Рет қаралды 21,973
పగలు రాత్రి తేడా లేకుండా పోగుపోగు జతచేసి... పూసపూస కలిపి గుచ్చి... తాను అనుకున్న విధంగా వస్త్రం రూపొందిస్తాడు ఆ కళాకారుడు. రంగు రంగుల సన్నని దారాలతో... వస్త్రాలపై అద్భుత కళా ఖండాలు సృష్టించగల ప్రతిభ, నైపుణ్యాలు ఆ నేతన్నల సొంతం. గుడిలో దేవతల్ని కన్నుల పండుగ్గా అలంకరించాలన్నా... వారిని కొలిచే మనుషులు అందంగా కనిపించాలన్నా... నేతన్నల చేతులు మగ్గాలపై నాట్యం చేయాల్సిందే. అలాంటి... కష్టజీవి, కళా జీవి క్రమంగా మనుగడ కోల్పోతున్నాడు. ఇందుకు నాణ్యమైన పట్టుచీరలకు కేంద్రంగా ఉండే ధర్మవరం చేనేత కళాకారులూ అతీతం కాలేదు. కరోనా ప్రభావంతో రెండేళ్లు కోలుకోలేని నష్టాలు చూసిన వారిని ప్రభుత్వాలు కూడా చిన్నచూపే చూస్తున్నాయి. దాంతో ఆ చేనేతల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. మరి, 120 ఏళ్లలకుపైగా చరిత్రతో పెళ్ళి పట్టు చీరలకు ప్రఖ్యాతి పొందిన ఆ ప్రాంత నేతన్నలు ఎందుకు ఇంత దారుణమైన ఆర్థికకష్టాలు చవిచూస్తున్నారు? మార్కెట్లో చీరల అమ్మకాలు తగ్గి, నిల్వలు పేరుకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి..? ఏం చేస్తే ఆ నేతన్న బతుకులు మారుతాయి.
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------