@--------పాట--------@ పల్లవి :-- కలవరములో కన్నీరు తుడిచి ఆదరించినావు ఆదుకున్నావు కలవరములో కన్నీరు తుడిచి ఆదరించినావు నన్నాదుకున్నావు--1 నిండు మనస్సుతో నీ సన్నిధిలో సాగిలపడెద నా యేసయ్యా --2 సాగిలపడెద నా యేసయ్యా --1 " కలవరములో " ( 1 )- అనేక బాధలతో క్షేమము లేక గాయపరచబడి బ్రతుకు చుండగా--2 నీ కనుదృష్టి నాపై చూపి క్షేమమిచ్చినావు నా యేసయ్యా --2 క్షేమమిచ్చినావు నా యేసయ్యా --1 హల్లేలూయ హల్లేలూయ ఆరాధన నీకే నా యేసయ్యా --2 ( 2 )- నా యెడల చూపిన శాశ్వత కృప మరణము నుండి విడిపించెను--2 నీ కుడి చెయ్యి నాపై చాపి బలపరిచినావు నా యేసయ్యా --2 బలపరిచినావు నా యేసయ్యా --1 " హల్లేలూయ " ( 3 )-పరిశుద్దులు కూడి పాడుచుండగా నగరమును నాకై నిర్మించినావు---2 సుందరమైన ఆ నగరముకై నే వేచియుందును నా యేసయ్యా --2 నే వేచియుందును నా యేసయ్యా -1: " కలవరములో "-------*-------