతున్నారు ?
గంగలో కలపడం వెనక ప్రయోజన ఏంటి ?
ఈ సంస్కృతి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.. శిలాయుగంలో మనిషి మరణించినప్పుడు కళేబరాన్ని లేదా శవాన్ని నదిలో జారవిడిచేవారు. ఆ పార్టీవ దేహం జలచరాలకు ఆహారంగా ఉపయోగపడేది. కానీ మనిషి నాగరికత అయ్యాక ఈ పద్ధతికి స్వస్తి చెప్పాడు అందుకు బదులుగా అనగా శవానికి బదులుగా అతని ఎముకలు నదిలో జారవిస్తున్నారు ఇందు వలన ఏ ప్రయోజనం ఉంది జలచరాలకు ఆ ఎముకలు ఆహారంగా పనికిరావు పైగా పిండాలు శ్రాద్ధ కర్మల పేరిట ప్రతి నెల నెల ప్రతి ఏటా అక్కడ చెత్త పేరు పోతున్నది. నదులన్నీ కలుషితమైపోయాయి జలచరాలకు మనుగడలేని స్థితి వచ్చింది. అందుకే ఈ పద్ధతికి ప్రత్యామ్నాయంగా మరొక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది ఇక మరణించిన వారి ప్రస్తావన ఈ శ్రద్ధ కర్మలలో ఎక్కడా కనిపించదు. వారి చనిపోయిన వారి జ్ఞాపకాలు మననం చేసే సందర్భము సమయము అక్కడ కనిపించదు. ఎక్కువగా కాలేశ్వరం పుణ్యక్షేత్రం సమీపంలో ప్రవహించే గోదావరిని గంగానదిగా భావిస్తారు ఇక్కడ కేవలం ఈ శ్రద్ధ కర్మల పేరిటనై ఎక్కువగా ప్రజలు తరలివస్తారు వారంతా చనిపోయిన వారికి గుర్తుగా శ్రాద్ధ కర్మలు చేసి వాటిని ఆ చెత్తను అంతా నదిలో జారవిడుస్తున్నారు. ఈ విధంగా నదులన్నీ కలుషితమవుతున్నాయి నిజానికి భారతీయులకు నదీమతల్లి ఒక దేవత అనగా నదికినదే ఒక దేవత మరి ఆ దేవతను ఈ విధంగా మురికి చేయడం సబబేనా ఈ ప్రశ్నకు సమాధానం వెతకవలసి ఉంది.
#kaleshwaram #godavari #dakshinakashi #jayashankarbhupalpally