శ్రీశైలం ఆలయ విశిష్టత | భ్రమరాంబికా అమ్మవారి కథ | Srisailam Temple History in Telugu Story

  Рет қаралды 4,647

Dharma Darshan

Dharma Darshan

5 ай бұрын

శ్రీశైలం ఆలయ విశిష్టత | భ్రమరాంబికా అమ్మవారి కథ | Srisailam Temple History in Telugu Story
Story: ఎంతో పురాతనమైన మల్లికార్జున స్వామి వారి ఈ శైవ క్షేత్రం, ద్వాదశజ్యోతిర్లింగాలలో రెండవది. ఇదే క్షేత్రంలో కొలువైవున్న బ్రహ్మరాంభికాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదిగా పేర్కొనబడింది. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకేదగ్గర ఉండడం ఈ శ్రీశైల తీర్థం యొక్క ప్రత్యేకత. యుగయుగాలుగా నల్లమల పర్వతాలపై, కృష్ణా నది ఒడ్డున కొలువైవున్న శ్రీశైల క్షేత్ర చరిత్ర, మహత్యం ఈ వీడియోలో తెలుసుకుందాం.
దయచేసి ఈ వీడియో ని like చేసి, channel కి subscribe చేసుకొని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి.
శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ సమీపంలో నల్లమల పర్వతాల మధ్యన వుంది. ఇక్కడ పాతాళ గంగ అని పిలవబడే కృష్ణా నది బ్రహ్మగిరి, విష్ణుగిరి మరియు రుద్రగిరి పర్వతాలమధ్యన వెలసి ఆ మల్లికార్జున స్వామికి పాదాభివందనం చేస్తూ ఉత్తర దిశగా ప్రవహిస్తుంటుంది. రామాయణం, మహా భారత కాలం నుంచి నేటి వరకు ఎందరోమంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు అంటే ఈ ఆలయం గొప్పతనం ఏమిటో మనం అర్ధం చేస్కోవచ్చు. చరిత్ర ప్రకారం శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి రెండు స్థల పురాణాలు ప్రచారంలో వున్నాయి.
మొదటిది:
పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన పరమ శివ భక్తుడు. ఆయనకి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. అప్పుడు శిలాద మహర్షి చాలా కాలంపాటు శివుని గురించి కఠినమైన తపస్సు చేసారు. ఆ తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు శిలాద మహర్షి ముందు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. శిలాద మహర్షి తనకి ఇద్దరు పుత్రులని ప్రసాదించమని కోరుకున్నాడు. అడిగిన విధంగానే శిలాద మహర్షికి నంది మరియు పర్వతం అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. కాలక్రమేణా వారు ఇద్దరు కూడా పరమేశ్వరుని భక్తులు అయ్యారు.
శిలాద మహర్షి అనుమతితో పర్వతుడు కూడా శివారాధనకోసం తప్పస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు పర్వతుడు తనని ఒక పర్వతంగా మార్చి, శివుడిని కుటుంబ సమేతంగా తనపై నివసించమని కోరుకుంటాడు. కైలాసంలో లాగా తనపై కూడా పుణ్య నదులు, పవిత్ర జలాలు, అనేక శిఖరాలు, ఫలాలను ఇచ్చే ఔషధ మొక్కలు మరియు వృక్షాలు, జంతువులు, పక్షులు, ఎనిమిది మంది భైరవులు, మునులు మరియు ఋషులు నివసించేలాగా వరం కోరుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు, ఆ పర్వతం పైన జ్యోతిర్లింగంగా కొలువు దీరాడు.
రెండవది:
శివుడు పార్వతి సమేతంగా కైలాస పర్వతంపై నివసించేవాడు. ఒకనాడు వారి సంతానమైన కుమార స్వామి మరియు గణేశులకు వివాహం చేయాలనీ నిశ్చయించారు. అయితే ఇరువురిలో ఎవరికీ మొదట వివాహం చేయాలి అనేది తేల్చడానికి వారికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ భూగోళాన్ని మొత్తం ఒక చుట్టుచుట్టి వస్తారో వారికే మొదట వివాహం జరుగుతుంది అని చెప్తారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనంపై పయనమయ్యారు. శరవేగంతో భూగోళాన్ని చుట్టడం మొదలుపెట్టారు. అయితే వినాయకుడు మాత్రం వేగంతో తన