ఇప్పటికే, ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావలసిన 5 DA లు పెండింగ్ లో ఉండగా, ఇప్పుడు, రెండున్నర ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఒక్క DA ఇవ్వడం ఏమిటండీ మంత్రి గారు ??? మీకు కనీస మర్యాద కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద లేనట్టుంది ! రేపు జనవరి 2025 లో ఇంకొక DA రావాలి, అంటే జనవరి 2025 వరకు 6 DA లు పెండింగ్ అవుతాయి. మీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ కూడా, కేసీఆర్ లాగ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని అర్థం అవుతుంది !!! ఉద్యోగులకు ఇవ్వాల్సిన DA లు, చట్ట బద్దమైనవి (Statutory), ప్రభుత్వము యొక్క దయ దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కావు, బోనస్, ప్రోత్సాహకాల లాoటివి కావు, ఈ విషయం మీ మంత్రులకు కూడాఅర్థం అవటం లేదా ? మీ మంత్రులెవరికి ప్రభుత్వాల పరిపాలనా విధానం మీద అవగాహన ఉన్నట్టు కనిపించటం లేదు, ప్రభుత్వన్ని నడిపించే పద్ధతి ఒకటి ఉంటుంది, ప్రభుత్వంలో పని చేసిన సమర్ధుల సలహాలు తీసుకుంటే మీరు పరిపాలనలో పాస్ అవుతారు, లేకుంటే, మీ ఖర్మ, మీరు భవిష్యత్తులో ఫెయిల్ కావటం ఖాయం !!! ఇప్పటికే, మీ ప్రభుత్వo రాంగ్ డైరెక్షన్ లోకి క్రమంగా పోతున్నది అని మాకు అర్థం అవుతుంది, సరి దిద్దుకుంటే ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు, పద్ధతి మార్చుకోకుంటే, రేపు వచ్చే స్థానిక సంస్థల రిజల్ట్స్ లోనే మీకు ప్రజలు స్పష్టం చేయబోతున్నారు !!! తస్మాత్ జాగ్రత్త !!!