పరలోక స్వరము…Heavenly Voice.. ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా? మరణమే జీవితానికి ఆంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీ కోసమే.. శాంతి సమాధానాలు, ఆదరణ లేని ప్రతి మనిషి కోసమే... నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు. ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది. భక్తి పూజా పునస్కారాల, బలియజ్ఞయాగాదుల, దీక్షా సంతర్పణల, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు..పరిశుద్ధతను సంతరించుకోజాలడు. అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నీపట్ల, నాపట్ల తనకున్న మహా ప్రేమాసంకల్పం చొప్పున పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నారావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు. యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి పరిపూర్ణమైన సంతోషం, శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము నిత్య శాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో… ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేయును గాక🙌🙌 యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌 దేవతలు మ్రొక్కిన దేవుడెవరు? kzbin.info/www/bejne/r2GzmYqahZqWp8U
@mohdyousuf22072 жыл бұрын
Good information sister
@SistersTalksTelugu2 жыл бұрын
Thank you
@Ananya-Anvika3 жыл бұрын
Nice place Andi memu every year Medak church ki velthamu Last time velinapudu outside nundi chusam inside chala bagundi place😊
@SistersTalksTelugu3 жыл бұрын
Ohh. Tq so much andi
@rahulprankster..2613 Жыл бұрын
❤❤❤
@vimalanandsterracegarden41983 жыл бұрын
Food tinadaniki grills tho shed baguntundi
@SistersTalksTelugu3 жыл бұрын
Ohhh okay but food allow cheyatledhu kada
@vimalanandsterracegarden41983 жыл бұрын
@@SistersTalksTelugu that's wat im saying big shed vesi chutuu grills tho cover chesthey baguntundi.