Рет қаралды 3,071
నీ కృప ఇవ్వబడెనె నా కొరకు
నీ కృప జీవముకంటే ఉత్తమమ్ము
కాపాడుచుంటివే నా ఆత్మను
జీవము దయచేసి సంరక్షించుటకు
నా మనసారా నీ కృపను గూర్చి పాడెదను....
నా మనసారా నీ కృపను గూర్చి చాటెదను....||2|| (నీ కృప)
1. నా గతకాల యాత్రలో పలు శోధనలలో ~ నీ కృపా నను వెంటాడెను....
నేను అగ్ని గుండములో మండుచుండినను ~ నాతో సంచరించి కాపాడినావు...||2||
అలసిపోలేదుగా.... నీ కృప బలపరచగా...
కాలిపోలేదుగా.... నీ కృప తోడుండగా... [నా మనసారా...|
2. నేను గడిపిన కాలములో ప్రతి పరిస్థితులలో ~ కృపాక్షేమముతో నను నడిపించావు..
నేను సింహాల బోనులో పడద్రోయబడినను ~ వాటి నోటికి అప్పగించలేదు...||2||
జారిపోలేదుగా...నీ కృప రక్షించగా...
చీల్చబడలేదుగా... నీ కృప కాపాడగా... [నా మనసారా...]
3. నా ముందున్న కాలములో హితవత్సరములో ~ తేబడు కృపకై ఎదురుచూచెదను
నీ ప్రతి వాగ్దానమును నేను నమ్మెదను ~ అధైర్యపడక ముందుకు సాగెదను... ||2||
బ్రతుకు దినములన్నియు నీ... కృపలో నిలిచెదను
ఆజ్ఞలో మార్గములో... రోషముతో సాగెదా...[నా మనసారా...]
Bethel Geethaalu
2024 ALBUM
Volume 3
Track 2
Contact bethelministriesaudios@gmail.com for more information.