Рет қаралды 1,185,091
వ్యవసాయంలో రైతులకు ఆది నుండి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందులో కలుపు సమస్య ప్రధానమైంది. కొన్ని రకాల కలుపు మొక్క జాతులు...వేసిన పంటతో పాటు పోటీ పడి మరి పెరుగుతూ, పంట ఎదుగుదలకి అడ్డం పడుతుంటాయి. ఫలితంగా మొక్కలు పోషకాలు గ్రహించడంలో వెనుకపడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుండడంతో పాటు కలుపు తియ్యడానికి, కూలీలు, కలుపు యంత్రాలకు అదనంగా ఖర్చు, ఆర్ధిక భారం ఏర్పడుతుంది. దానికి తోడు కలుపు నియంత్రణకు మళ్లీ రసాయనాల బాట పట్టాల్సి వస్తుంది, అలాంటి కలుపు సమస్యలకు ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతలాగ...కలుపుని కలుపుతోనే అరికట్టవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్న మేడ్చల్ కి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు అశోక్ కుమార్ పై నేలతల్లి ప్రత్యేక కథనం.
#MedchalFarmer #NaturalFarming