పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "