Where is your Birth Certificate or Aadhar card atleast. చెప్పేవన్నీ యోగ శాస్త్రంలో ఉన్నాయి. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.