Sri Tulasamma Padamalika || Lord Tulasamma Devotionals || శ్రీ తులసమ్మ పదమాలిక || My Bhakthi Tv

  Рет қаралды 46,253

MyBhaktitv

MyBhaktitv

Күн бұрын

Пікірлер: 11
@mybhaktitv
@mybhaktitv 2 жыл бұрын
తులసమ్మకోట ప్రతి ఇంట ఆయుర్వృద్ధికి నూరేళ్ళపంట నూతన జవము నవోత్తేజము శ్రీమహావిష్ణు ఆవృతబీజము తులసిమాత గోవిందం హృదయానంద అరవిందం అంగణమందున శ్రీచందం అపూర్వ సుగుణ అనుబందం సంప్రతీత ప్రతి రూపముగ ఔషదగుణముల నివసతిగ పరదేవత మూర్తిత్వముగ వెలుగు నీ చరిత దివ్యంగ భారతావని ధర్మపథం సంప్రదాయమున సనాతనం సుసంపన్నము సమంచితం పుణ్యతీర్ధముల అవనితలం విశ్వవ్యాప్తము సమంతతం సద్భావనలో సమున్నతం తులసి చరిత సుధ సంకాశం సద్గుణములలో శీతాచలం కులమతాలకతీతంగ వర్గభేదాంత రహితంగ నిత్యారాధన నిధానము ఇరుసంధ్యలలో పూజనము తులామితము తులసీదళం తులాభారమున తులనమచలము శ్రీగోవిందుని సమతులనం శ్రీహరి పూజకు ప్రధానము ధర్మధ్వజుడు మాధవిమాత సంతానముకై తపములచేత తపోఫలముగ వరప్రసాదితము వరపుత్రిక కని సంతతము లక్ష్మి అంశసంభూత అపూర్వ రూపసంజాత అతులిత సుందర శిశువును గాంచి తులసిగ నామకరణము చేసిరి ఊహనములు పొంది శ్రీతులసి మహావిష్ణునే పతిగాకోరి మాతపితలు వారించినను బదరికావనము కేగినది అభీష్టసిద్ధికి దీక్షాధారణ లక్ష దివ్య వత్సరముల అవధి మహావిష్ణు ప్రసన్నత పొందగ ఘోరతపమునే సలిపినది తంబుని తనయుడు శంఖచూడుడు రాక్షసాంశమున అగ్రగణ్యుడు తులసిమాతను ముదమున వరించి సమ్మతించగ పరిణయమాడెను సీతానసూయ శిరోమణులగతి పతివ్రతామణి తులసిమాత శంఖచూడుని పతిదేవునిగ ఆరాధించెను అనుకూలవతిగ అపమృత్యురహిత వరములుపొంది శంఖచూడుడు గర్వమునంది అసుర ప్రవృత్తిన కఠినచిత్తుడై ప్రవర్తించెను సురకంటకుడై శంఖచూడుని తుదముట్టించగ నారాయణుని సురలువేడగ శంఖచూడుని రూపధారిగ శ్రీహరి తులసిమాతను చేరెను ఏతెంచినది సతియని తలచి తులసిమాత హరిని చేరగ పాతివ్రత్యము భంగమైనది సతిమహాత్యపు శక్తి రహితునిగ నిర్వీర్యుడైన శంఖచూడుడు పరమేశునిచే హతుడయ్యే అసురబాధలు ఉపశమించగ సురలు పొందిరి ఉపశమనం కపటమునెరిగిన తులసిమాత శిలారూపమును పొందమని మహావిష్ణువుకు శాపమునిచ్చి యోగాగ్నినందు భస్మమైనది భస్మమునుండి ఉద్భవించినది తులసి మొక్కగ తులసిమాత శాపము పొందిన శ్రీహరి తులసికి పూర్వజన్మ వృత్తాంతము తెలిపెను పూర్వజన్మమున రాధాదేవికి రాధరూప పరిచారిక వీవు శ్రీకృష్ణుని నీపతిగా కోరగ రాధ శాపమును బొందింతి వీవు శాపఫలముగ భూలోకములో రాక్షసునికి సతివైనావు రాధ శాపమున సుధాముడు శంఖచూడునిగ జన్మించె నేడు ఇరువురికి శాపవిమోచన అనవిని తులసి వివరమెరిగినది తులసిని తాకిన తనువును విడిచి మహావిష్ణు వైకుంఠము చేరెను శ్రీవిష్ణుతనువు గండకినదిలొ సాలగ్రామమై పూజలందినది తులసిమొక్కగ తులసిమాత విష్ణు వరమున పూజ్యమైనది అమృతాంశము తులసి జన్మము ఆత్మనందు కేశవప్రియ నిరతము తులసి చిగురించు ఇంటిలోగిల్లు మహాలక్ష్మి కొలువున్న