యక్ష ప్రశ్నలు | Yaksha Prasnalu | Rajan PTSK | Ajagava

  Рет қаралды 261,019

Ajagava

Ajagava

Күн бұрын

వ్యాస మహాభారతంలో చెప్పబడిన 124 యక్ష ప్రశ్నలు
చిన్నపిల్లలెవరైనా తల్లిదండ్రులను అదేమిటీ ఇదేమిటీ అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే.. ఓరేయ్ ఇంకా యక్షప్రశ్నలు ఆపు అంటూ విసుక్కుంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అసలీ యక్షప్రశ్నలు ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పారు? అసలు మొత్తం ఇవి ఎన్ని ప్రశ్నలు? చిరస్మరణీయమైన ఈ ప్రశ్నలు వెనుక ఉన్న కథ ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
మహాభారతంలోని అరణ్యపర్వం చివరిలో మనకీ యక్షప్రశ్నలు కనబడతాయి. శకుని మాయాజూదం వల్ల ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాల వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వస్తుంది. ఇక తమ అరణ్యవాసం త్వరలో ముగియబోతుందనగా పాండవులు కామ్యకవనం నుండి ద్వైతవనం వచ్చి నివసిస్తుంటారు. ఇదిలా ఉండగా, ఒకనాడొక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చి, చెట్టుకొమ్మలకు తగిలించుకున్న తన అరణి అటుగా పరిగెడుతున్న ఒక జింక కొమ్ముల్లో చిక్కుబడిపోయిందని, ఆ జింక అరణ్యంలోకి పరిగెట్టి పోయిందనీ, తన అరణి తనకు తిరిగి తెచ్చివ్వమనీ ప్రాధేయపడతాడు. అరణి అంటే హోమం చేసుకోవడానికి.. మథించి అగ్ని పుట్టించే కర్ర. పాపం ఆ బ్రాహ్మణుని దీనాలాపన విని, ధర్మరాజుతో సహా మిగిలిన పాండవులంతా కూడా ఆయుధాలు ధరించి, అడవిలోకి పరుగుతీశారు. కానీ వారికా జింక కనిపించినట్టే కనిపించి, మరలా దొరకకుండా పారిపోయింది. వెతకి వెతకి అలసిపోయిన ఆ పాండవులంతా ఒక మర్రిచెట్టు క్రింద కూర్చుని అలసట తీర్చుకోసాగారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో.. “అన్నయ్యా! మనం ఎన్నడూ ధర్మం తప్పలేదు. ఏ విషయంలోనూ అలసత్వం చెయ్యలేదు. అందరికీ మంచి చేసే మనం ఎందుకని ఇంతలా కష్టపడవలసి వస్తుంది” అన్నాడు విచారంగా. అప్పుడు ధర్మరాజు.. “నాయనా నకులా! ఆపదలకు హద్దులూ కారణాలూ ఉండవు. ఇదివరకు మనం చేసిన పాపపుణ్యల కారణంగానే సుఖదుఃఖాలు వస్తుంటాయి. అన్నిటికీ కర్మే మూలకారణం” అన్నాడు. అప్పుడు భీముడు కలగజేసుకుని.. “ఆనాడు ద్రౌపదిని దాసీ స్త్రీవలే సభలోనికి ఈడ్చుకువచ్చినవాడిని చంపకుండా వదిలేశాను చూశావా? ఆ తప్పుపని వల్లే ఈరోజు మనకీ కష్టం” అన్నాడు. అప్పుడు అర్జునుడు.. “ఆనాడు కర్ణుడు నిండు సభలో మనల్నీ, ద్రౌపదినీ అవమానిస్తూ మాట్లాడుతుంటే, అతడిని తెగవేయకుండా ఉండిపోయాను. ఆ కర్మవల్లే మనకీ దుస్థితి” అన్నాడు. ఇంతలో సహదేవుడు.. “మాయాజూదంలో ఆ శకుని మనల్ని ఓడించినప్పుడే వాడిని చంపెయ్యాల్సింది. కానీ వదిలివేశాను. ఆ పాపమే ఇప్పుడు మనకీ దురవస్థ కలిగించింది” అన్నాడు. అప్పుడు ధర్మరాజు వారిని వారిస్తూ, నకులునివైపు తిరిగి నాయనా అందరం దాహంతో అలమటించిపోతున్నాం. ఈ దగ్గరలో మంచినీళ్ళ సరోవరం ఏదన్నా ఉందేమో, ఈ చెట్టెక్కి చూడు” అన్నాడు. నకులుడు వెంటనే చెట్టెక్కి.. అక్కడకు కాస్త దూరంలో నీళ్ళకొలను చుట్టూ పెరిగే వృక్షాలను, నీటి పక్షులను చూశాడు. ఆ విషయమే అన్నగారికి చెప్పాడు. అటుపై అతని ఆదేశంతో.. దొప్పలతో నీళ్ళు తీసుకువస్తానని చెప్పి, ఆ సరోవరం వైపుగా బయలుదేరాడు.
అక్కడకు వెళ్ళిన నకులుడు, గబగబా కొలనులో నీటిని దోసిలితో తీసుకుని త్రాగబోయాడు. ఇంతలో అతనికి.. “నాయనా ఆగు. ఇది నా సరోవరం. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాక మాత్రమే నీవు ఈ నీళ్ళు త్రాగాలి” అన్న అశరీరవాణి వినిపించింది. కానీ అప్పటికే విపరీతమైన దాహంతో ఉన్న నకులుడు, ఆ మాటలను పట్టించుకోకుండా, ఆ జలాన్ని త్రాగాడు. అంతే వెంటనే అతను అచేతనుడై పడిపోయాడు. ఎంతకీ నకులుడు రాకపోయేసరికి సహదేవుడిని పంపించాడు ధర్మరాజు. అతను కూడా ఆ అశరీరవాణి హెచ్చరికను లెక్కచేయకుండా ఆ సరోవరంలో నీటిని త్రాగి, అచేతనంగా పడిపోయాడు. వాళ్ళ కోసమని ఒకరి తరువాత ఒకరుగా వెళ్ళిన అర్జునుడు, భీముడూ కూడా అలానే అచేతనులుగా మారిపోయారు. నీళ్ళకోసం వెళ్ళిన తన తమ్ముళ్ళెవరూ తిరిగిరాకపోవడంతో ధర్మరాజు కూడా ఆ సరోవరం వద్దకు వెళ్ళాడు. అక్కడ అలా పడి ఉన్న తన తమ్ముళ్ళను చూసి విలపించాడు. వారి శరీరంపై గాయలు లేకపోవడంతో, వాళ్లు ఎవ్వరితోనూ పోరాడలేదన్న విషయం అర్థమవుతోంది. ఆ నీళ్ళలో దుర్యోధనుడు విషప్రయోగం చేశాడేమో అన్న అనుమానం కలిగిందతనికి. కానీ అలా అచేతనంగా పడి ఉన్న తన తమ్ముల ముఖాలలో అటువంటి ఛాయలేవీ కనిపించలేదు. ధర్మరాజుకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. అలా అనేక ఆలోచనలు తనను చుట్టుముడుతుండగా, అన్యమనస్కంగానే ఆ సరస్సు దగ్గరకు వెళ్ళాడు.
