Karme Lekunte (కర్మే లేకుంటే) | Lyrical Song - 81 | Moharam Special Song

  Рет қаралды 181,695

Gnanavaahini channel

Gnanavaahini channel

3 жыл бұрын

మానవుడు చచ్చుటకు పుట్టుటకు కర్మే కారణమైవున్నది. మానవుడు జనన మరణ చక్రమునుండి బయటపడుటకు కర్మ అడ్డుగావున్నది. కర్మను లేకుండా చేసుకొంటే పుట్టవలసిన అవసరములేదు. కర్మ లేకుండా పోయినప్పుడు మనిషి దైవసాన్నిధ్యము చెంది మోక్షమును పొందును. అందువలన ఆధ్యాత్మిక విద్యలో కర్మను జయించడము ముఖ్య ఘట్టముగా యున్నది. కర్మయెలా అంటుచున్నదో, తెలియగలిగితే సులభముగా దానిని జయించి ముక్తిని పొందవచ్చును. కర్మ కేవలము భావము వలననే అంటుచున్నదనీ, కార్యముల వలన కాదనీ అర్థమగుచున్నది. అటువంటప్పుడు భావములను పొందకపోతే కర్మరాదు. కేవలము భావమును లేకుండ చేసుకోవడము వలన కర్మను సులభముగా జయించవచ్చును. అయినా సూత్రము తెలియని మనుషులు ప్రక్కదారిపట్టి, మోక్షము కొరకు, పూజలు, యజ్ఞములు, వేదాధ్యయనములు, దానములు, తపస్సులు మొదలగు కార్యములను చేయుచున్నారు. కొందరైతే మెడిటేషన్ అని ధ్యానమును చేయుచున్నారు. అనేక రకముల సాధనలను చేయుచున్నారు. ఆధ్యాత్మిక విద్యలో పెద్దవారమని ప్రచారమైన వారు కూడా కేవలము భావముతో కర్మను జయించవచ్చునని తెలియక తలలు కొరిగి కొందరూ, తలలు పెంచి కొందరూ, గుడ్డలు మార్చి కొందరూ, గుడ్డలు విప్పి కొందరూ, యాత్రలు చేసి కొందరూ, బూడిద పూసుకొని కొందరూ, ఇలా ఎన్నో రకముల అగచాట్లుపడుచున్నారు. ఎన్ని చేసినా వాటివలన కర్మపోలేదు. దేవుడు తెలియబడడు. కర్మ రాహిత్యమైన రోజు జన్మరాహిత్యమగును. కర్మరాహిత్యమునకు తపస్సులు, యజ్ఞములు, వేదాధ్యయనములు పనికిరావు.
ప్రతి నిత్యము మనిషి భావముతో కూడిన కార్యములను చేయుచున్నాడు. అందువలన ఆ కార్యముల కర్మలు మనిషిని తగులుకొనుచున్నవి. ఒకవేళ ఇప్పుడు జ్ఞానము తెలిసి కర్మరహస్యమును తెలియగల్గితే, ఇప్పటినుండి వచ్చు కర్మలు రాకుండాపోవును. అయితే ఇంతకుముందు సంపాదించుకొన్న కర్మలను తప్పనిసరిగా అనుభవించవలసియుండును. కర్మను పూర్తిగా లేకుండా చేసుకొనుటకు జ్ఞానమును తెలిసి, యోగమును ఆచరించుట మాత్రమే కాక, గురువును సంపూర్ణముగా గుర్తించవలెను. కనుక కర్మవలన నిరంతరమూ కార్యోన్ముఖులుగా ఉండుటకంటే, ప్రతి మానవుడూ కర్మను సంపూర్తిగా లేకుండా చేసుకొనుటకు జ్ఞానోన్ముఖులుగా మారి అంతర్ముఖములో ప్రయాణించి ముఖములేని దైవముగా మారవలెనని హెచ్చరించుచున్నాము.
ఎవరూ తెలియజేయలేనటువంటి కర్మను గూర్చిన పూర్తి జ్ఞానము తన గ్రంథముల ద్వారా అందించడమే కాక ఆ కర్మను పూర్తిగా లేకుండా చేయగల గురుస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానధాటికి ప్రతిబింబమే ఈ పాట.
విశేషం : ఈ పాట "మొహరం" రోజు విడుదల కావడం పూర్తిగా ఆ యోగీశ్వరుల వారి సంకల్పమే.
మొహ అనగా ముఖము లేక మోహము అని అర్థము. రం అనగా రహితము.
మొహరం అనగా ఇక తలలేదు ... తలే లేనప్పుడు తలరాతయైన కర్మ ఉండదు కదా !
L I K E | S H A R E | S U B S C R I B E
------------
Lyricist - Siva Krishna Kogili
Singer - M Ramu (Chennai)
Music - N Nagesh
Editor - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel

Пікірлер
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Sukham-Anandam (Happiness - Ecstasy) Dt.18-10-2013 | Thraitha Siddantham
59:17
Unnannallu Shanti Ledu
7:22
Siddhaguru Sri Ramanananda Maharshi - Topic
Рет қаралды 817 М.
Chamatkara Atma | Dt : 26-06-2010 | Thraitha Siddantham
1:00:10
Thraitha Siddantham
Рет қаралды 48 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,3 МЛН
Ulug'bek Yulchiyev & Aziza Qobilova - Esim ko'p (Premyera Klip)
3:32
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 2,2 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 16 МЛН
IL’HAN - Bir aida (official video) 2024
4:01
Ilhan Ihsanov
Рет қаралды 148 М.
BYTANAT | Қызғалдағым | Премьера 2024
2:24
TURAN MEDIA
Рет қаралды 52 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 254 М.