Cancer Specialist Dr Nori Dattatreyudu Exclusive Interview I Radiation Oncology I

  Рет қаралды 4,465

3tv Network

3tv Network

Жыл бұрын

మా స్వస్థలం కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు. పుట్టింది మాత్రం మంటాడలో. అమ్మ కనకదుర్గ. గృహిణి. నాన్న సత్యానారాయణ. నాన్న దూరమయ్యేప్పటికి నాకు నాలుగేళ్లు. అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది. మేం మొత్తం పదకొండు మంది సంతానం. అయిదుగురు అన్నలు, అయిదుగురు అక్కలు. నేనే ఆఖరివాణ్ని. నాన్న పోయాక, మాకన్నీ మా అమ్మే అయ్యింది. మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు. చివరికి పరీక్ష ఫీజుకని తన చేతికున్న ఒక్క గాజును కూడా అమ్మేసింది. నేను చిన్నవాణ్ని కావడం వల్ల ఎక్కువకాలం ఆమె పడ్డ కష్టాల్ని దగ్గర్నుండి చూశాను. మేం బాగుపడాలని తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందావిడ. అప్పుడే అనుకున్నాను, నేను వృద్ధిలోకి వచ్చాక ఆవిడ కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చాలని. నేను అమెరికా వెళ్లాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి ఆవిడ కోల్పోయినవన్నీ కొనిపెట్టాను. ఆ సమయంలో అమ్మ ఆనందానికి అవధుల్లేవు. అమ్మ చేసిన త్యాగానికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించుకోవడం కంటే జీవితానికి కావలసిందేముంటుంది. 1974లో ఉస్మానియాలో ఎండీ చేస్తున్న రోజులవి. ఆ సమయంలో అమెరికా నుండి ఓ వైద్యుల బృందం వచ్చింది. ఆ బృందానికి నన్ను ఇంఛార్జిగా నియమించారు. అప్పటికి రేడియేషన్ ఆంకాలజీలో నేను చేస్తున్న పరిశోధన చూసి వాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ బృందంలోని ఓ వ్యక్తి నాకో విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఎప్పుడైనా అమెరికా వస్తే కలవమన్నారు. ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే... ప్రపంచంలోనే అతి పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ గా పేరొందిన ‘‘స్లోన్ కేటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్’’ ఛైర్మన్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆ కార్డు పట్టుకుని అమెరికా వెళ్లాను. అప్పటికింకా మనదేశంలో క్యాన్సర్ చికిత్సలు మరీ ప్రాథమిక దశలో ఉండేవి. ఆ విషయంలో అమెరికా వెళ్లి ఏదైనా కొత్తగా చేద్దామన్నది తాపత్రయం. అమెరికాలో రకరకాల హాస్పిటల్స్ తిరిగాను. వాళ్లందరూ నన్ను- ‘‘నీవు టూమచ్ క్వాలిఫైడ్, నీకేదైనా ఉద్యోగమిచ్చినా త్వరలోనే ఇక్కడి నుండి వెళ్లిపోతావ’’ని ఉద్యోగమివ్వలేదు. చివరికి విజిటింగ్ కార్డు పట్టుకుని స్లోన్ కాటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ కెళ్లాను. నేను వెళ్లిన జులై నెలలోనే అక్కడ ఫెలోషిప్స్ అయిపోయాయి. ఎవరైనా ఫెలోషిప్ లో చేరకపోతే నాకు అవకాశమిస్తామని చెప్పారు. అదృష్టవశాత్తు ఒకరు ఫెలోషిప్ లో చేరకపోవడంతో నేను ఆ ప్రతిష్టాత్మక ఆస్పత్రిలో ప్రవేశించాను. ఇక అక్కణ్ణుండి వెనుదిరిగి చూసింది లేదు. కేవలం పదేళ్లలో ఫెలోషిప్ దగ్గర మొదలుపెట్టి ఆ ఆస్పత్రిలో అత్యున్నత స్థాయి అయిన ఛైర్మన్ హోదా దాకా చకచకా అన్ని మెట్లు ఎక్కేశాను. ఆ తర్వాత న్యూయార్క్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక ‘‘కార్నెల్ యూనివర్శిటీ’’ ఛైర్మన్ గా పదోన్నతిపై వెళ్లాను. అక్కడ లెక్కలేనన్ని పరిశోధనలు చేశాను. ప్రపంచానికి నేనేంటో నిరూపించాను. పేషెంటుకు, నర్సుకు, డాక్టరుకు రేడియేషన్ రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండకుండా... స్లోన్ మెమోరియల్ హాస్పిటల్ లో పరిశోధన చేసి 1979లో ఒక కంప్యూటరైజ్డ్ మెషీన్ కనిపెట్టాను. షీల్డెడ్ రూంలో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఎవరికీ ఎక్స్ పోజర్ ఉండదు. ఆ విధానం పేరు ‘‘రిమోట్ ఆఫ్టర్ లోడర్’’! ఈ మెషీన్ తాలూకు నియమ నిబంధనలన్నీ నేనే రాశా. అదొక రెవల్యూషన్. ఆ తర్వాత అమెరికాలోని ప్రతి హాస్పిటల్లోనూ వచ్చిందది. ప్రపంచానికంతా విస్తరించింది. వందశాతం సురక్షితం. క్యాన్సర్ నయమయ్యే రేటు కూడా గణనీయంగా పెరిగింది. అన్ని క్యాన్సర్లలోనూ ఈ మెషీన్ వాడుతున్నారిప్పుడు. అతి క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేయడంలోనే నాకు మజా అనిపిస్తుంది. అమెరికాలో నేను దానికి ఫేమస్. క్యాన్సర్ రోగులు ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, అమెరికా ఇలా అన్ని దేశాలలో ప్రఖ్యాతి గాంచిన హాస్పిటల్స్ అన్నీ సందర్శించాక.. అక్కడ వారి వల్లకాకపోతే, ‘‘డాక్టర్ నోరి దగ్గరకు వెళ్లండి’’ అని పంపుతుంటారు. ఇలాంటి సంఘటనలు గర్వంగా ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్ల కోసం కొత్త చికిత్సలు ఆవిష్కరించాలన్న కుతూహలం ఒక్కటే తప్ప, డబ్బు పట్ల ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదు. వైద్యుడిగా ఓ అద్భుతం చేసి రోగిని బతికిస్తే వచ్చినప్పుడు లభించే సంతృప్తి అనేది అన్నింటికంటే అత్యున్నతమైనది. అలాంటి సంతృప్తి డబ్బు వల్ల రాదు. క్యాన్సర్ డాక్టర్ అయినందుకు ఇదో గర్వకారణం. ఇలాంటివి ఇంకా చేయాలనే స్ఫూర్తినిస్తుంది.1988 జూన్ లో ఇక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించడం వెనక రెండు ఉద్దేశాలున్నాయి. ఒకటి బసవతారకం గారి కోరిక తీర్చడం. రెండోది... అప్పటికి ఇండియాలో మరీ ప్రాథమిక దశలో కునారిల్లుతున్న క్యాన్సర్ చికిత్సలను విప్లవాత్మకంగా మార్చివేయడం. కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఉండాలని స్టేట్ ఆఫ్ ది టెక్నాలజీతో ఆ హాస్పిటల్ పెట్టాము. పదేళ్లలో బసవతారకం హాస్పిటల్ ఇండియాలోని పది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా నిలిచింది. ఆరేళ్లలో అక్కడ బెస్ట్ హాస్పిటల్ చేస్తానని హామీ ఇచ్చాను. క్యాన్సర్ చికిత్స కోసం టాలీవుడ్, బాలీవుడ్, పొలిటికల్, బ్యూరోక్రాట్స్ ఇలా అందరు వీఐపీలు నా దగ్గరకే వస్తారు. ఛాలెంజింగ్ కేసులన్నీ నేను తీసుకుంటా. అప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, అలాగే, యశ్ చోప్రా భార్యకు మెదడుకు క్యాన్సర్, నటి శ్రీదేవి అమ్మగారికి కూడా పొరపాటు ఆపరేషన్ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను. ఇలాంటి ఉదంతాలకు లెక్కే లేదు. క్యాన్సర్ వైద్యుడికి మాత్రమే దక్కే గౌరవమది. అమెరికాలో రెండు పెద్ద టెంపుల్స్ కట్టాను. ఇక కుటుంబం విషయానికొస్తే... భార్య సుభద్ర కూడా డాక్టరే. అబ్బాయి సతీష్ప బ్లిక్ ప్రాసిక్యూటర్.అమ్మాయి ప్రియ, ఇన్ ఫెక్టివ్ డిసీజ్ లో డాక్టర్. కుటుంబ సభ్యులందరూ కూడా సేవా మార్గంలోనే ఉన్నారు. అదొక సంతృప్తి. ప్రస్తుతం నేను క్యాన్సర్ పరిశోధనల్లోనే ఉన్నాను. ఇన్నేళ్ల వైద్య ప్రస్థానంలో డాక్టర్ నోరీ చూడని ఫెలోషిప్పులు, అవార్డులు, రివార్డులు, గౌరవాలు లేవు.
#drnori #india #newyork
DOP: Kamala Kar (My youtube channel link: / f24creative )

Пікірлер: 38
@itsmejaleel4827
@itsmejaleel4827 Жыл бұрын
It is good to see that 3tv Health is interviewing this great personality 👍
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
thank you.
@rajushikha7814
@rajushikha7814 4 ай бұрын
Very good interview. Just read “Odigina Kaalam” . His autobiography. Great man
@3tvnetwork
@3tvnetwork 4 ай бұрын
Thank you. PLZ SHARE IT.
@Madhavi-yv1un
@Madhavi-yv1un Жыл бұрын
చాలా బాగుంది. మేము రెడ్ క్రాస్ తరఫున cervical cancer vaccine awareness drive చెయ్యాలా, వద్దా అని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటాము.
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Nice.
@arjunpatelweekly7395
@arjunpatelweekly7395 Жыл бұрын
Great Doctor great pholospher also.
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
thank you.
@dhotredv7140
@dhotredv7140 Жыл бұрын
Wonderful journey of a great personality and happy to hear his success story personally from him such a great Doctor hats off to him
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
thank you
@suryakumarivemuri9275
@suryakumarivemuri9275 Жыл бұрын
​@@3tvnetwork 😊😊😊
@VERA-sr6ct
@VERA-sr6ct Жыл бұрын
Thanks for full interview...
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you.
@PraveenKumar-vh8sk
@PraveenKumar-vh8sk 9 ай бұрын
వైద్యో నారాయణ హరి దేవుడు లాంటి మనిషి
@3tvnetwork
@3tvnetwork 9 ай бұрын
Thank you
@venkatramireddy6330
@venkatramireddy6330 Жыл бұрын
Great attempt and a best milestone to cherish for long time 💐💐💐💐
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
thank you.
@nareshdasari3167
@nareshdasari3167 Жыл бұрын
excellent interview sir...Best channel for health related issues..Best of luck
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you.
@kishoreraja2609
@kishoreraja2609 Жыл бұрын
Great interview...salute for your great knowledge and service sir.
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you.
@krishnamrajuraju3666
@krishnamrajuraju3666 Жыл бұрын
An excellent interview.
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you
@Dhiraj-lj8iy
@Dhiraj-lj8iy Жыл бұрын
Great doctor
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you
@Achutamanasa
@Achutamanasa Жыл бұрын
🙏
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you.
@user-mn1rl4ik1j
@user-mn1rl4ik1j Жыл бұрын
Nice
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thanks
@gayatrim3741
@gayatrim3741 7 ай бұрын
Dr gari ki padhabhi vandan lu meeku kuda
@3tvnetwork
@3tvnetwork 7 ай бұрын
Thank you. Plz share the video.
@naveenvanga543
@naveenvanga543 Жыл бұрын
What camera and lens did you use for the close-up shots? Video quality is excellent !
@3tvnetwork
@3tvnetwork Жыл бұрын
Thank you.
@rajeevrockbankapalli7793
@rajeevrockbankapalli7793 10 ай бұрын
Dr nori garu memali yela meet avvali..???
@3tvnetwork
@3tvnetwork 9 ай бұрын
Doctor garu ikkada chudatam ledandi.
@rajeevrockbankapalli7793
@rajeevrockbankapalli7793 9 ай бұрын
Akkadiki veltaniki address kavali
@lalithasingamsetty6144
@lalithasingamsetty6144 9 ай бұрын
​@@rajeevrockbankapalli7793memu treatment teesukovalante Ela please help me save my family
@padmavathidesu6561
@padmavathidesu6561 8 ай бұрын
@@3tvnetwork doctor garu ni meet avvali plzz.. MA father ki 4stage gallbladder cancer... Please want to save my fathet
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 4,9 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 9 МЛН
berenang lagi #viral #shorts
0:12
Kakek Endo Family
Рет қаралды 11 МЛН
KINDNESS ALWAYS COME BACK
0:59
dednahype
Рет қаралды 14 МЛН
how to make a dratti dratte making #viral #dratti #dratte
0:15
offical Blacksmith
Рет қаралды 44 МЛН
小天使为了救黑天使,献出自己的眼睛#short #angel #clown
0:50
My little bro is funny😁  @artur-boy
0:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН