Рет қаралды 159,587
సనాతన ధర్మం గొప్పతనం!
మన భారతీయ సనాతన ధర్మంలో కులాల కుమ్ములాటలు లేవు. ఉన్నదల్లా సంఘం సజావుగా నడవడానికి ఏర్పడిన నాలుగు వర్ణాలున్న వ్యవస్థ మాత్రమే. అప్పట్లో అన్ని వర్ణాలవారికీ సమాన ప్రాధాన్యతే ఉండేది. కులవృత్తులన్నీ గౌరవప్రదమైనవే. రామాయణ భారతాలలో కూడా ఈ విషయాన్ని సూచించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రాముడు ఆటవికుడైన గుహుణ్ణి ప్రాణ స్నేహితుడిగా భావించాడు. వ్యాసుడు సూతుడైన సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడైనా సరే శూద్రవంశంలో పుట్టినవాడు తనకంటే ధర్మవేత్త అయితే అతని ముందు మోకరిల్లేవాడు. ఈ విషయాన్ని తెలిపే కథ ఒకటి మనకు మహాభారతం అరణ్యపర్వంలో కనిపిస్తుంది. అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు వస్తాడు మార్కండేయ మహర్షి. ఆ సమయంలో ధర్మరాజు అడిగిన అనేక ధర్మసందేహాలకు సమాధానమిస్తూ పతివ్రతామాహాత్మ్యాన్ని వివరిస్తాడు. ఆ సందర్భంలో మార్కండేయ మహర్షి ప్రవచించిన కౌశిక - ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం.