No video

కురుక్షేత్రంలో ఓడిపోయి బ్రతికినవాళ్లు ఈ ఇద్దరే..! || Samavedam Shanmukha Sarma || Bhakthi TV

  Рет қаралды 871

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

కురుక్షేత్రంలో ఓడిపోయి బ్రతికినవాళ్లు ఈ ఇద్దరే..! || Sampoorna Mahabharatam by Brahmasri Samavedam Shanmukha Sarma || Episode 45 || Bhakthi TV
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
For more spiritual information subscribe us @ / bhakthitvorg

Пікірлер: 3
@venkateshbalivada7395
@venkateshbalivada7395 6 жыл бұрын
endhuku sir eppudu chusina karnudu gurinchi bad ga chebutuntaru
@sriramakrishnad8968
@sriramakrishnad8968 5 жыл бұрын
మహా భారతంలో కర్ణుడు విలన్. ఆ విషయం కృష్ణుడే చెబుతాడు. సినిమాల్లో చూపించినట్టు కాదు.
@sriramakrishnad8968
@sriramakrishnad8968 5 жыл бұрын
*సినిమాలు చూసి చాలా మంది కర్ణుడు హీరో అనుకుంటారు కానీ మీరు వ్యాస మహాభారతం చదివితే అతను విలన్ అని తెలుస్తుంది. కర్ణుడు గురించి మీకు అర్థం అవ్వటం కోసం కొన్ని సంఘటనలు చెప్తాను వినండి.* 1. జూదంలో ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయాక ఆమెని తీసుకురమ్మని ఒక సేవకున్ని పంపిస్తారు. అప్పుడు ఆమె బహిష్టు లో( menses ) ఏక వస్త్రంతో వుంటుంది. అదే విషయాన్ని సేవకుడితో చెప్పి పంపుతుంది. దానికి సభలో కర్ణుడు అన్న మాటలు ఇవి. "అయిదుగురు భర్తలు కట్టుకున్న ద్రౌపది ఒక లంజ. అలాంటి దాన్ని ఏకవస్త్రగా ఏంటీ వివస్త్రగా( బట్టలు లేకుండా) తీసుకొచ్చినా తప్పులేదు." అంటాడు. 2. ద్రౌపదిని తీసుకొచ్చాక దుర్యోధనుడు తమ్ముళ్లలో ఒకడైన వికర్ణుడు మాట్లాడుతూ ద్రౌపదిని జూదంలో ఒడ్డటం తప్పు అది చెల్లదు అంటాడు. దానికి కర్ణుడు "ధర్మరాజు జూదంలో అన్నిటినీ ఓడిపోయాడు. పాండవుల వంటి మీద వున్న బట్టలుతో సహా అన్ని దుర్యోధనుడకే చెందుతాయి అంటాడు." అదుగో అప్పుడే ద్రౌపదికి బట్టలు ఊడదీసి అపహాస్యం చేయాలి అన్న ఆలోచన దుర్యోధనుడకి వచ్చి తమ్ముడైన దుశ్శాసనుడని "ఆ బట్టలు తీసేసుకో " అని ఆజ్ఞాపిస్తాడు. అంతేగానీ దుర్యోధనుడికి ద్రౌపది చీరలాగి అపాహాస్యం చేయాలి అన్న ఉద్దేశం మొదటినుంచీ వుండదు. అసలు ఆ జూదం లక్ష్యం పాండవుల రాజ్యాన్ని సంపాదించటం తప్పితే వీళ్లని ఏదో అపహాస్యము చేద్దాం అని కాదు. అయితే అలా దుర్యోధనుడు అన్న వెంటనే పాండవులు వాళ్ళంతట వాళ్ళే పై వస్త్రాలు తీసి ఇచ్చేస్తారు. తరవాత ద్రౌపతి చీర లాగుతుంటే కర్ణుడు అది తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడడు. అదీ మనం అనుకునే హీరో కర్ణుడి హీరోయిజం. 3. కృష్ణుడు కర్ణుడిని అధర్మ యుద్ధంలో చంపించినప్పుడు కొన ఊపిరితో ఉన్న కర్ణుడు "ఇది అన్యాయం" అని కృష్ణుని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు " కర్ణా! నీ దగ్గరకి వచ్చేసరికి ధర్మం గురించి మాట్లాడుతున్నావే మరి అవతలి వారి విషయంలో నువ్వు ఎన్ని సార్లు అధర్మంగా వ్యవహరించాలో తెలుసా అని అతని తప్పులన్నీ ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు. వాటికి కర్ణుడు మారు మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుంటాడు. 4. బాలుడైన అర్జునిని కొడుకు అభిమన్యుని విల్లు విరిచి పరోక్షంగా అతని మరణానికి కారణం అవుతాడు. ఈ విషయం కృష్ణుడే చెబుతాడు. 5. కర్ణుడు ఒకసారి వ్రతంలో వుండి దానాలు చేస్తుంటాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడుగుతాడు.(ఈ విషయం గురించి తండ్రి అయిన సూర్యుడు కర్ణున్ని ముందుగానే హెచ్చరిస్తాడు). అందుకు కర్ణుడు పకపకా నవ్వి దేవరాజా, ఇవి నా శరీరంలో భాగం. ఎవడైనా ఇలాంటివి ఇస్తారా! అంటాడు. అప్పుడు ఇంద్రుడు మరి నీ వ్రతం సంగతి ఏంటీ అని అడిగితే అపుడు కాస్త ఆలోచించి "సరే నీ దగ్గర వున్న దివ్యాస్త్రం( శక్తి ఆయుధం) నాకిస్తే, నీకు కవచకుండలాలు ఇస్తాను లేకపోతే లేదు" అని కరాఖండిగా చెప్తాడు. దాంతో దానం చేసినా దానికి ప్రతిదానం తీసుకోవటం వలన లాభం లేకుండా పోతుంది. అదీ మీ హీరో దానగుణం. ఆ తరవాత మరెప్పుడూ కర్ణుడు దానం చేయలేదు. 6. దుర్యోధనుడికి ఉన్న ఒక "చెడ్డ స్నేహితుడు" కర్ణుడు. "చెడ్డ స్నేహితుడు" అని ఎందుకు అంటున్నాం అంటే ఒక స్నేహితుడిగా కర్ణుడు దుర్యోధనుడికి చాలా చెడ్డ సలహాలు ఇస్తాడు. దుర్యోధనుడు తీసుకునే చెడు నిర్ణయాలను ప్రోత్సహిస్తాడు. అందుకే భీష్ముడికి, విదురుడుకి కర్ణుడు అంటే పడదు. ఎప్పుడూ తూలనాడుతుంటారు. ఇంకా ఇలాంటివి కొన్ని వున్నాయి. కాబట్టి సినిమాలు వేరు. నిజాలు వేరు. కర్ణుడు, కృష్ణుడు ఒకరినొకరు పొగుడుకున్న సందర్భాలు కూడా భారతంలో వున్నాయి. కర్ణుడు లో కొన్ని మంచి లక్షణాలు కూడా వున్నాయి. కానీ మంచి పాళ్లు చాలా తక్కువ.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 8 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 36 МЛН
Chaganti Pravachanalu
32:33
Vedanta
Рет қаралды 130 М.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 8 МЛН