Memories of Sirivennela | సిరివెన్నెల జ్ఞాపకాలు

  Рет қаралды 35,455

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#KiranPrabha #Sirivennela #Koumudi
This is my personal tribute to Sirivennela Seetharama Sastry Garu..

Пікірлер: 120
@madhavpersonal5312
@madhavpersonal5312 2 жыл бұрын
సీతారామ శాస్త్రిగారితో నేను పొందిన స్ఫూర్తి చిన్నప్పుడు మా అక్కలు పాడే మంచి తెలుగు పాటలు వింటే అర్థం కాకున్నా ఒక మంచి ఫీలింగ్ అనిపించేది. కొంచం పెద్దయ్యాక సొంత అన్నయ్య బాలు, శ్రీ S P బాలు గారి పాటలు "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి", "అమ్మ అన్నది ..." లాంటి పాటలు వింటే పాడాలనిపించేది. 1986 లో అనుకుంటా, "సిరివెన్నెల " చిత్రం చూసినప్పుడు, ఏదో ఒక తెలియని ఉద్వేగం. శివుణ్ణి నిందా స్తుతిగా "బూడిదిచ్చే వాడినేది కోరేదీ ..." అని వింటే, అమ్మ నాన్నలపైనా కోపంతో అలిగి అన్నం తినని నా అమాయకత్వం కరెక్టే అనిపించింది. కానీ రాసిందెవరో, రాస్తుందెందుకో పెద్దగా అర్థంకాలేదు. గుంటూరు లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, బ్రాడీపేట శ్రీ లక్ష్మి థియేటర్ లో "స్వర్ణ కమలం" చూసా. మళ్ళీ వెళ్లి తర్వాతిరోజు చూసా. ఇంటర్నెట్, యూట్యూబ్ ఇంకా లేని కాలం. రెండోసారి చూస్తుంటే, ఒకరకమైన విభ్రాంతి, ఉత్తేజం, ఆ పాటలలో పాత్రలగురించి, వారి మనస్తత్వం, వెలికితీసి, ఒక గొప్ప ఆణిముత్యంగా మార్చిన మాంత్రికుడు సీతారామ శాస్త్రి గారని తెలిసింది. మా సంస్కృతం లెక్చరర్ భాస్కర రావు గారిని విసిగించి, తెలుసుకున్న విషయం, స్వర్ణకమలం చిత్రం కథ "గంగావతరణం" ఇప్పటి రోజులకు మార్చి రాసిన కే. విశ్వనాధ్ గారి మాయా చమత్కారమని. అలాగే భాస్కరరావు గారు, గంగావతరణం పుస్తకమిచ్చి చదవమన్నారు. అప్పుడు మూడోసారి చూసాను అదే చిత్రం! చిక్కుముడి వీడింది! భగీరథుడు ఒక గొప్ప ప్రయత్నంతో, తాను మనస్ఫూర్తిగా నమ్మిన దైవత్వాన్ని సురగంగలో చూసి, భూమిపైన అందరికీ గంగాజలం అందాలని, ఆమె గొప్పతనం ఆమెకే తెలియపరచిన ఒక అద్భుత సన్నివేశం, గంగావతరణం! సిరివెన్నెల గారి పాటల అంతరార్థం సులభంగా అర్థమయ్యింది! "ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మేరుపల్లె తుళ్లు .." పాటంతా, ప్రచండవేగంతో ఉరుకులెత్తే శివగంగకు, నువ్వు ఆ దేవదేవుని జటాజూటంలో ముడిపడితేనే కదా విలువ (విరుచుకుపడి సురగంగకు విలువేముంది?) అని, స్వేచ్ఛను ప్రేమించి, పక్షిలా ఎగరాలని కథానాయికకు, ఆ స్వేచ్ఛను ఒక దారిలో పెట్టి నీ నృత్యాన్ని కళాభిమానుల మనో దాహార్తి తీర్చే నాట్య గంగ కావాలని.. ఒక vision చూపే, నాయకుడు. మళ్ళీ ఒకసారి మూవీ చూడండి, ప్రతి పాట పాటకు అదే థీమ్ ఉత్తేజితమై, మెల్లగా ఒక మధ్యతరగతి ఆడపిల్లకు తనలో ఉన్న నాట్యప్రతిభ తనకే తెలియచెప్పే గొప్ప ట్రాన్స్ఫర్మేషన్! అదీ, అద్భుత పదాల అల్లికతో, అత్యంత గౌరవం, ఆరాధన చూపి వెదజల్లిన గీత పుష్పాలు !!! ఆయన సీతారాం కాదు "గీతారామం"! నాలాంటి ఎందరో యువతీయువకులకు పరోక్షంగా చదువు చెప్పిన, సాహిత్యాభిలాషవైపు పరుగులు తీయించిన పెద్దన్న సీతారామ శాస్త్రి గారు! ఆయన రాసిన ఎన్నో పాటల్లో వాక్యాలు కష్టంలో ఉన్న ప్రతివారికి దిక్సూచులు! ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ ..... తెల్లారింది లెగండోయ్ కొక్కరోకో... మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ... మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ... వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా.. పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం...(తరలిరాద తనే వసంతం పాటలో ) నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది (ఇదే కదా రమణ మహర్షి చెప్పే తత్వసారం!) మనుషులు తరాలు మారితే పితృదేవతలవుతారు ! ఎందుకంటే అదే రక్తం, అవే ఆస్తిపాస్తులు, గుణగణాల రూపంలో ముందుతరాల బాట ఏర్పడుతుంది! చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ గారి లాంటి ఎందరో శిష్యులను, ఇంకా ఎందరో ఏకలవ్య శిష్యులను, తనంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది, తన రచనా సృష్టి అనే డిఎన్ఏ "DNA " నిరంతరం ప్రవహించి ప్రపంచానికి సుద్దులు చెప్పేట్టు చేసిన సీతారామ శాస్త్రి గారు, రచనాలోకానికి ఒక "పితృదేవుడయ్యారు"! జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః । నాస్తి యేషాం యశఃకాయే జరామరణజం భయమ్ ॥ Great souls are born to their physical abode(shareeram) and excel with their mastery over their skills, art, and leave a strong stewardship & footprint as their legacy. Their brilliance and excellence stays eternal forever, and such scholarly embodiment has no fear of death and birth in infinite time axis!!! అశ్రునివాళులు 💐💐💐💐💐 -Madhav Kasojjala
@vjeedigunta
@vjeedigunta 2 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్య..
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 2 жыл бұрын
చాలా చాలా గొప్పగా రాశారు. 🙏🙏
@raveendrav
@raveendrav 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
సిరివెన్నెల.. గారి గురించి చాల భావగర్భితం గా చెప్పారు..ఇంత అందమైన వ్యాఖ్యానం ఇంతవరకు చదవలేదు అంటే అతిశయోక్తికాదు...మనసారా ధన్యవాదాలు.. అండి
@Suni.p
@Suni.p 2 жыл бұрын
👏👏👏👏👌🏼👌🏼👌🏼🙏🙏
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 2 жыл бұрын
మీరు ఎంత అదృష్టవంతులు sir. ఇంత గొప్పవాళ్ళతో మీకు పరిచయం సంవత్సరాలు గా సాగడం ఎన్నో జన్మల పుణ్యఫలం. మీరు కూడా కారణ జన్ములే sir. మీ అనుభవాలు పంచుకోవడం అది శ్రీ మారుతీ గారు చెప్పారు అని చెప్పి మరీ పంచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికి ఆ మహాదేవుడు అండగా వుంటారు 🙏🙏🙏
@gsrgsrinu1
@gsrgsrinu1 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, శాస్త్రి గారు ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఏ కారణం వలన మీకు ఇచ్చిన మాట పూర్తి చేయలేక పోయారో మీరు సహృదయంతో అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం మీకు ఉంది. తెలుగు సాహితీ అభిమానులకు మీరు చేసిన, చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. మీరు మీ కవితా సంపుటిని మాలాంటి మీ అభిమానుల కోసం ప్రచురణలోకి తప్పకుండ తీసుకు రావాలి. గంపా శ్రీనివాసరావు, విజయవాడ
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 жыл бұрын
చాలా బాధాకరమైన విషయం సర్....నిజంగా ఇంకా నమ్మలేకపోతున్నాము....ఈ సంఘటన పై మీరు ఏమి మాట్లాడతారా అని నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నాను. చాలా బాగా వివరించారు. మీకు అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏
@subraoviswanadha5262
@subraoviswanadha5262 Жыл бұрын
కన్నా నీ ఏభై సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షల కవిత సీతారామ శాస్త్రి మీద చాలా చాలా బాగుంది. ఈ ప్రక్రియ నేను కూడా గతంలో నారాయణ రెడ్డి గారి కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చినప్పుడు,కలగా క్రిష్ణా మోహన్ ఆల్ ఇండియా రేడియో లో పనిచేసి రిటైర్ అయిన సందర్భంలోను వాళ్ళు వ్రాసిన పాటలు తోనే ఒక మాలగా కట్టి వ్రాసాను. నువ్వు ఆకవితను చదివి వినిపిస్తోంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వ్రాసే అలవాటు ఉన్నవాళ్ళకి ఎక్కడైనా ఇలాంటి వ్రాతల పోలికలు కలిసినప్పుడు అరె వీడు మన దగ్గర బంధువే అని అనిపిస్తుంది. నేను వాళ్ళ ఇద్దరి మీద వ్రాసినవి నీకు ఎప్పుడైనా వాట్సాప్ లో టైపు చేసి పెడతా చదివి ఎలాగుందో చెపుదువుగాని. ఏది ఏమైనా ఈకవిత మాత్రం చాలా చాలా అద్భుతం.
@subraoviswanadha5262
@subraoviswanadha5262 Жыл бұрын
కన్నా ఈ ఏభై సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా సీతారామ శాస్త్రి కి నువ్వు వ్రాసిన కవిత లో ఒక చోట శాస్త్రి గారు ఆ గురువు గారి పాదాల కు నమస్కారం పెట్టారు అప్పుడు అందరూ ఇదేమిటి అందరూ ఈయన పాదాల కు నమస్కారం చేస్తారు, అటువంటి ఈయన ఇలా ఈ గురువు గారి పాదాల కు నమస్కారం చేస్తున్నారు అని అనుకున్నారు అని చెప్పినప్పుడు నాకు నా అనుభవం ఒకటి గుర్తుకు వచ్చి నాకు ఏడుపు వచ్చేసింది.బలవంతంగా అనుకున్నా. ఒకసారి నేను మాతమ్ముడు కలిసి ఆకెళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి శాస్త్రి ఇంటికి వెళ్ళాము. వాడు టెలిఫోన్స్ లో రిజైన్ చేసేశాక మా తమ్ముడు సత్యనారాయణ నా కలవడం అదే మొదటిసారి అంతే ఒక్కసారి గా వాడి కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాడు, గురువు గారు నమస్కారం అంటూ.నా ఆశ్చర్యానికి అవధులు లేవు.ఎందుకంటే అప్పటికే శాస్త్రి సినీ పాటల రచయితగా ఎంతో పేరు ప్రతిష్ట లతో వెలుగు తున్నాడు.అప్పుడు నాకు కుచేలుడు క్రిష్ణుని కలిసిన సన్నివేశం గుర్తుకు వచ్చింది.అప్పుడు వాడి లోని సంస్కారం నాకు అర్థం అయింది. సాధారణంగా అంతా ఎదిగిన వారికి ఎక్కడో ఇటువంటి వారికి తప్ప పాత మిత్రులను గుర్తించరు.ఏది ఏమైనా ఒక గొప్ప మిత్రుణ్ని కోల్పోయాము.
@msanand6869
@msanand6869 2 жыл бұрын
సిరివెన్నెల.... విరబూసిన పాటల పూదోట.. సిరివెన్నెల... ప్రతి మనస్సు పూదోట లో.. సిరివెన్నెల.... ఇక గగనతలంలో ప్రసరించు... సిరివెన్నెల ఇక భువిపై కారు చీకట్లు.... సిరివెన్నెల కివే మా అశ్రునివాళి... యం యస్ ఆనంద్
@bhandarusarma8673
@bhandarusarma8673 2 жыл бұрын
మీరు నిజం చెప్పాలంటే మా కళాశాలోలో ఉపన్యాసుల కన్న గురువు గారి దగ్గరే ఎక్కువ నేర్చుకున్నాను. యువసేన సినిమాలో లోకాసమస్తా సుఖినోభవంతు అనే పాటతో నాకు గురువు గారు పరిచయం అయ్యారు. నేను ఎప్పుడు కాలేజీ మానేసి సినిమా కి వెళ్లినా సమయం వృధా అయింది అనుకున్నదే లేదు. లోతెంతో తెలియని పడవల్లే అడుగేస్తే దారియ్యను అంటుందా కడలైనా.ఆమాట వినగానే ఎన్నిసార్లు కరతాళ ధ్వనులు చేశానో.యుటోపియా ఊహలో అటో ఇటో ఉగుదాం.అనే పంక్తిలో ‌యుటోపియా అంటే అర్థం ఏమిటి అని ఎన్నో సార్లు గౌతమీ గ్రంధాలయం చుట్టూ తిరిగానో ఇంకా గుర్తుంది. అలా తిరగండం వల్ల ఎన్నో గ్రంథాలు పరిచయం అయ్యాయి. ఎన్నో అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన లేరు అంటే నమ్మలేక పోతున్నాను. మీరు అద్బుతంగా చెప్పారు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 2 жыл бұрын
అద్భుతం, అమోఘం,కళ్ళు చమర్చేయి, సి.వే.గారు వెళ్లిపోయినందుకు,కానీ వారి మనసుకు నచ్చిన కిరణ్ ప్రభ గారి అమృత వాక్ తో ఎంతో ఉపశయనం కలిగింది.
@narsimharao7400
@narsimharao7400 2 жыл бұрын
వారి పట్ల మీ త్రికరణశుద్ధి కి హ్యాట్సాఫ్ సర్. ఒక గొప్ప సాహితీవేత్త ను కోల్పోయాం.మన దురదృష్టం. Sp గారి మరణం మరువక ముందే సిరివెన్నెల గారు కూడా వెళ్లిపోవడం చాలా బాధ ను కలిగిస్తుంది.
@obannamro4627
@obannamro4627 Жыл бұрын
Super sir U R love upon Siri vennala La undi sir Hat's off sir
@srayagada
@srayagada 2 жыл бұрын
ఒక వ్యక్తి కి శ్రద్హంజలి ఘటించినపుడు, వారితోటి అనుభవాల్ని పంచుకోవాలన్న గొల్లపూడి గారిచ్చిన గొప్ప సలహాని తూచా తప్పకుండా పాటించారు. అందుకే మీ ఈ శ్రద్ధాంజలి గొప్పవైన అనుభూతుల సమాహారంగా సాగింది. జ్ఞ్యాపకాల నెమరివేత లో భారం కొంత దిగుతుంది.
@jaibharat7038
@jaibharat7038 2 жыл бұрын
వెన్నెలసిరి ఎంతటి చల్లదనమో చందమామను చేరుకున్నారేమో| సీతారాములకలయిక శాస్త్రిగారు మన శ్రీసిరివెన్నెలసీతరామశాస్తిగారు||
@rohinipalnati9627
@rohinipalnati9627 2 жыл бұрын
నమస్కారం అండి చాలా బాగుంది సిరివెన్నల గారి జ్ఞాపకాలు వ్యక్తిత్వం అద్భుతం గా ఉందండీ భావి తరలవారికి మార్గ నిర్దేశనం చేస్తుందని ఆశిస్తూ నమస్కారం
@veerajaladani7966
@veerajaladani7966 2 жыл бұрын
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
@nutisaibabu8754
@nutisaibabu8754 10 ай бұрын
సిరి'స్వర కిరణాలు మాపై కరుణించి ప్రసరించేందుకు 20నెలల కాలం పట్టింది.అయినా అదృష్టవంతులం🙏🏿🙏🏿🙏🏿
@lavanya0911
@lavanya0911 2 жыл бұрын
Thank u Kiran Prabha garu..intha manchi video maku andincharu
@DrVLNSastry
@DrVLNSastry 2 жыл бұрын
*Dr. VLN SASTRY* *30/11/2011* *కీ.శే.(చేంబోలు) సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ సినీగేయ రచయిత కు అశ్రునివాళి!* ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *(స్వీయ రచన)* ★ *(సీ)* *(1/2)* *చీకటి యెట్లాయె! సిరివెన్నెలకు నేడు! పౌర్ణమినెట్లమావాస్య మూసె! *చిత్రగీతికలన్ని చింతించి రోదించె తమతండ్రి ఏడంచు! తల్లడిల్లి! *కవివరేణ్యుని యింట కాగితమ్ములు తడిసె- కలముల కన్నీటి కాల్వలందు! *చేంబోలు గృహసీమ శిథిలమైపోయెనో! శాస్త్రిరామ గది- నిశ్శబ్దమాయె! *(తే.గీ)* *చిత్రసీమను విడనాడె సీతరామ! *తెలుగు జనులకున్- ఈలోటు తీరబోదు! *వాసికెక్కిన పదునైన భాషమీర *గేయముల్ వ్రాయ-* *కైలాసగిరికి చేరె!!*~~~~~~~~~~~~~~~~~~~~~~~ *(2/2)* *(తే.గీ)* *మాలిక* *హాస్య శృంగార వేదాంత హర్ష రౌద్ర *రసములొలికడు గీతికల్ వ్రాసినావు *అసలు నీదైన నొకశైలి అలరెగదర! పొందితీవు- *పద్మశ్రీ* ని పుణ్యమూర్తి! *జన్మ చరితార్థమయ్యెహో! *శాస్త్రి వర్య!* *ఇవియ మా నివాళులు నీకు- *కవి వరేణ్య!* ~~~~~~~~~~~~~~~~~~~~~~ *వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి* *(9963634484)*
@vijayakumarambati7618
@vijayakumarambati7618 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన పాటలు వ్రాశారు. వారి కవిత్వం చాలా మన మన హృదయాలను పులకరింప చేస్తుంది. వారితో ఉన్న అనుబంధాన్ని. సాన్నిహిత్యాన్ని చాలా చక్కగా హృద్యంగా వివరించారు, కిరణ్ ప్రభ గారు.
@balup3963
@balup3963 2 жыл бұрын
MY GURU and INSPIRATION, సీతారామ శాస్త్రి గారు!!!
@syamalajagarlapudi7471
@syamalajagarlapudi7471 2 жыл бұрын
Thank you very much kiranprabha garu .sastry gari gurinchi manchi vishayalu teliyachesaru.Meeru chala lucky, varito meek anta anubandham undadam chala happy ga undi . Manchi vallani tondaraga teesukuvelipotademo devudu . Sastry garu patala roopam lo manatone unnaru.
@SasidharKVL
@SasidharKVL 2 жыл бұрын
🙏Sir Adbhutamaina Nivaali Meeru adruatavantulu enta ante Sirivennela gari abhimanu asuya padenta. Dhanyulam.
@shivkumarpabba4089
@shivkumarpabba4089 2 жыл бұрын
This video on Sirinivennala probably best defines what a tribute should be like!!! Bravo, Kiran Prabha Garu!! I can’t think of anyone bettering you.
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 2 жыл бұрын
Sirivennela gari gurinchi Mee anubhutulu chala manchi gas vivarincharu super
@ramanarao5572
@ramanarao5572 2 жыл бұрын
Hats off to you sir, Kiran Prabha garu. Excellent tribute to an outstanding lyricist.
@gopalakrishnav3930
@gopalakrishnav3930 2 жыл бұрын
Namaste Thanks for sharing Your memories of Sirivennela with us..You have shown the different facets of his personality and the pleasure you experienced by your friendship with him brilliantly. Thank you. 🙏 to a great poet.
@divyajyothin6417
@divyajyothin6417 2 жыл бұрын
మీ స్నేహానుబంధాన్ని గురించి చక్కగా చెప్పారు....మారుతీ రావు గారు అన్నట్టు అందరూ చెప్పేవి ఎక్కడో ఎప్పుడో విన్నవే అయిఉంటాయి....ఇలా personal గా మీ మధ్య జరిగినవి వినడం బాగుంది..May his soul rest in peace
@SaraGee123
@SaraGee123 2 жыл бұрын
Thanks for sharing anecdotes from your close association with Sastri garu (the legendary)! I admire his sincerity to deliver great work and most importantly how he took a stand against cast, class stereotypes while valuing their dedication to work! What an honor and privilege you had. Thanks again Sir!
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Thank u for sharing ur memories with Sirivenela shastry garu it's very loss to film industry Manchi sahityam songs nobody thought he would live us so early waiting for next week.
@ryalisrinivasarao6730
@ryalisrinivasarao6730 2 жыл бұрын
కవితా చంద్రునికి అధ్బుత నివాళి 🙏🙏🙏
@sraokakani878
@sraokakani878 2 жыл бұрын
Excellent Kiran Prabha garu. No words can express your feelings. It’s beyond any comprehension. We are expecting a full length episodes about the departed great Soul.
@p.ravisarma9214
@p.ravisarma9214 2 жыл бұрын
కిరణప్రభ గారూ, మీరు సిరివెన్నెల గారి వ్యక్తిత్వం గురించి చెప్పిన తీరు, సిరివెన్నెల మీద సిరివెన్నెల వంటి మీ కవిత్వం అద్భుతం. మళ్లీ, మళ్లీ వినాలనిపిస్తుంది. మీరు అన్ని విధాలా ధన్యులు. మీకు ధన్యవాదాలు. 🙏🙏 - శేషు శర్మ.
@vijayammakarusara602
@vijayammakarusara602 2 жыл бұрын
Meeru super andi aayana tho meeru panchukunna super days memories 👌👌👌
@arunamarouthu3228
@arunamarouthu3228 2 жыл бұрын
Wonderful reveries! Thanks for sharing.
@svprasad8607
@svprasad8607 2 жыл бұрын
Really a wonderful tribute sir. We could able to feel the personal fragrance between you two. Really it's a very great loss in the perspective of humanity. Very few people live to their words.
@omprakashmulukala8363
@omprakashmulukala8363 2 жыл бұрын
Kiran Prabha Garu Meeku Dhanyavadamulu.
@suseeladevirao7091
@suseeladevirao7091 2 жыл бұрын
మీరు వ్రాశిన కవిత చాలా బావుంది
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 2 жыл бұрын
చిక్కని చెలిమి చూపిన నివాళి చెమ్మగించిన మనసుకు ప్రతిరూపం కిరణ ప్రభ గారు.
@rangarao5473
@rangarao5473 2 жыл бұрын
The very brilliant and excellent scanning of a great personality not only the introspection but also helpful to people to mould themselves positively with humility. Though the demise is painful your tribute is wecomable and highly insightful
@bathinaleela4718
@bathinaleela4718 2 жыл бұрын
Sir your remembrances with sirivennala garu is superb.I started to view Him in the new dimension.you said sirivennala garu was a philosopher. Really He is a deserved person to be admired by you and every one.As a philosopher He awakened every one to raise up from the lethargic life.He advised the people to rise the voices against the corrupted practices prevailing in the country.He also gave a powerful speech at the conclave 2021 by Natioanist Hub.God made Him to sit by his side through the death. Sir ,you have given us chance to know more about him like incidents ,His style of working and His principled life.We can't get such information any where except your message.Many thanks to you sir.
@vkyadav1489
@vkyadav1489 2 жыл бұрын
Sir, thanks for sharing memories of great poet Sri Sirivennala Seetharama sastry Also He is great Patriot
@leelavathiminnakuru6061
@leelavathiminnakuru6061 2 жыл бұрын
Sirivennela gari tho me anubhavalu maatho panchukunnandhuku thanks andi saasthri Garu leni lotu evaru theercha lenidhi 🙏
@srinivasarangarao1385
@srinivasarangarao1385 2 жыл бұрын
ఓటమిని ఓడించేది ఓర్మి.ఒకపాటలో ఈమాటల ప్రయోగం.ప్రయోజనం. ఎందరికో ఆదర్శంగా గమ్యంచూపిన ఆదర్శ మైన మహర్షి.ఆయనగురించి మీ మాటలు అమూల్యమైనవి.ధన్యవాదాలు
@vijaykumardara1090
@vijaykumardara1090 2 жыл бұрын
Sir, I was expecting this show from you the moment I saw your condolences message. Thank you very much for sharing your experiences
@pardhasaradhyvelury1199
@pardhasaradhyvelury1199 2 жыл бұрын
Kiran prabha garu Mee sambashana chaturyam adbhutam
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 2 жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@vijaybhaskarreddy506
@vijaybhaskarreddy506 2 жыл бұрын
Great tribute to great person
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఓం శాంతి ఓం 🙏🙏🙏🕉️🕉️🕉️
@damodarajanapadam9692
@damodarajanapadam9692 2 жыл бұрын
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే ఓదార్పు జ్ఞాపకాలే మైమరపు
@kvinjamuri5051
@kvinjamuri5051 2 жыл бұрын
తెలుగు సాహిత్య సీమపై వెన్నెలలు కురిపించే ఆ నెలరాజు ఎందుకో దూరంగా జరిగి పోయాడు కానీ ఆస్వాదించిన ఆ వెన్నెల మధురిమలు ఎప్పటికీ ప్రతి మదిలో ఆత్మీయ జ్ఞాపకాలే ఆయనతో మీ సాన్నిహిత్యం జన్మ జన్మల అదృష్టం
@vinodkumarkollu6153
@vinodkumarkollu6153 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. ఓం శాంతిః 🙏
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Thank you for your homage to Legend
@RamaKrishna-zg4ho
@RamaKrishna-zg4ho 2 жыл бұрын
Kiran garu very kind of you for sharing your memories🙏
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 2 жыл бұрын
🌹🌹🙏🙏🌹🌹dhanyawadamulu sir wonderful fantastic
@rrprasad7206
@rrprasad7206 2 жыл бұрын
Excellent obituary to an outstanding poet. 🙏 Also, it is more than 1 year since Balu garu passed away. In sheer number of songs & longevity there is no one in the whole of Indian cinema playback singing who can equal him. + he is also proved himself in other cinema departments also. But Sir, you have not posted even one post on him yet. 🙏
@teluguteacher5458
@teluguteacher5458 2 жыл бұрын
Extraordinary 🙏🙏🙏🙏🙏👌👌👏👏👏💐💐💐
@syamchilluri
@syamchilluri 2 жыл бұрын
Excellent sir We lost a legendary writer Superb words sir
@syamsudhakar2755
@syamsudhakar2755 2 жыл бұрын
Kiran prabha garu ( Mamayya garu ) , after so many years I am listening your voice. I hope you remember me if I mention my name & native place ( this is Syam - Kaikalur). I am blessed to hear your talk show , about the legendary writer Sri. Sita rama Sastry garu . By admitting sri. Marurthi rao gari words , your self , whole heartedly made an tribute to Sastri garu. మనకు చాలా గొప్ప పాటలు అందించిన శ్రీ. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి , ఆత్మ కు శాంతి కలగలని, భగవంతుని ప్రార్ధిస్తు 🙏🙏🙏
@phanebhushanrao9620
@phanebhushanrao9620 2 жыл бұрын
HEART' TOUCHING SIR.
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారి స్వరం.. సంస్కారం.. సమున్నతం
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Adrushtavanthulu. Maranamagadham. For you, God endowed Siri Vennela on you. My prayers to each and everyone who is part of Siri Vennela family. Rest in peace. I doubt it as God took him to write for him.
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Pulakarinchindi,,, jaladarinchindi kudaa 😊👌
@koteswarraokodavala1695
@koteswarraokodavala1695 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి కిరణ్ ప్రభ గారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ మీకు 🙏🙏🙏🙏🙏
@anug5129
@anug5129 2 жыл бұрын
A very great tribute and a heartfelt celebration of an exceptional poet, philosopher, and inspirer. I felt numb when I heard news yesterday, I wanted to write a tribute but couldn't find words. మనసు మూగబోయింది. ఆయన మాటల్లో అగ్ని గుళికలు, చిలిపి పదనిసలు, స్పూర్తి దాయకాలు, ఆలోచనా ప్రేరేపితాలు, ఓదార్పు ఊరటలు. సిరివెన్నెల సినిమాలో "ఆది భిక్షువు" పాట వినగానే ఎంత నవ్వు వచ్చిందో! ఆ సినిమా పాటలన్నీ కంఠతా పట్టేదాక స్థిమితంగా ఉండలేకపోయాం అప్పట్లో! మహానుభావులు...🙏🙏🙏
@madhumurali9098
@madhumurali9098 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారూ వందనము.చెంబొలు గారి అముద్రిత కవితలు వెలుగులోకి తీసుకు రాగలరు
@gosalavenkatasatyanarayana2615
@gosalavenkatasatyanarayana2615 2 жыл бұрын
చాలా తొందరగా వెళ్లి పోయారు
@venkatrajeshwar290
@venkatrajeshwar290 2 жыл бұрын
Vennelake vennela Siri vennala 🙏❤️
@slvuma3362
@slvuma3362 2 жыл бұрын
అక్షరరూపం దాల్చిన అనుబంధం ఆర్ద్రతను సంతరించుకుని ఆత్మ స్పృశించింది. తమ సౌందర్యానికి తామే మురిసి పోయేంతగా పాటలుగా పరివర్తన చెందిన మాటల సృష్టికర్త, కారణజన్ములు, మహాపురుషులు అయిన వేటూరి గారు తనువు చాలించినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు దానికి కారణం మన సిరివెన్నెల ఉన్నాడన్న ధైర్యం. కానీ మరి ఇప్పుడు???
@pdprasad1266
@pdprasad1266 2 жыл бұрын
మనః పూర్వక ధన్యవాదములు కిరణ్ ప్రభ వారికి... చాలా ఆనందంగా, కొంచెం బాధగా కూడా వుంది తండ్రి గారి గురించి వింటుంటే 🙏🏻🙏🏻🙏🏻
@vijyalaxmimopuri829
@vijyalaxmimopuri829 2 жыл бұрын
Nice sir
@murthyvsrl9349
@murthyvsrl9349 2 жыл бұрын
Very good news sir
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Neetiloni chepa pilla kanneeti dhaaralni podhivi pattadam 😲👌
@satyardhic9854
@satyardhic9854 2 жыл бұрын
Kiranprabha garu mee ee responce kosam yeduru chustunnamu 6 yers back meeru sastry gurunchi chesina talk show marosari yesterday vinnanu
@sureshbabunakka9229
@sureshbabunakka9229 2 жыл бұрын
🙏🙏🙏🙏👏👏
@voletyramarao1223
@voletyramarao1223 2 жыл бұрын
మహా కవి కి మహా నివాళి 🙏🙏🙏
@lakshmireddy8810
@lakshmireddy8810 2 жыл бұрын
Wow
@akammythili2920
@akammythili2920 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు పోయిన వారం మీ టాక్ షో నుండి మనసు మూగపోయింది. ఎందుకంటే నేను మునసబుగారి అమ్మాయిని ఇంకా తేరుకోకముందే ఈ వారం గొంతు మూగపోయింది.
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 2 жыл бұрын
Sir 🙏
@sureshbabunakka9229
@sureshbabunakka9229 2 жыл бұрын
Same to u sir.. Nenu deuduni nammanu...
@chandrakalagowrishetty7679
@chandrakalagowrishetty7679 2 жыл бұрын
Plz make many more episodes on ur travel with sirivenella
@rajeshbhupathi6418
@rajeshbhupathi6418 3 ай бұрын
Part 2 cheyandi sir
@prasannakrishnaraj5524
@prasannakrishnaraj5524 2 жыл бұрын
🙏🙏🙏🙏
@sunithan4368
@sunithan4368 2 жыл бұрын
💐💐💐🙏🙏🙏💐💐💐
@rjayanth78
@rjayanth78 2 жыл бұрын
#KiranPrabha Dear sir, I request you to do one more long talk show on guruvugaru.
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Sirivennela cenima yenni saarlu chusina kuda prathisaaree yedo okati kotthaga arthamavuthune untundi
@chandrasekharrao5810
@chandrasekharrao5810 2 жыл бұрын
🙏💐💐💐😪
@vaanakka
@vaanakka 2 жыл бұрын
ఇప్పుడే విన్నాను. పూజారి గారి సంఘటన నా అనుభవాలకి దగ్గరగా అనిపించింది. మా ఇంట్లో అంటే నాకూ పిల్లలకి మధ్య ఉంటే సంభాషణ ల్లో ఒక phrase వాడుతాను. నాకు ఆ లక్షణం ఉందని అనుకుంటాను. దానిప్రకారం I am a what person not a who person. దణ్ణం పెట్టించుకున్న పూజారే భోజనం విషయంలో అభిప్రాయం బేధానికి లోబడ్డారు. నన్ను కొందరు "మరి అప్పుడు నచ్చారు అన్నావు కదా, ఇప్పుడు తేడా ఏమిటి అదే వ్యక్తి కదా", అని అన్నవాళ్ళకి ఈ ఉదాహరణ చక్కటి సమాధానం. మీనుంచి ఆశించిన నాణ్యత మరోసారి వినిపించారు; ధన్యవాదాలు.
@cashankar9497
@cashankar9497 2 жыл бұрын
Thanks for the video sir. Please do one video on Amaravati kadhalu by sankaramanchi
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
R I P🙏🏼🙏🏼🙏🏼🍀☘️💚
@ramupodila5187
@ramupodila5187 2 жыл бұрын
Bngaaru vennela
@1Beer2DietSodas
@1Beer2DietSodas 2 жыл бұрын
దీని కోసం ఎదురు చూస్తున్నా..
@durgabalasuresh8528
@durgabalasuresh8528 2 жыл бұрын
🙏🙏🙏
@obannamro4627
@obannamro4627 Жыл бұрын
Sir,,,,,,,,, ,. !?
@nandua9996
@nandua9996 2 жыл бұрын
Please post sirivennela website url
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 ай бұрын
Sir Sorry to interrupt His. Cards game is modern versiom of. Gurazadas pekata. Scene of. Kanya Sulkam play of 1909. This is just remind of. the fact.
@jans8414
@jans8414 2 жыл бұрын
నేనున్నా.. వస్తున్నా..
@dasariprasad8180
@dasariprasad8180 2 жыл бұрын
Asru nivali to Siri vennela garu
@reddygsreddy
@reddygsreddy 2 жыл бұрын
Please display 'Atmavalokanam' part (if available) also from "Kavi(ta) Parinamam"
@bhanuprasad8256
@bhanuprasad8256 2 жыл бұрын
Sir, aa vyasam maatho panchukogalara, dayachesi
@hrudaychand40
@hrudaychand40 2 жыл бұрын
త్రివిక్రమ్ శ్రనివాస్ గురించి కూడా మీ కార్యక్రమం లో చెప్పండి
@suryaganti8465
@suryaganti8465 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు ఆయన గురించి మీరు చెప్పిన రెండు సున్నితమైన విషయాలున్నాయి చూసారా ఆ రెండు చాలు సార్ , ఆయనకు మీకు ఉన్న స్నేహం విలువ చెబుతుంది . 🙏 మీ మీద ఈర్ష్య కలుగుతోంది సార్ , క్షమించండి 🙏
@sowbhagyalakshmithota209
@sowbhagyalakshmithota209 2 жыл бұрын
Kirangaru mana spbalugari gurinchi malli inkosari chppandi
Michelangelo | మైకెలాంజిలో
58:10
Kiran Prabha
Рет қаралды 7 М.
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
SIRIVENNELA SPEECH AT CHENNAI IIT 26-2-2018
1:28:01
SIRIVENNELA OFFICIAL
Рет қаралды 250 М.
KiranPrabha Talk Show on first movie of Megastar Chiranjeevi
1:06:05
Kiran Prabha
Рет қаралды 66 М.
Вилка для консервов 🥒
0:51
Сан Тан
Рет қаралды 3,2 МЛН
小路飞跟姐姐去哪里了#海贼王#路飞
0:45
路飞与唐舞桐
Рет қаралды 44 МЛН