పల్లవి:ఎంతైన నీ ప్రేమ....ఊహకుమించినది.... అది వర్ణించుట ఎవరికి సాద్యము(2) నీ చిత్తము చేయుటే నాకానందము...నీ మాట వినుటే నాకు భాగ్యము(1) 1.నీ చిత్తము మరచి.....నా ఆశను కోరి.... పాపపు వాకిలిలోకి...పరుగులెత్తగా(2) అందుడనై భలహీనుడనై.... శత్రువు తిరుగలినే నే విసరగా....(1) బలమిచ్చి నన్ను వాడుకొంటివా.... నీ చిత్తముకై చనిపోయే వరమిచ్చితివా...(1) 2.నీ ప్రేమను కాదని.....నీతో పనిలేదని... గతిలేక నేను.....తలవంచగా(2) ఒంటరినై.....వ్యర్దుడనై.... పందుల సహవాసము నే చేయగా(1) మితిలేని ప్రేమతో...నను స్వీకరించి..... గతిలేని నన్ను చేర్చుకొంటివు(2) 3.నీ చిత్తము కానక....నా ఇష్టము కోరి... నీవు వద్దన్న ఆ స్థలముకు....నే వెళ్ళగా(2) ఓటమి చెంది....గాయాలపాలై... ప్రాణము దక్కించుకొనుటకు ఆశ చెందగా(1) నను దైర్యపరచి...నీ చేయి చాపి.... నా ప్రాణాన్ని నిలిపిన నా యేసయ్య....(1)
@pastor.raju.pallikondaАй бұрын
యేసయ్య ప్రేమ వర్ణించడానికి ఈ సృష్టిలోనే కాదు... ఎక్కడ అంటే... పరలోకం పరలోకంలో కూడా ఎవరు ఉండకపోవచ్చు.అద్భుతమైన ప్రేమ. యేసయ్య ప్రేమ. వింతైన ప్రేమ.