పల్లవి ఎంతైన నీవు దేవుడవు యేసయ్యా ఎప్పటికి మారనివాడవు ఎందుకో ఇంతగా ప్రేమించినావు అందుకే ఈ నా వందనం చరణం:1 మేలైనది చేయనెరిగి - చేతులు ముడిచినవేళలో తెలిసి తెలిసి నిర్లక్షముగా - నడక సాగిన ఈ పయనంలో సులువైన సాతాను తెలివిముందు చితికి పోయినా ఈ జీవితం తండ్రీ నీవు చూపిన వాత్సల్యమే నడిపించెనే నన్ను నా చేయి విడువకను చరణం:2 ఎదుగుతున్న కొలది నేను - ఒదగవలసిన సమయమున అహం ఆవరించినవేళ - పతన స్థితియే దరిచేరిన క్షణమున ఆత్మానుసారమైన ఆలోచనలూ నాకు దూరమై నిలువగా తండ్రీ నీవు చూపిన ప్రేమయే ఆదుకొనెనే నన్ను ఆదరణ కర్తగా చరణం:3 తలకు మించిపోయినా - అపరాధ భావములు తనువే చాలించవలసిన - పరిస్థితుల మధ్యన తల్లడిల్లిపోతినే మది నిండిన కలవరములతో కృంగిపోతినే వెంటాడిన భయములతో తండ్రీ నీవు చూపిన కృపయే నిలబెట్టెనే నన్ను నీ పాద సేవకై
@MerimeriKwt22Ай бұрын
✝️✝️✝️🙏🙏🙏✝️
@crossgospelministriesАй бұрын
🙏
@SathuluriBhaskarАй бұрын
ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@crossgospelministriesАй бұрын
Hallelujah 🙏
@thewordministriesgunturАй бұрын
Very good meaning ful song blessings to you thammudu