Рет қаралды 47,526
దండి స్వాముల గర్వము అణచుట |Sripada Srivallabha Charithamrutham (TELUGU) -21
www.nutrientfo...
ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt
voice, Singer , musician : Jayanth Varma
Licensed by : Lord Dattatreya Spiritual Society
Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu
Background Image source from : pixabay.com
www.flickr.com
www.pexels.com/
script : అధ్యాయము 21 భాగము 1
దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట
సాధకులకు స్థానశుద్ధి, భావశుద్ధి ఆవశ్యము
నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞమేరకు గురుచరణునితో కలసి మాంచాల గ్రామదర్శనమునకు బయలుదేరితిని. దారి మద్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మవిద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, "అయ్యా! వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదులవారు అంటిరి గదా! ఆ మహాభాగ్యుడెవరు ? అతడు ఏ కాలములో వచ్చువాడని" నేను ప్రశ్నించితిని. అంతట గురుచరణుడిట్లనియె! అయ్యా! శంకరభట్టు! అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్యసంకల్పము వలన గాక మహాతపస్వులు అరుదెంచవీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్ఛారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చట నున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాళము నందలి దిశదిశల నుండియూ భావతరంగములు ఎల్లప్పుడునూ ప్రసరించుచునే యుండును. పవిత్రభావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబలశక్తి సంపన్నములయినపుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశము నందు దుష్టములైన భావతరంగములున్న యెడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను. భావశుద్ధి కలిగినవాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగియుండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును గాని, అన్నమును గాని స్వీకరింపవలెను. వేదవేదాంతములందు మహాపండితుల మనుకొనువారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారివలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓఢ్రదేశమునందలి ...............