Рет қаралды 32,887
హెబ్రోను మోటో కార్డ్ సాంగ్ - 2024 | Hebron Moto Card Song 2024
థెస్సలోని : 5:23
యెహను : 14:27
రోమా : 16:20
Full Song By Br. Vidyadhara Rao (Hyderabad)
పల్లవి : సమాధాన కర్త - మా యేసు ప్రభువా
ఆధరణ కర్త - నీకే వందనం
అ॥ప॥ ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త
బలవంతుడైన దేవా - నిత్యుడగు తండ్రి ॥సమాధాన॥
1. పరమును వీడావు - పాపిని ప్రేమించి
కల్వరి కెళ్ళావు - పాపిని రక్షింప
నీరక్తము ద్వారా - దేవునితో మాకు
సమాధానమిచ్చావు - నీ సమాధానము ॥సమాధాన॥
2. అనాధలనుగా మమ్మును - విడువక
మాకిచ్చితివి నీ శుద్ధాత్మను - నిత్యము
నీ శాంతి మాకనుగ్రహించి - వెళ్ళితివే
నీ శాంతి నిచ్చావు - నీ నిత్య శాంతిని ॥సమాధాన॥
3. నీ శిలువ రక్తముతో - సంధి చేసితివి
జాతి మధ్యపు గోడ - పడగొట్టితివి
ఇశ్రాయేలుతో మము - ఏకంబు జేసి
సమాధానమైతివి- మా సమాధానమైతివి ॥సమాధాన॥
4. శత్రు సైతాను - లోకంబుల నుండి
కాపాడుచుంటివి - నీ సంఘమును
సాతాను తలను - చితుక త్రొక్కితివే
విజయుండవై - మా సమాధాన కర్తవై ॥సమాధాన॥
5. శ్రమలు శోధనలు - కలవరములలో
మాకిచ్చుచుంటివి - నీ పరమశాంతిని
తండ్రి కుడిపార్శ్వమున - కూర్చుండి యుంటివే
యాజకుండవై మా ప్రధాన యాజకుండవై ॥సమాధాన॥
6. గగనమును చీల్చుకొని - తిరిగి వచ్చెదవు
వేవేల పరిశుద్ధుల - పరివారముతో
లోకమంత నిండియుండు నీ జ్ఞానముతో
సమాధానము - సర్వత్ర సమాధానము ॥సమాధాన॥
#hebronfellowship #hebron #hebronheadquater #hebronmorningmeditations #promiseverse #motocardsong2024 #hebronmotocard2024