Рет қаралды 81,728
గ్రామీణ ప్రాంతాలలో గల ఆహార శాల్లో
రుచికరమైన ఆహారమే కాదు,ఆత్మీయతాభిమానం మెండుగా లభిస్తుంది.ఆ ఆస్వాధన అనుభూతి మనకు సుపరిచితం.
అలరాల మేలుకొలుపే జామే కాదు కోడి కూసే పొద్దు మనకెరుకే కదా. అట్టి పల్లెటూరి ఊసులతో నేను ఈ వేళ మీ ముందుకు వచ్చాను.
సరోజనమ్మ గారి ఉపాహారాలు గూర్చి చెప్పాలంటే తొలుతగా వారి వద్ద లభించే కారం గూర్చి చెప్పాలి. తమ పొలంలో సహజ సిద్ధంగా పండించిన మిరపకాయలతో అలనాటి విధానంలో సరోజనమ్మ గారు తయారు చేసే నల్ల కారం ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.ఈ విధమైన కారం బహుశా మరెక్కడా లభించకపోవచ్చు.ఈ శాలలో అల్పాహారాలు తిన్నప్రతి ఒక్కరూ కారం గూర్చి ప్రాముఖ్యంగా చెప్పారంటే ఇక మీరే అర్ధం చేసుకోవచ్చు.ఆ పొడిలో ఒదిగివున్న మమకారం పరిధి. అట్టి కారం వినియోగం తో పాటు శుచి-రుచిగా అల్పాహారాలను అందిస్తూ మూడున్నర దశాబ్దాల ఘన కీర్తి పొందింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలోని సరోజనమ్మ గారి అల్పాహార శాల.కనుకనే స్థానికులే కాదు సమీప గ్రామాల వారి తోపాటు సుదూర ప్రాంతాల నుండి సైతం నిత్యం వస్తారు అల్పాహారాలు తినేందుకై.ఇచ్చట అల్పాహారాలు తిన్ననేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఆహార అభిప్రాయాల తదుపరి సరోజనమ్మ గారి మనవడు రాము గారు మనకు శాల గురించి వివరిస్తారు.
నాయుడు గారి హోటల్, ఇలపావులూరు, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా.
గూగుల్ లొకేషన్:- maps.app.goo.g...