సోదరుడిని ఓడించి నెగ్గలేనని తెలుసుకొని తన తల్లి తండ్రులని తన సర్వస్వంగా భావిస్తానని కావున వారే తనకి భూగోళంతో సమానమని వారి చుట్టు మూడు ప్రదక్షిణాలు చేసాడు. గణనాథుని భక్తి, ప్రేమ మరియు సమయస్ఫూర్తికి మెచ్చిన శివపార్వతులు గణేశుడే పరీక్ష నెగ్గాడు అని తనకి బుద్ధి, సిద్ధి మరియు రిద్ధి లను ఇచ్చి వివాహం చేసారు. భూమిని చుట్టి వచ్చిన కుమార స్వామి విషయం తెలుసుకొని ఆగ్రహానికి లోనై కైలాస పర్వతాన్ని విడిచి క్రుంచ పర్వతంపై నివసించాడు. కుమార స్వామి తమని విడిచి వెళ్లాడనే బాధలో శివ పార్వతులు కూడా కైలాశాన్ని వదిలి కుమార స్వామి చెంతకు చేరారు. అలా వారు నివసించిన ప్రదేశమే శ్రీశైల క్షేత్రం. ఆ పర్వతంపైనే పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలిసాడు. పార్వతి దేవి బ్రహ్మరంబా అమ్మవారిగా వెలిశారు.
బ్రహ్మరంబా శక్తిపీఠం కథ:
ఒకపుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలంపాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడి అనుగ్రహంకోసం జపం చేసి ద్విపాద మరియు చతుష్పాదాలచే మరణంలేకుండా వరం పొందాడు. వర ప్రవభావంతో దేవతలను ఋషులను హింసించసాగాడు. భయపడిన దేవతలు ఆదిశక్తి అయినా అమ్మవారిని ప్రార్ధించాడు. అమ్మవారు ప్రక్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీమంత్రం జపిస్తున్నంతవరకు తనని ఎవరు ఏమి చేయలేరని చెప్తుంది. అప్పుడు దేవతలందరు ఆలోచించి పథకం ప్రకారం వారందరికీ గురువైన బృహస్పతిని అరుణాసురుడు దగ్గరకి పంపిస్తారు.
బృహస్పతి రాకను గమనించి ఆశ్చర్యపోయిన అరుణాసురుడు అతని రాకకు గల కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీమంత్రంతో ఆరాధిస్తున్నాము కావున నాయొక్క రాకలో వింత ఏమిలేదు అని చెప్తాడు. అప్పుడు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజించాలి అని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు. దీనితో కోపించిన ఆదిశక్తి బ్రహ్మరంబా రూపాన్ని ధరించి అసంఖ్యాకంగా బ్రహ్మరాలను సృష్టిస్తుంది. ఆ బ్రహ్మరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని అంతమొందిస్తాయి. ఆ తరువాత అమ్మవారు శ్రీశైలంలో వున్నా స్వామివారి క్షేత్రం చేరుకొంటారు. ఈ విధముగా శ్రీశైలంలో స్వామివారు, అమ్మవారు కలసి కొలువయ్యారు.
శ్రీశైలానికి శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతము, శ్రీధన్ అనే నామాలు వున్నాయి.

Пікірлер: 6
@punnisoul
@punnisoul 5 ай бұрын
గణేష్ జి కి బుద్ధి , రుద్ది & సిద్ధి ముగ్గురు కాదు. ఇద్దరే రిద్ధి & సిద్ధి . గణేష్ బుద్ధి యొక్క స్వరూపమైన వివేకం అనగా జ్ఞానం.
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 5 ай бұрын
వివరించినందుకు ధన్యవాదములు... మన ఛానల్ లో మిగతా వీడియోలు కూడా చూడండి... నచ్చితే subscribe చేసుకొని సహాయపడండి. 🙏🏼
@venkatVenkat-tf7ze
@venkatVenkat-tf7ze 4 ай бұрын
Kp Bbjbk 2 Il I 7 K7aoll❤iwìi⁰ ​@@DharmaDarshanTelugu
@pallapusrinu5224
@pallapusrinu5224 5 ай бұрын
ఓం నమః శివాయ నమః
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 5 ай бұрын
Hara Hara Mahadeva 🙏🏼 Please subscribe and support us ☺️
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 116 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 13 МЛН
ONE DAY SRISAILAM TOUR    BY KRISHNA KATHALU
11:23
krishna kathalu
Рет қаралды 128 М.
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00