Рет қаралды 48,159
365 Days Successful Story of a Vegetable Farmer Koteswara Rao, Krishna District.
Self Marketing is the best choice for Vegetable farming || Leave Mono crop system || Growing 4 to 5 varieties of Crops brings you Success.
5ఎకరాల్లో కూరగాయలు. 4, 5 రకాల పంటలు. స్వయం మార్కెటింగ్ తో విజయపథంలో కృష్ణా జిల్లా రైతు.
కష్టే...సుఖే..ఫలే అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం రైతు వెలమర్తి కోటేశ్వర రావు. ఏడాది పొడవునా కూరగాయలు సాగుచేస్తూ, సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ, ఒకేపంటపై ఆధారపడకుండా, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు. కూరగాయలు ప్రతి ఒక్కరికీ నిత్యావసరం. ధర ఎక్కువ వచ్చే ఏ ఒక్క పంటపైనో ఆధారపడే వ్యవస్థ ఇక్కడ కనిపించదు. అన్ని రకాల కూరగాయలను పండిస్తూ, పంట మార్పిడిని పాటిస్తూ, ప్రణాళికబద్దంగా వ్యవసాయం చేస్తే.. రైతుకు తిరుగుండదని నిరూపిస్తున్నారు రైతు కోటేశ్వర రావు. కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలం, వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన ఈయన గత 25 సంవత్సరాలుగా 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ద్వారానే తన నలుగురు బిడ్డలను చదివించి, వారి భవిష్యత్ ను తీర్చిదిద్దారు. ఈయన 5 ఎకరాల పొలంలో ఓ వైపు పొట్ల, మిర్చి పంటలతోపాటు, మరోవైపు వంగ, మొక్కజొన్న పంటలు కనిపిస్తాయి. కాకర సాగుతో ఇప్పటికే మంచి లాభాలు గడించారు. కూరగాయలను నిత్యం స్వయంగా మార్కెట్ చేయటం వల్ల, వ్యవసాయంలో పెట్టుబడికి కొదవ లేదు. అలాగే కూరగాయల చేతికందే విధంగా దఫదఫాలుగా పంటలు నాటటం వల్ల మార్కెట్లో కోటేశ్వర రావు కూరగాయలకు బ్రాండ్ గా మారారు. .ఈయన పొలంలో కూరగాయ పంటలు ఎప్పుడూ వివిధ దశల్లో కనిపిస్తాయి. పకడ్బంధీ సాగు ప్రణాళికతో ఏటా ఎకరాకు కనీసంగా లక్షన్నర నుండి 2 లక్షల వరకు నికర లాభం సాధిస్తున్నారు ఈ రైతు. పొట్ల పంటను సంవత్సరం పొడవునా సాగు చేస్తున్న ఈయన, వంగ, కాకర వంటి పంటలను ప్రణాళిక ప్రకారం సాగుచేస్తూ కూరగాయల సాగులో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల సాగు తన నలుగురు బిడ్డల అభివృద్ధికి తోడ్పాటునందించిందని, తనకు జీవతాన్ని మార్చిందంటూ... రైతు కోటేశ్వర రావు కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #vegetablescultivation #365daysvegetablesfarming #snakegourdcultivation #brinzalcultivation
Facebook : mtouch.faceboo...