పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శేష్ట యీవులన్ ఈ భువియందు 1)జీవిత యాత్రలో సాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి ఎబినేజరువైయున్న ఓ యేసుప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి || పొంది || 2)గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా నీవే నా ఆశ్రయ దుర్గంబైతివి || పొంది || 3)కష్ట దుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశల యందున ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి || పొంది || 4)నా దేహమందున ముల్లునుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలయందు నీ కృపను నాకు దయచేసితివి || పొంది || 5)నీ ప్రేమ చేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్టపరీక్షల యందున ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి || పొంది ||