Gnanamante Ne Telipedera (జ్ఞానమంటే నె తెలిపెదెరా...) Lyrical Song - 75

  Рет қаралды 172,446

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

ఈ కలియుగాన నేడు మనమున్న ఈ కాలములో జ్ఞాన బోధకుల అవస్థ చెప్పనలివి కాకున్నది. జ్ఞానము యెడల విలువలేని నేటి సమాజపు మనుషులకు తగ్గట్టుగా జ్ఞానము బోధించుట కొరకు నేటి బోధకులు ఏనాడో జ్ఞానమార్గమును తప్పి పక్కకు పోయినారని చెప్పక తప్పదు. ఆత్మజ్ఞానము మీద, ఆధ్యాత్మిక విషయాల మీద కపట ప్రేమ తప్ప సరియైన ఇష్టము లేని నేటి తరము మనుషులకు బోధచేయుటకు బోధకులు కేవలము జ్ఞానము మీదనే మనో బుద్ధులు కేంద్రీకరించిన సరిపోదు. కడుపు కొరకో కీర్తి కొరకో అంతో ఇంతో ప్రపంచ విషయము మీద కేంద్రీకరించవలసి వస్తున్నది..
ఇటువంటి పరిస్థితులలో బోధకులలో కొందరు జ్యోతిష్యము చెప్పుచూ, కొందరు వైద్యము చేయుచూ కొందరు మంత్రాలనీ, అంత్రాలని కాలము గడుపుచూ కొందరు చుట్టూ ఉన్న ప్రజలకు అనుగుణముగా వారి దృష్టికి ఏది భక్తి అనిపిస్తే అది (హాస్యము, చిందులు, విందులు, యోగాసనాలు, కీర్తనలు, భజనలు, పురాణం కాలక్షేపాలు....) మరియు దాదాపు అందరూ స్వమత భావ ప్రేరేపణలు చేయుచూ తాము మభ్యపడుటయే కాక అందరిని మభ్య పెడుతున్నారు. పై చెప్పినవి ఏవి ఏమాత్రము జ్ఞానము కాదు అని తెలియవలెను.
ఈ నేపద్యములో ఒకే ఒక్క గురువు మాత్రము "గురువు" అన్న పదమునకు నూటికి నూరు శాతము సార్థకత చేకూర్చే పద్దతిలో మాయ శోధనలకు లొంగక, ప్రకృతి ఆటంకములు లెక్కచేయక, ఎన్నో కష్టనష్టములకు ఓర్చి నాలుగు పదుల సంవత్సరములకు పైగా సుదీర్ఘ కాలము "నిజమైన జ్ఞానమును" త్రైత సిద్ధాంత వరముగా ప్రతిపాదించి, ఏమాత్రము కలుషితము లేకుండ ప్రబోధించి, శతగ్రంథముల సారముగా దైవజ్ఞానమును భద్రపరచి, మనకు ఆ నిధిని అందజేసియున్నారు. ఆయనే త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, ఇందూజ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైతసిద్ధాంత ఆదికర్త అయిన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనానంద యోగీశ్వరులవారు".
ఆ దివ్యజ్ఞాన సారమును "జ్ఞానమంటే నే తెలిపెదరా ..." అంటూ ఈ పాట ద్వారా ఆ జగద్గురువే మనకు వినిపిస్తున్నారు ..... విని, గ్రహించుకొని తరించండి.
L I K E | S H A R E | S U B S C R I B E
--------------------------------------------------------
Lyricist - Siva Krishna Kogili
Singer - Praveen Kumar Koppolu
Music - N Nagesh
Editing - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini
Lyrics:
----------
సాకీ ::
---------
జ్ఞానమంటె హాస్యం కాదు జ్ఞానమంటె జోస్యం కాదు
జ్ఞానమంటె వైద్యం కాదు జ్ఞానమేమి చోద్యం కాదు
జ్ఞానమంటె గానము కాదు జ్ఞానమంటె ధ్యానము కాదు
జ్ఞానమంటె స్తోత్రము కాదు జ్ఞానమేమి కీర్తన కాదు
జ్ఞానమంటె చిందులు కాదు జ్ఞానమంటె విందులు కాదు
జ్ఞానమంటె వాదన కాదు జ్ఞానమేమి వేదన కాదు
జ్ఞానమంటె వర్గము కాదు జ్ఞానమంటె స్వర్గము కాదు
జ్ఞానమేమి కులము , మతమూ నీ సమ్మతమూ కానే కాదు
జ్ఞానమంటె నె తెలిపెదెర నిజజ్ఞానాన్ని తెలియుమురా
పల్లవి :
----------
జ్ఞానమంటె నె తెలిపెదెర నిజజ్ఞానాన్ని తెలియుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర దైవభావాన్ని ఎఱుగుమురా
కలదాటించి ఏలేను చూడరా
ఇల జ్ఞానాన్ని పోలేది లేదురా
వలయాలన్ని ఛేదించు నిలయమురా
