ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా. ఆపత్కాలమందునా - సర్వలోకమందున్నా - దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా.. ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా.. ఆనందింతు నీలో - జీవితాంతమూ నీకృప ఎంత ఉన్నతమో.. వర్ణించలేను స్వామి.. నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య... (ప్రేమ పూర్ణుడా) పూర్ణమై సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము "2" ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు.. ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య"1" (ప్రేమా పూర్ణుడా) నా తోడు నీవుంటే అంతే చాలయ్య... నాముందు నీవుంటే భయమే లేదయ్యా...."2" భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి "2" బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి... భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య..."1" నా తోడు నీవుంటే అంతే చాలయ్య.... నాముందు నీవుంటే భయమే లేదయ్యా... "2" నిత్యము - ప్రతి నిత్యము... నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే "2" నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు.. నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య.."1" నా తోడు నీవుంటే అంతే చాలయ్య.. నాముందు నీవుంటే భయమే లేదయ్యా..."2"