పందిళ్ళు మూలమునందున సర్వతీర్ధములు మధ్యమునందున సకలదేవతలు అగ్రభాగమున సర్వవేదములు అలరు తులసికి నమస్కృతులు దామోదరుడు శిలారూపమున శ్రీతులసి నందు కొలువుండ ఇహలోకములో పరమందు ఫలప్రదాయని తరిగొండ రామతులసిగ క్రిష్ణతులసిగ లక్ష్మీతులసిగ ప్రతిహృదినిండ ఆరోగ్య ప్రధ ఐశ్వర్య అండ శ్రీమహావిష్ణునకు వరదండ బ్రహ్మవైవర్త పురాణ కథనం తులసిమాత విశేషణం కార్తీకంలో సలిలా స్నానము దామోదరునకు ప్రీతిపాత్రము సూర్యోదయ పూర్వమున పూజనం శ్రీమహావిష్ణువుకు సమర్పణం సూర్యోదయమనంతరార్చనం పరమశివునకు అర్పితము తులసిమాత నమోనమో అని త్రికరణశుద్ధిగ స్మరణము చేసి నియమనిష్టలు భక్తిశ్రద్ధలతొ ముమ్మారులు ప్రదక్షిణ చేసి తులసిమాతకు ప్రీతిపాత్రముగ తదనంతర జలపాతనము ధూపదీప నైవెద్య పూజనం ఆయురారోగ్య సిద్ధి సాధనం కలిశమునందు సుజలమునింపి భక్తిగ కలిశారాధన సలిపి పుష్పాక్షితలు చందనములతొ కలిశజలమును ఆమంత్రించి ద్యానావాహన మంత్రసహితముగ ధూపదీపములు ప్రదక్షిణలతో వినమ్రంగా జలమును పోసిన కోర్కెలీడేరు అనవరతం పౌర్ణమి అమాస ద్వాదశతిదిలో రవిసంక్రమణ దినములలో తైలభ్యంగము చేసిన దినమున మధ్యాన్నకాల సమయములో నిశిసంధ్యలోను అపరిశుభ్రముగ అశౌచకాలము నిద్రాగతిలో తులసి తుంచటము అపకృతము ఈతరుణములో నిషేధము మరణ ప్లవనము తులసి గుణము పురాణములలో విశిష్టవరణం తులసిగంధ సమ్మిళిత పవనము రోగపీడలకు అవకర్షణము పిన్నలు పెద్దలు స్త్రీపురుషులును సకలజనులకు పూజితము శ్రీమహావిష్ణు ప్రీతిపాత్రము హరి అర్చనమున పూజాద్రవ్యం తులసిమాత పూజలతో ముత్తైదువులకు సౌమాంగళ్యం వైధవ్యులకు దైవానుగ్రహము కన్నెపిల్లలకు శుభమంగళము పిన్నలకు జ్ఞానదాయకము పెద్దలకు ఆరోగ్యప్రదము సకలతీర్ధములు సకలదేవతలు సకలవేదముల పూజాఫలము
@KetavathMothilal
@KetavathMothilal 2 ай бұрын
Soqo L
@dhananjayatabala9538
@dhananjayatabala9538 3 жыл бұрын
Excellent lyrics melody's voice 👌
@nagaratnamavadhanula7111
@nagaratnamavadhanula7111 3 жыл бұрын
Really excellent thank you trinad garu
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 2 жыл бұрын
🌹🌹🙏🙏
@mybhaktitv
@mybhaktitv 2 жыл бұрын
Thanq.
@anithaballanki6253
@anithaballanki6253 Жыл бұрын
Damodara tulasamma song pettandiii🙏🙏🙏☀️
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@tsubhashiniyadav7319
@tsubhashiniyadav7319 3 жыл бұрын
Pls santhoshi matha chalisa telugu relies cheyzndi
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@itthaditeja155
@itthaditeja155 3 жыл бұрын
Comllvdell and I
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 9 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 30 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 86 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН