Рет қаралды 56,001
దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది గన్నవరం విమానాశ్రయం పరిస్థితి. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాది కావస్తున్నా... కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా... ఒక్క విమానం కూడా విదేశాలకు వెళ్లలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో... విదేశీ విమానాలకు అనుమతి ఇచ్చే విషయంపై సందిగ్ధత వీడటం లేదు. ఎటూ తేల్చుకోలేక పౌరవిమానయానశాఖ మల్లగుల్లాలు పడుతోంది. సింగపూర్, దుబాయ్ దేశాలకు సేవలు సర్వీసులు నడపాలని ప్రణాళికలు రచించిన విమాన సంస్థలు వెనకడుగేశాయి. ఫలితంగా... రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడింది. వ్యాపారానికి అనువైన నగరంగా మారాల్సిన ఆంధ్రప్రదేశ్... సమస్యలతో సతమతమవుతోంది.