No video

శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం | Sri Ganesha Sahasranama Stotram | Sri Samavedam Shanmukha Sarma

  Рет қаралды 87,372

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

Watch LIVE Sri Ganesha Sahasranama Stotra Parayanam (శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం) By Brahmasri Samavedam Shanmukha Sarma in Bhakthi TV
* సంకష్ట హర చతుర్థి పర్వదినం సందర్భంగా..
* "వక్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభా"
* శుభాలు అనుగ్రహించే ఏకదంతుని నామాలు..!
* గణపతి ఉపాసనతో సిద్ధించే అభీష్టాలు..!
* కోటి గొంతుకలతో గణనాథుడిని స్తుతిద్దాం.. కరోనా మహమ్మారిని రూపుమాపమని వేడుకుందాం..!
* పార్వతీ తనయుని అనుగ్రహానికి పాత్రులమవుదాం.. మహమ్మారిని తరిమికొడదాం..!
* ఈ అరుదైన పారాయణంలో మీరూ పాల్గొనండి.. గణనాథుని అనుగ్రహానికి పాత్రులుకండి..!
#SriGaneshaSahasranamaStotraParayanam #BrahmasriSamavedamShanmukhaSarma #Coronavirus
* JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
#BhakthiTV | Bhakthi TV Live | Telugu Devotional Channel Live | Bhakthi TV Live Official #BhakthiTVLive #BhakthiLive
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ క(Ka)రోనా ఎప్పటిదాకా..? ►►► • Video
✪ మంత్ర ఉచ్చారణతో ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు..! ►►► • Video
✪ కరోనా ఇలాంటి వాళ్ళకే పెద్ద సమస్యగా ఉంది ►►► • Video
✪ ప్రపంచాన్ని కమ్మే చీకట్లను (కరోనాను) పారద్రోలేది సంధ్యా దీపమే..! ►►► • Video
✪ నిరంతరం వెలుగు వైపు సాగాలని మోదీ సూచన..! ►►► • Video
✪ మహాసంకల్పంగా అంధకారాన్ని తరిమికొట్టడం కోసం ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు దీపారాధన..! ►►► • Video
✪ రోగనివారణకు ఇంట్లోనే ఉంటూ.. ఆధ్యాత్మిక సాధన చేద్దాం..! ►►► • Video
✪ మన దేశంలో "క(Ka)రోనా" ఈ స్టేజ్ లో ఆగిపోతుంది ►►► • Video
✪ కరోనాను జయిద్దాం ►►► • Video
✪ శరీర శుభ్రతకు, ఇంటి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం..! ►►► • Video
✪ కరోనా ప్రభావం ఈ రాశులపై ఎక్కువగా ఉంటుంది ►►► • Video
✪ జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ వ్యాధి ఎంత కాలం వరకు ఉంటుంది..? ►►► • Video
✪ కరోనా ప్రభావం ఏప్రిల్ 25 తర్వాత ఇలా ఉంటుంది ►►► • Video
✪ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనదేశం మీద కరోనా ప్రభావం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Пікірлер: 85
@padma2207
