Рет қаралды 4,058
శ్లో|| మహాలయ అమావాస్యా కాలే అమరభైరవం |
హోమేనామృతకాళీం చ పూజయిత్వా శుభం లభేత్ ||
మహాలయ పక్షములలో పితృదేవతల సంతృప్తి కోసం చేసే శాస్త్రోక్తములైన విధి విధానములు ఉన్నాయి. అలాగే అత్యంత శక్తిమంతమైన మహాలయ అమావాస్యనాడు అమర భైరవ అమృత కాళీ పూజ, హోమమును చేయడం వలన పితృదేవతలకు సంతృప్తిని, శాంతిని, అమృత సిద్ధిని కలిగించటం మాత్రమే కాక పితృదోష
ముల వలన వంశానుగతముగా వస్తున్న కష్టములను, ప్రయోగ బాధలను, మృత్యుగండ దోషములను, యితర యిబ్బందులను తొలగించి అమృత యోగమును, సంకల్ప సిద్ధిని కలిగిస్తాయని మంత్ర శాస్త్రములు చెపుతున్నవి. శార్వరినామ సంవత్సర మహాలయ అమావాస్య 17-09-2020, గురువారం నాడు పరమ పూజ్యులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్య సమక్షమంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో శ్రీ శక్తిపీఠంలో “శ్రీ అమర భైరవ సహిత అమృత కాళీ పూజ, హోమము” జరుగనున్నవి. ఈ మహత్తర కార్యక్రమముల ద్వారా భక్తులందరూ గురువుల, దేవతల అనుగ్రహమును పొందగలరు.