Рет қаралды 132
గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో గురుకుల బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి విద్యార్థినిలకు మెనూ ప్రకారమే భోజనాన్ని అందించాలని మండల విద్యాశాఖ అధికారిని, ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు కాకుమాను మండలంలో కొల్లిమర్లలో సిసి రోడ్డు తనిఖీ, పాండ్రపాడులో అంగన్వాడి భవనంతో పాటు అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంజరిగిందని కొన్ని పనులు ప్రారంభదశలో ఉన్నట్లు, మరికొన్ని పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని వాటిని కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది అని అన్నారు.
రైతులకు వరి పంట కోత దశలో ఉన్నందున అల్పపీడన ప్రభావం జిల్లాపై ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం పడే లోపే యంత్రాల ద్వారాకోత కోసుకోని వరిగింజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి శాఖ అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, మరియు ఇతర అధికారులుపాల్గొన్నారు.
Please contact: 9652838631.
Telugunaadu Broadcasting Private Limited,
4/2, Arundalpet, GUNTUR-522002.