@padma2207 4 жыл бұрын
బీజాపూర గదేక్షు కార్ముక రుజా చక్రాబ్జ పాశోత్పల| వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్నకలశ ప్రోద్యత్కలామ్భోరుహః|| ధ్యేయో వల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్జ్వలద్భూషయా| విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ విశిష్టార్థదః|| గండపాలీగలద్దాన పూర -లాలస మానసాన్ ద్విరేఫాన్ కర్ణతాలాభ్యాం వారయంతం ముహుర్ముహుః కరాగ్రధృత మాణిక్య కుంభ వక్త్ర వినిర్గతైః రత్నవర్షైః ప్రీణయంతం సాధకాన్ మదవిహ్వలం మాణిక్య ముకుటోపేతం సర్వాభరణ భూషితం|| 1.శ్రేష్ఠమైన ఏనుగు వదనం కలిగి శిరస్సుపై నెలవంక ప్రకాశిస్తూ,ఎర్రని శరీరకాంతితో,మూడు కళ్ళతో శోభిస్తూ ఎడమతొడపై కమలాన్ని చేతితో పట్టుకుని కూర్చున్న సిద్ధలక్ష్మీ దేవిని (వల్లభా దేవిని)ఆలింగనము చేసుకున్న వాడు తన పది చేతులలో క్రమంగా బీజాపూరము(దానిమ్మ)గద,చెరకువిల్లు,త్రిశూలము,చక్రము కమలము పాశము కలువ, వరికంకు,విరిగిన దంతమును,తొండముతో రత్న కలశను,ధరించిన గణపతిని ధ్యానిస్తున్నాను. 2.గండభాగము నుండి స్రవిస్తున్న మదజలధారల కోసం మూగుతున్న తుమ్మెదలను తన తాటాకుల వంటి చెవులతో మాటి మాటికీ తోలుతున్నవాడు,తన తొండము నందు ధరించిన మాణిక్యములు పొదగబడిన కలశము నుండి రత్నములను అక్షయంగా వర్షింపచేస్తూ తనను ఉపాసించేవారికి ప్రీతిని కలిగిస్తూ మాణిక్య కిరీటము సకల అవయవములకు అనేక ఆభరణములను ధరించి ప్రకాశిస్తున్న మహాగణపతిని ధ్యానిస్తున్నాను. పూర్ణ పరబ్రహ్మతత్త్వం ప్రకృతీ పురుషాత్మకం, *పంచభూత తత్త్వకరం* ఈ గణపతి సర్వదేవాత్మకుడు. ప్రధానంగా పంచ మిథున దేవతలు వున్నారు. 1.చక్రము సమాంతరంగా వున్న పద్మము-లక్ష్మీ నారాయణ తత్త్వం(జలం) 2.త్రిశూలము దానికి సమాంతరంగా వున్న పాశం-పార్వతీ పరమేశ్వరులు(అగ్ని) 3.చెరకువిల్లు దానికి సమాంతరంగా వున్న నల్ల కలువ-రతీ మన్మథులు(వాయువు,మనస్సు) 4.గద దానికి సమాంతరంగా వున్న వరి కంకులు-భూతత్త్వ వరాహ తత్త్వాన్ని తెలియచేస్తుంది.(భూమి) 5.దంతము దానికి సమాంతరంగా వున్న బీజాపూరము-పుష్టి పుష్టి పతి గణపతి అనే దేవతలను తెలియచేస్తుంది.(ఆకాశం) ఫలశృతి:-- ఈ ధ్యానం వలన సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. Source:Brahmasri Samavedam Shanmukha Sarma Guruvu gari pravachanalu
@gudupalliprabhavathi7337
@gudupalliprabhavathi7337 4 жыл бұрын
🙏🙏🙏🙏
@kavitham6497
@kavitham6497 2 жыл бұрын
Thank u amma
@padma2207
@padma2207 4 жыл бұрын
