Рет қаралды 3,137
బయోచార్... నల్లబంగారంగా పేరొందిన ఈ పదార్థం... భూసారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బయోచార్ అనేది వివిధ బయోమాస్‌ల పైరోలిసిస్ నుండి ఉద్భవించిన ఘన, కార్బన్-రిచ్ పదార్థం. ప్రస్తుత కాలంలో మితిమీరిన ఎరువుల వినియోగం వల్ల భూసారం క్షీణించి... ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఈ నేపథ్యంలో నేలను తిరిగి సారవంతంగా మార్చి... ఉత్తమ ఫలసాయం అందించడానికి బయోచార్ తోడ్పడుతోంది. చౌడు నేలల పునరుద్ధరణకు బయోచార్ ఉపయోగించవచ్చు. దీనిద్వారా నేలలోని pH ను తటస్థపరచవచ్చు. ప్రత్యేకించి... బయోచార్ తయారీలో జాగ్రత్తలు మరియు కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలి? ఎంత మోతాదులో కలుపుకోవాలి? వంటి వి।షయాలు ఈ వీడియోలో నిక్షిప్తపై ఉన్నాయి.