అట్టి జ్ఞాన్నాన్ని తెలిపెదరా ... గుట్టుగా దాన్ని తెలియుమురా
పట్టు తేనంటి మధురమురా ... పట్టుకుంటే నువ్వొదలవురా
చర : 1
----------
ఏ చూపుతాకని ఏ బుద్ధికందని ఒక శక్తి తన యుక్తి చూపాడురా
పరమాత్మగా తాను అధికర్తగాయుండి ఈ సృష్టినే రచియించాడురా
ప్రకృతిని తననుండి ఒక పాత్రగా తీసి తను ఆత్మగా అందు నిండాడురా
ఆకృతులు చేసేటి ఆ ఆత్మయే తనలో జీవాత్మగా నిన్ను మలిచాడురా
కాలాలు మార్చుతూ కర్మాలు చేర్చుతూ గుణజాలమే తాను పన్నాడురా
ఏడేడు కాడులలో శ్వాస ఆడగా గురుజాడలా వాక్యమైనాడురా
ఆ ఓంకారమే ఆది జ్ఞానమురా
ఆ జ్ఞానాన్ని తెలియుమురా ... అందు త్రైతాన కలియుమురా
జీవ భావాన్ని వదులుమురా ... దైవ మార్గాన కదులుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర నిజజ్ఞానాన్ని తెలియుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర దైవభావాన్ని ఎఱుగుమురా
చర : 2
------------
జీవానుభవమున్న నిను నీవు ఎరిగితే నీ పొరుగునే ఆత్మ ఉన్నాడురా
గుణభావమే వీడి ఆ ఆత్మ జ్ఞానాన్ని అధ్యయనమే నీవు చేయాలిరా
యమరాజుగా ఆత్మ నీ దేహ రాజ్యాన అధికారియై ఆజ్ఞలిస్తాడురా
సమయాన్ని పాలించు సమవర్తి ఆజ్ఞల నియమాన్ని రాజ్యాంగమంటారురా
నీదేహ హద్దును ఇసుమంత మీరక సాంఖ్యాన్ని ముఖ్యంగా తెలియాలిరా
నీలోని శ్రద్ధను ఇహమందు జారక నీ బుద్ధినే సిద్ధపరచాలిరా
ఆ సద్భావమే ఆత్మజ్ఞానమురా
ఆ జ్ఞానాన్ని తెలియుమురా ... అందు త్రైతాన కలియుమురా
దైవగ్రంథాలు చదువుమురా ...దేహబంధాలు వదులుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర నిజజ్ఞానాన్ని తెలియుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర దైవభావాన్ని ఎఱుగుమురా
చర : 3
------------
ధర్మాల యోగమునే నీవు పూనగ ఆ దైవమే ధైర్యమిస్తాడురా
తత్వాల గూఢములో గుట్టులెరుగగ సంతృప్తిగా సత్తునిస్తాడురా
మధ్యాత్మలో కలిసి శుద్ధాత్మ నీవైతే నీ బుద్ధి వికసింపజేస్తాడురా
శత గ్రంథములు దాటు నీ శ్రద్దనే చూసి శితికంఠుడే స్వంతమౌతాడురా
నీ దప్పిదీరగా గురువాక్య ధారలు నీ శిరములో కుమ్మరిస్తాడురా
అతిసూక్ష్మ దృష్టితో ఆ అష్టగ్రంథిలో ఆనందుడే అందివస్తాడురా
ఆ ఆనందమే గురు జ్ఞానమురా
ఆ జ్ఞానాన్ని తెలియుమురా ... గురు గుహ్యాన్ని అరయుమురా
గుణదోషాన్ని వదులుమురా ...గురు భాష్యాన్ని కనుగొనరా
జ్ఞానమంటె నె తెలిపెదెర నిజజ్ఞానాన్ని తెలియుమురా
జ్ఞానమంటె నె తెలిపెదెర దైవభావాన్ని ఎఱుగుమురా
త్రైత గ్రంథాల సారాన్ని చూడరా
కర్మ బంధాల భారాన్ని వీడరా
ప్రబోధానందుడే జ్ఞాన రూపమురా
అట్టి రూపాన్ని తెలియుమురా ... మెట్టుగా మారి ఎదుగుమురా
గుట్టుగా దాన్ని కలియుమురా ... పట్టుకున్నావో నీ ఆట అంతమురా
#thraithashakam #thraithasiddhantam #thraitham #prabodha #prabodhaguruvu #yogeeswar #gnanavaahini #trytam #thraithavaani #threesouls #devuni jnanamu #three souls

Пікірлер
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 32 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
Chamatkara Atma | Dt : 26-06-2010 | Thraitha Siddantham
1:00:10
Thraitha Siddantham
Рет қаралды 50 М.
(శివయ్య పాట)లేలే లేలే లే శివయ్య లేచి రా రా రా రా శివయ్య
8:20
శ్రీ సరస్వతి బాలభక్త భజన సమాజం
Рет қаралды 368
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН