Gopalapura sandulalo (గోపాలపుర సందులలో..) | Lyrical Song - 130 | Gokulashtami spl song

  Рет қаралды 58,130

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

శ్రీ కృష్ణుడు పుట్టిన దినమైన అష్టమిని "కృషాష్టమి"గా మరియు ఆయన గోకులమునకు చేరిన నవమిని "గోకులాష్టమి"గా అందరూ పండుగలు జరుపుకుంటారని మనకు విదితమే. అయన సజీవముగానున్న కాలములోనే గోకులమున గోకులాష్టమి వేడుకలను చేసెడివారు అని కూడా మనకు తెలిసిన విషయమే.
శ్రీ కృష్ణుడు ఒక్క అవతారములోనే రెండు జన్మదినములను చేసుకొనుటకు గొప్ప ఆధ్యాత్మిక అర్థము ఇమిడియున్నది. ఆయన ప్రాపంచిక లేక ఆధ్యాత్మిక చరిత్రను దేనిని చూసినా... ఆయన పుట్టిన జన్మ ఒక్కటియే, కానీ, మారిన జాగాలు రెండు అని తెలియుచున్నది. ప్రాపంచికముగా మధురలో పుట్టి, నందగావుకు మారిన ఆ భగవానుడు, తూర్పుదేశములో గిట్టి పశ్చిమదేశమునకు కూడా మారి గురువైనాడు.
ఆధ్యాత్మికంగా శ్రీ కృష్ణ జన్మను చూసిన యెడల, ఆయన కురుక్షేత్రములో శ్రీకృష్ణ భగవానునిగా భక్తుడైన అర్జునునకు గీతను ప్రబోధించి "భగవద్గీతగా" పుట్టి, వెనువెంటనే ఆ పుట్టిన గీతను గురుక్షేత్రములో గురువుగా శిష్యుడైన మూసాకు "తౌరాత్"గా అందించాడు. కావున భగవద్గీత పుట్టినది స్వదేశములో, పెరిగినది ఉపదేశములో అని తెలియుచున్నది. కనుకనే, గోపాలునిగా గోకులమున పెరిగిన శ్రీ కృష్ణునికి గోవులు మచ్చికయైనట్టు, మూసలో పెరిగిన శిశువు గురువై "కృష్ణమూసగా" మారగా గోవులు మచ్చికైనాయి.
ఏదేమైనా, అష్టమిన జనియించాలన్నా, నవములోనికి పయనించాలన్నా శ్రీ కృష్ణుడే ఆధారం అని చెప్పకనే తెలియుచున్నది. ఇలా గురుఅష్టమిని, శిష్యనవములని రెంటినీ కలిపి, తన ప్రభవ దినముగా కలుపుట ఒకే ఒక్క జగద్గురువుకే సాధ్యం.
ఈ విధముగా రెండు జాగాలు మారిన శ్రీ కృష్ణుని జనన మర్మము, రెండు జాగాలలో జరిగిన శ్రీ కృష్ణుని మరణ మర్మము లోకానికి ఎంతో కనువిప్పు అని తెలియచేయుచూ, అట్టి ఆ జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు సంబంధించిన ఇన్ని ఆధ్యాత్మిక గుట్టలను రట్టు చేసిన యోగేశ్వరేశ్వరుడైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారికి" మా మనోపూర్వక, హృదయపూర్వక, ఆత్మపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు చేయుచున్నాము !!!
లోకమునకు కనుగప్పైన శ్రీకృష్ణుని జనన మర్మమును తెలుసుకొనుటకు :
-----------------------------------
శ్రీకృష్ణుడు దేవుడా ! భగవంతుడా !!
మనపండుగలు
సుబోధ
లోకమునకు కనువిప్పైన శ్రీకృష్ణుని మరణ మర్మమును తెలుసుకొనుటకు :
------------------------------------
శ్రీకృష్ణుడు దేవుడా ! భగవంతుడా !!
మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు
ఒక్కడే ఇద్దరు ...
కృష్ణ మూస : www.thraithash...
TEAM:
---------
Lyricist - Siva Krishna Kogili
Singer - Nandini & Naveen, Srinivas, Kranthi
Music - N R Chaitanya Kumar
Video Composition - Sai Songa
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