మహా గణపతి సహస్రనామ స్తోత్రము ఎలా ఆవిర్భవించింది!!? ఈ మహా గణపతి స్తోత్రాన్ని స్వయంగా గణపతే ఉపదేశించినటువంటి స్తోత్రం.ఎవరో రచించినది కాకుండా సాక్షాత్తు గణపతే ఈ స్తోత్రాన్ని తన నుంచి వ్యక్తపరిచాడు.దానిని మహర్షి వ్యాసదేవుడు తపస్సమాధిలో విని గణేశ పురాణం లో గ్రంథస్థం చేశాడు.ఈ సహస్రనామ ఉత్పత్తికి సంబంధించి అద్భుతమైన వృత్తాంతం వున్నది. 🙏పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు ఆ త్రిపురులను సంహరించేటప్పుడు కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి.అప్పుడు పార్వతీ దేవి అందిట,మీ అబ్బాయికి చెప్పి వచ్చారా అని.వెంటనే పరమేశ్వరుడు ధ్యానంచేసి తన హృదయంలో గణపతిని ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడు పంచ వదనాలతో ఉన్నాడు శివుడు అంటే సద్యోజాత,వామదేవ,అఘోర, తత్పురుష,ఈశాన అను ఐదు ముఖాలతో పది చేతులతో వున్న శివుడు గణపతిని ధ్యానిస్తూవుంటే ఆయన హృదయంలో వున్నటువంటి ఆ చైతన్యమే,ఆయన నుంచి బయటకు వచ్చి ఐదు ముఖాలతో పది చేతులతో కనిపించింది.అంటే తనవలే వున్న రూపం కనబడింది.భేదం ఎక్కడున్నదయ్యా అంటే ఆ ఐదు వదనాలు ఏనుగు వదనాలే.ఆ ఐదు వదనాలతో పది చేతులతో వున్నవాడు సింహంపై కూర్చుని వున్నాడు.సింహం అనగానే శక్తి స్వరూపము అని అర్థం.పైగా ఆ గణపతికి కూడా నెలవంక వున్నది. అంటే శివశక్త్యాత్మకమైన ఒక స్వరూపం శివుని హృదయం నుంచి వ్యక్తమై బయటకు వచ్చింది.శివుడే మహాగణపతి రూపంలో కనబడుతున్నాడని భావించవచ్చు.తనని తానే శివుడు దర్శించాడు ఆ రూపంలో.ఆవిధంగా మహాగణపతి ఆవిర్భవించాడు.ఈయనకే మరొక పేరు 'హేరంబ గణపతి'.అప్పుడు ఆ హేరంబ గణపతి స్వయంగా తననుంచి ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని ఉత్పన్నం చేశాడు.అది శివుడు విని పారాయణం చేశాడుట. ఆ పారాయణం చేసిన వెంటనే త్రిపురాసుర సంహారానికి ఏ విఘ్నములు ఉన్నాయో అవి అన్నీ తొలిగిపోయి సులభంగా త్రిపురాసుర సంహారం చేశాడు. 🙏లలితాదేవి భండాసురుడు తో యుద్ధం చేస్తూ వుండగా విశుక్రుడు చేసినటువంటి 'విఘ్నశిలా యంత్రం' వల్ల మొత్తం శక్తి సేనలు అన్నీ నిర్వీర్యము అయిపోయాయి.పరిష్కారం ఏమిటో పెద్ద పెద్ద శక్తులకే తెలియలేదు.శ్యామలా, వారాహీ ఇత్యాది శక్తులకు కూడా పరిష్కార మార్గం తెలియలేదు.అసలు సమస్యే అర్థం కాలేదు.అప్పుడు అమ్మవారి తో మొర పెట్టుకున్నారు.అప్పుడు లలితాంబ శివుని చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. అదిచూసి శివుడూ మందహాసం చేశాడు బదులుగా‌.ఆయన మందహాసం చూడగానే అమ్మవారి యొక్క మందహాసంలో మరొక వెలుగు కూడా కలిసింది. అప్పుడు అమ్మ వారి చిరునవ్వు నుంచి పది చేతులతో వల్లభ అనబడే సిద్ధలక్ష్మి తో సహా మహాగణపతి ఆవిర్భవించాడు.ఆయన ఆ 'విఘ్నశిలా యంత్రాన్ని' ఛేదించాడు అంటూ బ్రహ్మాండ పురాణం చెపుతున్నది.