Рет қаралды 162,337
నా ఆహార-విహారం తూర్పు గంగవరం వైపుగా సాగించిన పయణనాన తరుసుపడిన ప్రకృతి సోయగం మదికి హాయిని పంచితే.
గుంటి గంగమ్మ క్షేత్రానికీ చేరిన శుభతరుణాన అమ్మవారి దివ్య దర్శనంతో శుభాసీస్సులు లభించాయి.
అన్యోన్యతకు ఆదర్శవంతం పుల్లారావు-కాశీ రత్నమ్మ గార్ల దంపతులు.
పెద్దలైన హుషారుగా తమ పూర్వికులు చూపిన ఉపాధి మార్గాన్ని కొనసాగిస్తూ తద్వారా పలువురుకి జీవనోపాధి చూపడం స్ఫూర్తివంతం.
ఇరువురు భోజన శాల నిర్వహణలో ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్న కాస్త తీరిక దొరికితే చాలు మమతానురాగ పూర్వకంగా వకరినొకరు పలుకరించుకునే తీరు బహు ముచ్చట గొల్పుతుంది.
శాల నిర్వహణ తరముల నేపధ్యం కనుక పాక శాస్త్రం లో విశేష శ్రేష్ఠతా నేర్పు ఈ దంపతులది.భోజనం తయారీలో శాస్త్రీయత నిష్ఠగా పాటిస్తారు.
ముఖ్యంగా
ఆయా కూరల రుచికోరకు అనవసరమైనవి వినియోగించారు.అలనాటి విధానంలో అత్యంత సహజంగా వండుతారు.పొడులు,ఊరగాయ, రొటి పచ్చడులను సైతం స్వయంగా సంప్రదాయబద్ధంగా పూర్వపు పంథాలో తయారు చేస్తారు.
నెయ్యి,పెరుగుకై పాలని స్థానికంగా పాడిరైతుల వద్ద తెచ్చుకొంటారు.
అంతిమంగా భోజనం చేసేందుకు తమ ఇంటికీ వచ్చే వారినీ ఆప్యాయంగా ఆహ్వానిస్తూ శుచి-రుచితో కూడిన ఆరోగ్యకర కమ్మటి భోజనాన్ని తిన్నవారు ప్రాప్తత వ్యక్తం చేయువిధంగా ఆకలి తీరే వరకు కొసరి,కొసరి ఆత్మీయతతో వడ్డన చేస్తారు.
నా సంతృప్తికర ఆస్వాధనను అభిప్రాయాల వివరణ తదుపరి వీక్షించగలరు.
పుల్లారావు గారి భోజనం, తూర్పు గంగవరం, తాళ్లూరు మండలం, ప్రకాశం జిల్లా.
గూగుల్ లొకేషన్:-maps.app.goo.g...