Рет қаралды 31,016
#kakarakaya #charepallivantalu#bramhanavantalu
how to make kakarakaya pindimiriyam కాకరకాయ పిండీమిరియం ఒక్కసారి తింటే ఇంక వదలరు
how to make kakarakaya pindimiriyam కాకరకాయ పిండీమిరియం ఒక్కసారి తింటే ఇంక వదలరు
కాకరకాయ పిండీమిరియం ,
కావలసినపదార్థములు
కాకరకాయలు ,కందిపప్పు ,శనగపప్పు ,పసుపు , మినపప్పు ,చింతపండు ,
మిరియాలు ,ఎండుమిర్చి ,ఎండుకొబ్బరి , ఆయిల్ ,ఆవాలు ,ఇంగువ ,నెయ్యి ,కరివేపాకు ,
తయారుచేసే విధానము ,
ముందుగా ఎండుమిర్చి ,ఎండుకొబ్బరి ,మినపప్పు ,శనగపప్పు మిరియాలు ,కొద్దిగా ఆయిల్ , వేసుకొని వేయించుకోవాలి తరువాత
వేడి తగ్గినతరువాత మిక్సీలో వేసి పొడి చేసి పక్కనపెట్టుకోవాలి ,
తరువాత శనగపప్పు ,కందిపప్పు , ఉడకపెట్టుకోవాలి ,
తరువాత కాకరకాయ తరిగిపెట్టుకొని అందులో నీళ్లు ,పసుపు ,ఉప్పు ,
వేసుకొని , ఉడికించుకోవాలి ఉడికించినకాకారకాయ ముక్కలు నీళ్లు అన్ని
వంచేసుకొని ముక్కలు మాత్రమే ముందుగా ఉడికించిన కందిపప్పు ,శనగపప్పు , లో వేసుకొని కొద్దిసేపు ఉడికించాలి , తరువాత చింతపండు గొజ్జు వేసుకోవాలి,
ముందుగా ఎండుమిర్చి ,ఎండుకొబ్బరి ,మినపప్పు ,శనగపప్పు మిరియాలు ,పొడిచేసిపెట్టుకున్న పొడిని వేసుకోవాలి తగినంత ఉప్పు
వేసుకోవాలి , కొద్దిగా ఉడికించుకొని తిరగబాత నెయ్యి ,ఆవాలు ,ఇంగువ ,
వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ పిండీమిరియం , రెడీ మీరుకూడా చేసుకొని ఆరోగ్యాంగాఉండండి ,