లలితా సహస్రనామ స్తోత్రంలో 'కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా' 'మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా'అనేటటువంటి నామంలో మనకు కనబడుతున్నది.ఈవిధంగా అటు శివునికి ఇటు శక్తికి కూడా వారి పనుల్లో వచ్చే విఘ్నాలు తొలగించాడు. 🙏బ్రహ్మదేవునికి విఘ్నాలు తొలగించాడు. బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా చెప్పారు. "విపత్తి వాచకో విఘ్నః నాయకః ఖండనార్థకః! విపత్ ఖండనకారకం నమామి విఘ్ననాయకమ్" విపత్తులే విఘ్నములు,వాటిని ఖండించేటటువంటి నాయకుడే విఘ్ననాయకుడు అని అద్భుతమైన మాట శాస్త్రం చెపుతున్నది.అటువంటి విఘ్ననాయకుడు సృష్టికి పూర్వమే సృష్టిని చెయ్యటానికి భగవంతుడి నుండి శక్తి సంపాదించిన బ్రహ్మదేవునికి ఈ సృష్టి చేసేటటువంటి పనిలో అనేక విఘ్నాలు కలిగితే ఆయన ఓంకారాన్ని ధ్యానించాడు. బ్రహ్మ చేత ధ్యానింపబడుతున్న ఓంకారం గజాననంగా సాక్షాత్కరించి బ్రహ్మకు అన్ని విఘ్నములు తొలగించింది.(ఆ తిధే సంకష్టహర చతుర్థి,ఇది మాఘ బహుళ చవితి నాడు జరిగిన విశేషం) 🙏అలాగే నారాయణుడు దుష్ట దైత్యులను సంహరించటానికి వెళ్ళినప్పుడు అది నిర్విఘ్నంగా జరగటానికి గణపతి పూజ చేశాడని ఉపనిషత్తులు,ఆగమాలు మనకు చెపుతున్నాయి. -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@padma2207
@padma2207 4 жыл бұрын
గణపతి సహస్రనామ ఫలశృతి గురించి చాలా విస్తారమైన విషయం గణపతే స్వయంగా చెప్తాడు.ఇది ఎవరైతే నిత్యం చదువుతారో వాళ్ళకి అద్భుతమైన చాలా ఫలాలు లభిస్తాయని చెప్పారు. 🙏ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు బుద్ధి శక్తి, మంచి సంస్కారాలు కలుగుతాయి. 1)కరస్థం తస్య సకలం ఐహికాముష్మికం సుఖమ్ ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యం అతిరూపతా | సత్యం దయా క్షమా శాంతిః దాక్షిణ్యం ధర్మశీలతా. 🙏అంతేకాకుండా మరొక విశేషం ఇప్పుడు ఏదైతే ప్రపంచాన్ని అంతటిని భయకంపింతం చేస్తున్నదో ఆ రోగాన్ని పోగొట్టగలిగే శక్తి గణపతి సహస్రనామా పఠనంలో వుంది అనటానికి ప్రమాణం ఇక్కడ మనకు కనబడుతున్నది.ఎక్కడైతే గణపతి స్తోత్రం పఠింపబడుతుందో ఆ దేశంలో దుర్భిక్షములు,కరువు కాటకాలు,ఈతి బాధలు ఉండవు. 2)పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదమ్ దేశే తత్ర న దుర్భిక్షం ఈతయో దురితాని చ 🙏ఏ ఇంట్లో గణపతి సహస్రనామ స్తోత్రము చదువుతారో ఆ ఇంటిని మహాలక్ష్మి విడిచిపెట్టకుండా స్థిరంగా వుంటుంది. 3)న తద్ గృహం జహాతి శ్రీః‌ యత్రాయం పఠ్యతే స్తవః 🙏ఒక్కసారి గణపతి సహస్రనామం చదివినా,అనేక రకాల రోగాలు పోతాయి. 