Рет қаралды 100,527
ప్రతి జీవి సృష్ట్యాదినుండి జననమరణ సముదాయమైన కర్మ చట్రములో ఇరుక్కొని, జన్మ జన్మకు దేవుని మీద, ఆయన జ్ఞానము మీద శ్రద్ధను కోల్పోతూ, దేవునికి దూరమవడమే కాక అధర్మములనే మాయలో చిక్కుకొని పోతున్నాడు. ఇటువంటి సమయంలో ఏవి ధర్మములో, ఏవి అధర్మములో తెలియని జీవుడు, అధర్మములనే ధర్మములు అనుకొని భ్రమపడుతూ ఘోరమైన కర్మను అంటగట్టుకుంటున్నాడు.
కాగా నేడు, త్రైతశకమున, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యమైన ఆత్మ జ్ఞాన ప్రబోధము ద్వారా ఏవి ధర్మములో ఏవి అధర్మములో ఖరాఖండిగా తేలిపోవుచున్నవి. అట్టి జ్ఞానమును అవగతము చేసుకున్న ఏ జీవుడైనా గతములోని తన అజ్ఞానమునకు, అధర్మ ప్రవర్తనకు, చింతించుచూ ...ఇంతటి జ్ఞానము అందినందుకు తృప్తి చెందుతూ .. నిజ ధర్మములనే గట్టిగా పట్టుకొని ..ఆఖరీ మరణాన్ని తప్పక కోరుకుంటాడు.
ముగింపు వాక్యములు :
నిజమైన ధర్మవరుడు, "పరధర్మములోని భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు" అని తెలిసినవాడై స్వధర్మములోని మరణమునే కోరుకుంటాడు. (భగవద్గీత కర్మయోగము : శ్లోకము 35)
నిజమైన జ్ఞాని, ఖర్మనిర్మితమైన తన దేహమును సహితము అమ్మి వేసి పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనును. (లూకా సువార్త : 12 వాక్యము 33)
నిజమైన మోక్షగామి, అల్లాహ్ వద్ధయున్న పరలోక నివాసము తనకొరకే ప్రత్యేకించబడి యున్నదను సత్యమును విశ్వసించిన వాడై ఆఖరీ మరణాన్ని కోరుకుంటాడు. (ఖురాన్ 2 -94)
యోగీశ్వరుల వారు గుర్తించి తెలియజేసిన ..
ఆరు అధర్మములు : 1. బాహ్య యజ్ఞములు చేయుట, 2. దానములు చేయుట, 3. తపస్సులు చేయుట, 4. వేదములు చదువుట, 5. మత భావములో మునుగుట, 6. నిజమైన దైవ జ్ఞానమును ఆటంక పరచుట.
మూడు ధర్మములు : 1. కర్మ యోగము (కర్మ ధర్మము), 2. బ్రహ్మ యోగము (బ్రహ్మ ధర్మము), 3. భక్తి యోగము (భక్తి ధర్మము)
thraithashakam....
L I K E | S H A R E | S U B S C R I B E
TEAM :
-------
Lyricist - Siva Krishna Kogili
singer - Kranti
Music Director - NR Chaitanya Kumar
Direction..surabhi prasad ,. hyd
Asst direction..B.tridivesh naidu
Choreography..katipaka mahender ,(ghmc)hyd
Camera man - Rajesh Hyd.
Editing : Roopasree Rajesh (Anantapuramu)
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
Lyrics:
-----
పల్లవి:
--------
కరుణ జూప...రా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
యుగాలందు బాటసారై అలసిపోతిరా
జగాలన్ని మారి మారి సొలసిపోతిరా
విషాలున్న విశ్వమందు విసిగిపోతిరా
వింత వేషాలతోన వేసారి పోతిరా
కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
చర 1 :
--------
స్వగ్రమొకటె గొప్పదంటూ అగ్రమేది లేదు అంటూ ఉగ్రమైన తపస్సులెన్నో చేసినానురా
ప్రజ్ఞనంత పారద్రోసి విజ్ఞతంతా వీడదీసి యజ్ఞయాగాదులెన్నో చేసినానురా
తనువే తపియించనంటూ తిరుగుబాటు చేసి నాతో త్రైతమ్ తెలియాలి అంటూ ఉరకలేసెరా
యజ్ఞం అజ్ఞానమంటూ యోగదీక్ష బూనమంటూ యోగీశ్వర నీ బోధలోనే తెలిసిపోయెరా
కనుకే ... కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
చర 2 :
--------
శాస్త్ర పటిమ నేర్తునంటూ వేదపఠనె మార్గమంటూ వక్రమైన త్రోవలోనే చిక్కిపోతిరా
దానములను ధ్యేయమంటూ పుణ్యకర్మ సాయమంటూ అధర్మాల మాయలోనే నక్కిపోతిరా
వేదం గుణమాయాయంటూ వేదనలకుమూలమంటూ వేదాంతములో కూడమంటూ మదిన తోచెరా
దానం దిగజారుడంటూ ఎగువదారి చూపదంటూ ధర్మాన్నే ఇక వేడమంటూ అహము దెల్పెరా
కనుకే ... కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
చర 3 :
--------
నాదు మతమే ధర్మమంటూ అన్యమంత వ్యర్ధమంటూ మతద్వేషముతోన మసలే పశువునైతిరా
సాంప్రదాయ జాఢ్యమందు అంధుడల్లే వుండినేను ఇందుజ్ఞానమందలేక హీనుడైతిరా
మతమే అతిపెద్దమాయ గుణములందు ముంచు లోయయని మనసే పలికింది హితవే పథము చూపగా
విషమే చిలికేను చూడు కులమతాల సాంప్రదాయమని హృదిలో మెదిలింది నీదు జ్ఞాన సారమే ...
కనుకే ... కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
చర 4 :
--------
కర్మబ్రహ్మభక్తియోగ సారములను తెల్పినావు త్రైతమందు నిన్ను చేరి తరిస్తానురా
కాయమందు కూడలేను కర్మకడను కోరినాను కాయ కర్పూరమోలె కాల్చివేయరా
వ్యక్తై ఉండేటి నాకు నీదు జ్ఞాన శక్తినిచ్చి అవ్యక్తముగా మారిపోయే ముక్తినియ్యరా
నీకై వేడేటి నాకు ఐదోతనమునిచ్చి కాచి ఇక నలుగురిలో నగుబాటు కాని మోక్షమియ్యరా ...
కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా
త్రైతమందు నీదు సేవ వదులుకోనురా
నిన్ను కాక అన్యమేది కోరుకోనురా
దేహమందు ఆత్మ ధ్యాస వీడబోనురా
సర్వ ధర్మాలు వీడి నిన్ను చేరుతానురా ...
కరుణ జూపరా స్వామీ మరణమీయరా
శరణమంటిరా దేవా పరము జేర్చెరా !!!