అప్పుడు మరలా ఆ శరీరవాణి.. “రాజకుమారా! నేను చేపలనూ, నాచునూ తిని బ్రతికే కొంగను. నీ తమ్ముళ్ళను యమలోకానికి పంపించింది కూడా నేనే. నీవైనా నా ప్రశ్నలకు జవాబు చెప్పి, అప్పుడు ఆ నీళ్ళు త్రాగు. లేదంటే నీవుకూడా యమపురికి పోకతప్పదు” అంది. అప్పుడు ధర్మరాజు.. “నీవు కచ్చితంగా పక్షివి మాత్రం అయ్యుండవు. నా తమ్ముళ్ళను ఈవిధంగా అచేతనలుగా మార్చివేశావంటే నీవు ఏ దేవతా పురుషుడవో అయ్యుండాలి. దయచేసి నీవెవరో చెప్పు” అన్నాడు వినయంగా. అప్పుడు తాటిచెట్టంత ఎత్తున్న ఒక భయంకరాకారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతగాడు ధర్మరాజుతో.. “రాజా! నేనొక యక్షుడను. ఈ సర్ససు మీద అధికారం నాదే. నీ సోదరులు నా మాటను అలక్ష్యం చేసి ఇలా దుర్మరణం పాలయ్యారు. నువ్వు వారికి మల్లే దుస్సాహసం చేయకుండా, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు” అన్నాడు. అప్పుడు ధర్మరాజు “ఓ యక్షా.. నా బుద్ధిమేరకు నేను నీ ప్రశ్నలకు జవాబివ్వడానికి ప్రయత్నిస్తాను. అడుగు” అన్నాడు. అప్పుడా యక్షుడు తన ప్రశ్నల్ని అడగటం మొదలుపెట్టాడు. అతని ప్రతీ ప్రశ్నకూ ధర్మరాజు సమాధానం కూడా ఇవ్వసాగాడు. ఆ ప్రశ్నోత్తరాలు ఇలా కొనసాగాయి.
Rajan PTSK
#YakshaPrasnalu #Ajagava #Bharatam #RajanPTSK

Пікірлер: 253
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
ధర్మం తప్పనివాడు ఏ స్థితిలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు🙏
@sureshps9123
@sureshps9123 2 жыл бұрын
1000%correct sir
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 3 жыл бұрын
మా చిన్నప్పుడు మా నాయనమ్మ మా జేజినాయన యక్ష ప్రశ్నల గురించి చెప్పేవారు మీరు చెబుతుంటే గతం చిన్ననాటి ఆనందం ధన్యవాదాలు గురువుగారు
@sarojinibhallamudi1875
@sarojinibhallamudi1875 3 жыл бұрын
Telusukovalasinasandehalu Xd
@satyanarayanapavuluri3253
@satyanarayanapavuluri3253 3 жыл бұрын
అద్భుతమైన వివరణ.అందరూ తెలుసుకోదగిన అంశాలు.బాగా తెలియజేసారు
@arunavennapusa2129
@arunavennapusa2129 2 жыл бұрын
Many many thanks guruvu garu
@srinivasulubodagala2643
@srinivasulubodagala2643 3 жыл бұрын
మీరు ఇలాంటి మంఛివిషయాలుతెలుపుచున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏
@cocainecoffee140
@cocainecoffee140 3 жыл бұрын
చాలా చాలా మంచి ప్రయత్నం చేశారు.ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందాను.మీకు కృతజ్ఞతలు.మీరు సంస్కృతం నేర్పితే నేర్చుకోవాలని ఉంది ఇట్లు మీ అభిమాని.
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
ఆశ్చర్యం!!!!సనాతనధర్మం మళ్ళీ తమ బోటి వారివల్ల,,, చిగురిస్తోంది...జై సనాతన ధర్మం,,, జై శ్రీరామ్,,, గురుదేవులకు పాదాభివందనం,,, తమరి ప్రయత్నానికి దాసోహం.
@velugulanagabhushanam1054
@velugulanagabhushanam1054 3 жыл бұрын
చాలాకాలం నుంచి యక్షప్రశ్నలు గురించి వెదుకుతున్నాను నీవు పంపి నందుకు చాలా చాలాtnqs
@tharabainadakuduru7782
@tharabainadakuduru7782 11 ай бұрын
🙏guru devo bhava🙏maatha parameswara🙏 Guruvu gariki padhabhi vandhamulu🙏🙏🙏🙏🙏
@kelavathsravanthi8764
@kelavathsravanthi8764 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు స్వామి ఇప్పటివరకు నాకు తెలియని విషయాలు అన్ని తెలుసుకున్నాను
@prasadpentakota6901
@prasadpentakota6901 3 жыл бұрын
అయ్యా మీరు ఇలాంటి ధర్మ బోధలను మరెన్నో తెలియజేయాలనీ కోరుకుంటున్నాము, ఈ భూమి పై మీరు కొనసాగినంతకాలం ఇలాంటి సత్యమైన విషయాలు బోడించమని, డబ్బు మాత్రమే ప్రధానమైన ఈ రోజుల్లో, ధర్మం ఎంతగొప్పదో తెలియజేయండి 🙏🙏🙏🙏🙏
@venkataramaiahm7913
@venkataramaiahm7913 7 ай бұрын
ప్రతి వారు తమ సంపాదన లో 10 శాతం అన్నదానానికి ప్రతి నెలా ఖర్చు చేయగలిగితే అంతకు మించిన ధర్మం వేరొకటి లేదు.😢
@balajibobbili6652
@balajibobbili6652 Жыл бұрын
చాలా మంచి సమాచారం గురువుగారు
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 ай бұрын
Dhanyavadamulu Guruvu garu..
@SanthiSagar
@SanthiSagar 3 жыл бұрын
గురుదేవులకు నమోవాకములు
@lingaswamy7148
@lingaswamy7148 3 жыл бұрын
ఇంకా మహాభారతం ఇలా వివరించగలరు
@lalithasudam8209
@lalithasudam8209 3 жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు స్వామీ.
@shsekhar28
@shsekhar28 3 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏dhanyavadhalu rajan garu..
@haribabu4456
@haribabu4456 3 жыл бұрын
I like 15 th question. Question:how the humanity comes? Answer:Fear. Thanks for 124 questions and answer
@GK-yj2sq
@GK-yj2sq 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@saikumarvankhara1318
@saikumarvankhara1318 3 жыл бұрын
Thank you, sir.🙏
@sureshnainaboina3400
@sureshnainaboina3400 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు
@mutyalarao
@mutyalarao 2 жыл бұрын
మీ రాజన్...ptsk మీ ముగింపు వాక్యాలు మధురం
@jyothyg6653
@jyothyg6653 2 жыл бұрын
Many thanks for such wonderful videos 🙏🏻
@Vramadevi-b2g
@Vramadevi-b2g 4 ай бұрын
Since long I wanted to know these questions .Thank you very much.😊😊
@velagapudivrkhgslnprasad7939
@velagapudivrkhgslnprasad7939 3 ай бұрын
Very very excellent, Sir.
@sureshchatriya1848
@sureshchatriya1848 Жыл бұрын
This incident proved the importance of Dharmaraju in Pandavas. If he had not answered these questions, his four brothers wouldn't have been alive for the Mahabharat war. I think his importance proved second time when they went to Heaven. I wonder if Dharmaraj, Vidura, and Yama are same. I heard this story and some Punyam fell in my account. ❤
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 3 жыл бұрын
background veena music bagundi
@lakshmilavanya5676
@lakshmilavanya5676 3 жыл бұрын
Thank you 🙏
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 Жыл бұрын
🚩🙏🏻 Thanks
@balrambomma5724
@balrambomma5724 3 жыл бұрын
ధన్యవాదాలు ఈ రోజు యక్ష ప్రశ్నలు అన్ని వినగలినను మీ ఛానల్ ద్వారా.
@sivaramakrishnareddytangir9577
@sivaramakrishnareddytangir9577 3 жыл бұрын
God bless you for posting this
@pidugudurgaprasad3354
@pidugudurgaprasad3354 3 жыл бұрын
Jai sree rama jaya sitarama janakirama govindarama gopalarama jaya sree rama
@venkymy9502
@venkymy9502 3 жыл бұрын
Wonderful
@mogilipalemyesuratnam262
@mogilipalemyesuratnam262 3 жыл бұрын
Veryhappy. Sir
@svreddy6654
@svreddy6654 3 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@ramanareddy9641
@ramanareddy9641 3 жыл бұрын
Heso good
@venkatasrinivasaraobayyana8545
@venkatasrinivasaraobayyana8545 2 жыл бұрын
🙏🙏🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
Baga chepparu👍👍👍
@sambasivaraosamarla4889
@sambasivaraosamarla4889 4 ай бұрын
🙏🙏🙏
@malladinarayanasarma
@malladinarayanasarma 3 жыл бұрын
ప్రశ్నలు _ from 6.40 MtS
@bhaskarasarma8
@bhaskarasarma8 Жыл бұрын
ఆశ్చర్యం అంటే ఏమిటి అని అడుగుతాడు. ఆ ప్రశ్న ఇందులో వివరించారా?
@vidhushaarla1669
@vidhushaarla1669 3 жыл бұрын
Kasimajili kathalu kuda continue cheyandi
@ismartkalavathi3060
@ismartkalavathi3060 3 жыл бұрын
Good 🙏🙏
@kalyansatishp2517
@kalyansatishp2517 3 жыл бұрын
ఆ యక్షడు నహుషుడు అనే చక్రవర్తి అని అతను ఇంద్ర పదవి ని పొంది కొన్ని తప్పిదాలు వలన అగస్త్య మహర్శి వారు శాపం వల్ల అలా సరస్సు వద్ద యక్షడు గా ఉండవల్సి వచ్చింది అని తుదకు దర్మరాజు వలన శాపవిముక్తి కలిగింది అని విన్నాను.
@suribabunookala5467
@suribabunookala5467 3 жыл бұрын
గురుగారికి శతకోటి నమస్కారాలు. మంచి మంచి విషయాలు చెప్పారు.
@lakshmipapai8299
@lakshmipapai8299 3 жыл бұрын
Dhanyavadalu guruvugaru neeku enni krutajnatalu cheppina takkuve namaste sir
@muttireddisrinivasrao2302
@muttireddisrinivasrao2302 3 жыл бұрын
TQ bro
@challannasastry94
@challannasastry94 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharathb7319
@sharathb7319 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vedhageeshpath6677
@vedhageeshpath6677 Жыл бұрын
Mahabaratam and ramayanam loni yudda aastralu telipe books cheppa galaraa sir
@vijayswami.786
@vijayswami.786 3 жыл бұрын
సుప్పర్ అన్నగారు
@gamergirls546
@gamergirls546 2 жыл бұрын
GGOD NARRATION
@shashivadhan2.o858
@shashivadhan2.o858 3 жыл бұрын
Main content starts at 6:38
@swamy746
@swamy746 Жыл бұрын
లోభం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి
@hiii9389
@hiii9389 Жыл бұрын
Greed పిసినారితనం
@krishnagmr9672
@krishnagmr9672 2 жыл бұрын
గురువుగారు నాకు మొత్తం మహాభారతం చదవాలని ఉంది.ఏది మంచిదో మొత్తం ఉంటుందో వ్యాసులవారు ఎలా వ్రాసారో అలా కావాలి.నేను పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు వ్రాసిన మహాభారతం చదివాను.ఎవరైనా చెప్పగలరు
@nageswarasastry6150
@nageswarasastry6150 Жыл бұрын
పిలకా గణపతి శాస్త్రి గారు వ్రాసిన వచన భారతం బాగుంటుంది.
@iam_raj_talari9590
@iam_raj_talari9590 2 жыл бұрын
🙏
@rangavajjula1941
@rangavajjula1941 3 жыл бұрын
🙏🙏🙏🙏
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
అజగవ చానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు ! యక్షప్రశ్నలు అన్నీ వివరంగా ఒకే వీడియో లో వినిపించినందుకు నా ధన్యవాదములు 🙏👌 శ్రీ మాత్రే నమః 🙏🌹🌹
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే గురుదేవోభవ 🚩🌹👏 నమస్తే మాత పరమేశ్వరా 🚩🌹👏
@Harikanth798
@Harikanth798 3 жыл бұрын
రాజన్ ptsk గారు.....నేను పెద్ద బాలశిక్ష లో ఈ విషయాలు చదివాను....మీరు వీడియో రూపం లో అందించినందుకు ధన్యవాదములు...
@devisrilakshmi8703
@devisrilakshmi8703 3 жыл бұрын
ఎప్పటినుడో తెల్సుకోవాలనుకున్న మీ ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను... మీకు నిజంగా ధన్యవాదాలు 🙏🙏🙏
@anils410
@anils410 3 жыл бұрын
యక్ష ప్రశ్నలు వాటి జవాబులు తెలియజేసిన మీ పాద పద్మములకు సాష్టాంగ శతకోటి ప్రణామాలు 🙏
@akularajasekhar9736
@akularajasekhar9736 3 жыл бұрын
అచ్చమైన తెలుగు అద్భుతమైన వివరణ మహదానందంగా ఉంది
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
యక్ష ప్రశ్నలు గురించి బాగ వివరించారు...🙏🌼
@bhupathidev6266
@bhupathidev6266 3 жыл бұрын
నహుషుని కదవేరు. నహుషుడు శాపంవలన సర్పరూపంలో ఉంటాడు. అరణ్యవాసంలో ఉన్నభిముని నహుషుడు బంధిస్తాడు. అప్పుడు కూడా నహుషుడు అడిగిన ప్రశ్నలకు ధర్మారాజు సమాధానాలు చెపుతాడు. ఆవివరాలనుకుడా తెలియజేయగలరని కోరుకుంటూ, ఇలాగే మీకు తెలిసిన ధర్మాన్ని తెలిజేసే విషయాలను తెలియజేయగలరు. నమస్కారములతో
@kalyanchakravarthy1220
@kalyanchakravarthy1220 3 жыл бұрын
Thank you so much awaiting for these questions from long back. Jai Shree Ram jai Shree Krishna 🕉️🙏
@sankar341
@sankar341 3 жыл бұрын
Main content starts after 6:00
@chandut2610
@chandut2610 3 жыл бұрын
ఎన్నో రోజులుగా దీని గురించి వెదుకుతున్నాను. 👍 థాంక్స్
@rameshbusetty
@rameshbusetty 3 жыл бұрын
విషయ వివరణకు మీకు మా కృతజ్ఞతతో నమస్సులు.
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 3 жыл бұрын
కాశీ మజిలీ కథలు ఈవారం రాలేదు అది కూడా పంపించండి
@మనసులోమాట-ఫ6ణ
@మనసులోమాట-ఫ6ణ 3 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 భూమి కన్న బరువైనది ఏది? జ. తల్లి దీనికి మి విశ్లేషణ కావాలి... సాక్షాత్తు యమధర్మరాజు అంశమైన ధర్మరాజు ను యమధర్మరాజు పరీక్షించడం ఒక గొప్ప విషయం. ఈ కథ ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది.. మీరు చెప్తే వినడం వేరు ఇతరులు చెప్తే వినడం వేరు.
@bhaskarasarma8
@bhaskarasarma8 Жыл бұрын
తల్లి భూమి కంటె గొప్ప తనం కలది.భూమి పంచభూతాలలో ఒకటి.అది మనలను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది.అంతకంటే ఎక్కువ రక్షణ కల్పిస్తుంది తల్లి మనకు.
@paadammahesh8395
@paadammahesh8395 3 жыл бұрын
మేమే మిమ్మల్ని యక్ష ప్రశ్నలు గురించి అడుగుదాం అనుకున్నాం, మీరే అప్లోడ్ చేశారు 🙏🙏🙏🙏🙏🕉️
@kariggitrinath5586
@kariggitrinath5586 3 жыл бұрын
బలే విషయాలు పెడతారండోయ్ అన్నీ నా మదిలో మెదిలే సంశయాలే మీ హృది నుంచి వస్తున్నాయ్
@sowbhagyalakshmiboddu952
@sowbhagyalakshmiboddu952 3 жыл бұрын
Good message
@vedh9099
@vedh9099 3 жыл бұрын
మీ రిప్లై బాగుంది
@lankaapparao9793
@lankaapparao9793 2 жыл бұрын
Ikkada oka vishayam choosara? Pandavula lo 4ru maranishe bratikinchagalige vaadu dharmaraju matrame Anduke atani aayudham dharmam
@srinivasgangula406
@srinivasgangula406 3 жыл бұрын
ఇంత చక్కగ వివరించి చెప్పిన మీకు ధన్యవాదాలు గురవుగారు🙏🙏
@djayaramnaik8268
@djayaramnaik8268 Жыл бұрын
ప్రాచీన కాలంలో పుస్తకాలు ఎలా రాసేవారు?
@RaviKumar-ny1hn
@RaviKumar-ny1hn 3 жыл бұрын
అజగవ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@narasimhamurty4818
@narasimhamurty4818 3 жыл бұрын
ఆర్యా, మంచి విషయాలు సమాజం కి అందిస్తున్నారు, ధన్యవాదములు
@bhargavasitiraju7257
@bhargavasitiraju7257 3 жыл бұрын
Arya , meeru share chestey Inka baguntundhi .... Sms bagundhi...
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 жыл бұрын
I Love this video 😊💐 fantastic very humourous and hilarious 😂 some answers were very good 👍 Good going 💯👍🙏🌹
@lakshmipmk1659
@lakshmipmk1659 3 жыл бұрын
🙏🙏
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Came here through your quora answer. Found the diamond content❣️ . Keep going
@swethasridharachary5008
@swethasridharachary5008 3 жыл бұрын
Wow appatinundo clear ga telusu kovalani anukunna😄
@srisri7093
@srisri7093 3 жыл бұрын
Thank you sir... Kani aa akhshuni peru, aa sarovaram peru cheppandi sir
@sridharbandavaram9130
@sridharbandavaram9130 3 жыл бұрын
Mi bhashaa vidhaanam gammathugaa undi...edo jok chesthunnatlu
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏
@sriyafashions2366
@sriyafashions2366 3 жыл бұрын
గురువుగారు వర్ణించలేని ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న మీకు మా పాదాభివందనాలు
@bhargavasitiraju7257
@bhargavasitiraju7257 3 жыл бұрын
Namaskaram Guruji.
@dhaksithrajkumarraju9878
@dhaksithrajkumarraju9878 3 жыл бұрын
Munduga guruvugarki 🙏 namsakaram
@meenakshi6416
@meenakshi6416 3 жыл бұрын
మీ కు శత కోటి వందనాలు🙏🙏🙏
@dattuavm5392
@dattuavm5392 3 жыл бұрын
Nanu sanskruta basha pracharika ga chala manikin exams kattinchanu Yaksha prasnalu ma examlo course miru chapputunnanduku chala santosham
@cheemalaashok
@cheemalaashok Жыл бұрын
Thank you🙏🙏
@g.v.l.satyanrayana1806
@g.v.l.satyanrayana1806 6 ай бұрын
Guruvuluku danyavadamulu 22:27 22:27 Namaste sir. .
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 3 жыл бұрын
Very good question . Good information given by your channel
@princejag
@princejag 3 жыл бұрын
Well explained topic.
@Gandapalli
@Gandapalli 11 ай бұрын
ధన్యవాదాలు ఈ వీడియో చేసిన వారికి
@EshwarNarmada
@EshwarNarmada 3 жыл бұрын
చాలా చాలా చాలా ధన్యవాదాలు
@pavankumargrandhi229
@pavankumargrandhi229 3 жыл бұрын
Mee valla maaku gnana moolikalu andhu thunai kruthagnulam.
@viswanathk.v5968
@viswanathk.v5968 3 жыл бұрын
Super sir. Adbutam
@sriram4461
@sriram4461 3 жыл бұрын
Jai sri ram
@murthybommalla413
@murthybommalla413 2 ай бұрын
ఈ కలికాలంలో ఈ విషయాలు తెలుసుకుంటే కనీసం లో కనీసం జ్ఞానోదయం అవుతుంది దీన్నిబట్టి అయినా జనులు ఆచరిస్తారు సర్వేజనా సుఖినోభవంతు
@vardhanammajayanthi8455
@vardhanammajayanthi8455 2 ай бұрын
శతకోటి వందనాలు మహోదయా 🙏🏿🙏🏿🙏🏿🌹. మీరు పెట్టిన వీడియోలు అన్నీ వింటున్నాను 👌🏿. చాలా బాగున్నాయ్. 🌹
@subrahmanyama9737
@subrahmanyama9737 3 жыл бұрын
Thanks alot .guru ji
@BalaKrishna-eb1pj
@BalaKrishna-eb1pj 3 жыл бұрын
గ్రేట్ ఇన్ఫర్మేషన్ 🙏
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 6 ай бұрын
ధన్యవాదాలు.
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 53 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 22 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Narasimha Avataram by Sri Chaganti Koteswara Rao 2023 || SBL Bhakthi
2:06:18
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 635 М.