విశేషము:
----------
ఈ పాటను ఒక స్త్రీ, ముగ్గురు పురుషులు పాడారు. ఎలాగైతే దేవుని ముద్రలో ఒక ప్రకృతి, మూడు ఆత్మలు ఉన్నాయో, అలా ఈ పాటను పాడిన విధానము కలదు. "గురువు" యొక్క జ్ఞాన లీలలను ఘనపరచుటకు ఆ దేవునిముద్రయే ఈ పాటగా మారి పాడినదని తెలియుచున్నది.
LYRICS:
------------
సాకీ:
గోపాలపుర సందులలో ... గోకులాష్టమి సందడిరో ...
ఇందుజ్ఞానులందరికీ .... నందబాలుడందెనురో ... ఆ..నందలీల చిందెనురో ...
chorus:
గోపాలా... ! గోపాలా... ! గోపాలా... ! గోపాలా... !
పల్లవి :
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో
గోవుల్ని మేపేటి గారికయైనాడు ... తన జీవుల్ని కాసేటి కాపరియైనాడు
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో
పాలను పంచేటి పాలకుడైనాడు ... పాపాలను తుంచేటి ఏలికయైనాడు
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో ...
చరణము 1:
తీరు మారితే జీవం ... దారి మారును ధర్మం
ఆ ధర్మ గ్లానినణచివేయుటే తన నైజం
నారు వేసిన దైవం ... నీరు పోయుట ఖాయం
నీ పంట చేతికందు వరకు చేయును సాయం
ప్రతీ మదియొక నేత్రం ... ప్రతిమకదియే క్షేత్రం
ప్రత్యక్షమయ్యి చేసినాడు ప్రవచన సేద్యం
అంతరాత్మల రూపం .. గర్భగుడికే దీపం
అవతరించి అగ్నివేసినాడు చేసి ప్రబోధం
త్రైతమే ఎడ్లుగజేసి ... తెలుగనే నాగలిగట్టి
గీతలోనె ధర్మపంట పండించెనులే గ్రంథాలు
ఆత్మనే ఆవుగజేసి ... జ్ఞానమే పాలుగతీసే
ఆత్మయోగ సాధనలే తన వచనాలు !
గోవిందుని ప్రతి కార్యం... గీతా భాష్యం
ఆనందుని నిజ భావం ... అదియే త్రైతమ్ ...అదే కృష్ణుని తత్త్వం... శ్రీ కృష్ణుని తత్త్వం ...
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో
గోవుల్ని మేపేటి గారికయైనాడు ... తన జీవుల్ని కాసేటి కాపరియైనాడు
చరణము 2:
పాలలో నవనీతం పొంచియున్నది సత్యం
లోపాలు ఎంచకుండ చిలికి చేసుకో స్వంతం
దేహమందున త్రైతం దాగియున్నది నిత్యం
సందేహమంటు లేక వెతికి తెలుసుకో తత్త్వం
పురములో పొలమానం ... క్షరునికే కొలమానం
ఆ పొలములోని కలుపు ఏరివేయుటే జ్ఞానం
శిరములో గుణహారం ... శిశువుకే తలభారం
ఆ గురుగులన్నీ వేరుపరచు సేద్యమే యోగం
మనసుతో విత్తనమేసి ... బుద్ధిలో వృక్షముపెంచి
జీవికే కర్మఫలములందించునవే త్రిగుణాలు
అహమనే గడ్డినివేసి ... అశ్రద్ధను అడ్డుగజేసి
అనుభవసాగరాన ముంచివేయులే !
కనుకే మనసంతా మధ్యాత్మను నింపి
హృదినే గురు రూపంతో చేసై పూర్ణం అదే గీతాసారం ... భగవద్గీతాసారం
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో
గోవుల్ని మేపేటి గారికయైనాడు ... తన జీవుల్ని కాసేటి కాపరియైనాడు
గోపాలపురా సందులలో గోవిందుడిలా అందరిలో
పాలను పంచేటి పాలకుడైనాడు ... పాపాలను తుంచేటి ఏలికయైనాడు
పాలను పంచేటి పాలకుడైనాడు ... పాపాలను తుంచేటి ఏలికయైనాడు

Пікірлер
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 125 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 11 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН