జానపదాలు జన జీవన బాసలు.. గాజుల గల గలలు మంచి సంగీత గీత మధురిమలు.. మంచి వీడియో అండి మీకు ధన్యవాదములు
@krishnasmusicalvlogs61033 жыл бұрын
ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే నిన్ను పువ్వోలె చూసుకుంటానే నా గుండెల్లో దాచుకుంటానే ఏ అత్తపోరు నీకు ఉండదే మా అమ్మ మనసు బంగారమే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే చరణం 1 మంచినీళ్ల బాయి కాడ నిన్ను చూసినా ఆగలేక నీయంటె పరుగుతీసినా మంచినీళ్ల బాయి కాడ నిన్ను చూసినా ఆగలేక నీయంటె పరుగుతీసినా వయ్యారమైననీ నడుము చూసినా నా ప్రాణమంత నీకే అప్పగించినా వయ్యారమైననీ నడుము చూసినా నా ప్రాణమంత నీకే అప్పగించినా ఎట్లైనా నిన్ను నే మనువాడుతా నా కళ్ళలోన నిన్ను పెట్టి చూసుకుంటా ఎట్లైనా నిన్ను నే మనువాడుతా నా కళ్ళలోన నిన్ను పెట్టి చూసుకుంటా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే చరణం 2 ఆ ఏడుకొండలోడికే మొక్కుకుంటనే నువ్వు దక్కితే నీలాలు ఇస్తానని ఆ ఏడుకొండలోడికే మొక్కుకుంటనే నువ్వు దక్కితే నీలాలు ఇస్తానని మన కొమ్మాల కాడ మొరపెట్టుకుంటినే నీతోటి నా మనువు కావాలని కష్టంతో నీమెళ్ళో నగలెడతా నీ జళ్ళోన మెరిసేటి పువ్వఅవుత కష్టంతో నీమెళ్ళో నగలెడతా నీ జళ్ళోన మెరిసేటి పువ్వఅవుత ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే చరణం 3 నీ సిల్కు సీర చూసినే మురిసిపోతినే కులుకు సిలకలాగ ఉన్నదని పొంగిపోతినే నీ సిల్కు సీర చూసినే మురిసిపోతినే కులుకు సిలకలాగ ఉన్నదని పొంగిపోతినే ఉండిలేక ఉన్న సన్న నడుము చూస్తినే నేను సూడలేక ఉండలేక సచ్చిపోతినే ఉండిలేక ఉన్న సన్న నడుము చూస్తినే నేను సూడలేక ఉండలేక సచ్చిపోతినే మీ అయ్యాను ఎట్లైన ఒప్పిస్తానే నాతోటి నీ పెళ్లి జెపిత్తనే మీ అయ్యాను ఎట్లైన ఒప్పిస్తానే నాతోటి నీ పెళ్లి జెపిత్తనే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే ఘల్లు ఘల్లునా మోగే గాజులేసుకున్నదాన ఒక్కసారి నన్ను చూసి నవ్వరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే నల్లా నల్లని కాటుకేట్టుకున్న చిన్నదాన ఓరకంటి తోటి సైగ చెయ్యరాదటే నిన్ను పువ్వోలె చూసుకుంటానే నా గుండెల్లో దాచుకుంటానే ఏ అత్తపోరు నీకు ఉండదే మా అమ్మ మనసు బంగారమే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉయ్యాలా ఇట్లు మీ కృష్ణ