4)క్షయ కుష్ఠ ప్రమేహార్శ భగందర విషూచికాః గుల్మం ప్లీహానమశ్మానం అతిసార మహోదరమ్. కాసం శ్వాస ముదావర్తం శూల శోఫాది సంభవమ్. శిరోరోగం వమిం హిక్కాం గండమాలాం అరోచకమ్. వాత పిత్త కఫ ద్వంద్వ త్రిదోషజనిత జ్వరమ్ ఆగంతువిషమం శీతం ఉష్ణం చ ఏకాహికాదికమ్. ఇత్యాద్యుక్తం అనుక్తం వా రోగం దోషాది సంభవమ్ - సర్వం ప్రశమయతి. 🙏ఇందులో వున్న చిట్టాలో ప్రస్తుతం వున్న వ్యాధి విషూచికా,శ్వాస,విషమరోగం అనే పేర్లకు చెందినది.ఈ చిట్టాలోచెప్పని ఎన్నో రోగములు ఒక్కసారి మహాగణపతి సహస్రనామ స్తోత్రము చదివితే తొలగిపోతాయి అని చెప్పారు. గణపతికి వున్న క్షిప్రగణపతి,ఉచ్చిష్ట గణపతి మొదలైన నామములు,వాటికి సంబంధించిన మంత్ర సంకేతాలు కూడా ఈ స్తోత్రంలో వున్నాయి.అంటే ఇది కేవలం బయటికి వినబడే నామాల వరుస మాత్రమేకాదు. శక్తి మంతమయిన మంత్రాల మాల ఇది,అన్ని మంత్రశక్తి విశేషాలు ఇందులో ఉన్నాయి.అటువంటి భక్తి భావంతో దీనిని శ్రవణం చేస్తూ ఉచ్చరించాలి. 🙏ఈ ఉచ్చారణ వల్ల వచ్చేటటువంటి ప్రకంపనలు మన శరీరంలో ప్రతి అణువును స్పదింపచేసి గణపతి శక్తిని మనలో జాగృతం చేయటమే కాకుండా మొత్తం విశ్వమంతా కూడా ఒక దివ్యశక్తి వ్యాపించి అతి త్వరలోనే అంటే క్షిప్రమే ఈ రుగ్మత,రుగ్మత లక్షణాలు తొలగిపోయి ప్రపంచం అంతా అభ్యుదయాన్ని సాధిస్తుంది అని శాస్త్ర వాక్యం🙏 5)సర్వం ప్రశమయతి ఆశు స్తోత్రస్యాస్య సకృజ్జపః సకృత్ పాఠేన (ఆశు అంటే వెంటనే శీఘ్రముగా అని అర్థం.సకృత్ అంటే ఒక్కమారు జపించినా పఠించినా) దీనికి వర్ణాది వివక్షలు లేవు.ఎవరైనా పఠించవచ్చు.ప్రతి ఒక్కరూ భక్తి తో పఠిస్తే చాలు. 6)సహస్రనామమంత్రోయం జపితవ్యః శుభాప్తయే మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ 🙏కోరికతో జపించేవారికి అన్ని కోరికలు తీరుతాయి.నిష్కామంగా జపించే వారికి బ్రహ్మ జ్ఞానం, మోక్షం లభిస్తుంది. 7)నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః యోగసిద్ధిం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్య సంస్థితః నిరంతరే నిరాబాధే పరమానందసంజ్ఞితే ‖ 🙏ఇంకొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే ఈ గణపతి సహస్రం చదివిన వారిని పార్వతీ పరమేశ్వరులు పుత్రుడిలా అనుగ్రహిస్తారు. పుత్రవాత్సల్యంతో చూస్తారుట ఇది చదివే వాడిని.ఇది అద్భుతమైన విశేష ఫలం.శివశక్తుల భక్తులు గణపతి స్తోత్రం గట్టిగా పట్టుకోవాలని దీనిని బట్టి తెలుస్తున్నది. 8)శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః శివభక్తః పూర్ణకామో గణేశ్వర వరాత్పునః 🙏ఇంత మహిమాన్వితమైనటువంటి మహాగణపతి స్తోత్రాన్ని భక్తిగా ఆయనకు నమస్కారం చేసుకుంటూ దీనికి ఆయనే ఋషి ఆయనే గురువు. -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@dhanalakshmi-gv2wf
@dhanalakshmi-gv2wf 3 жыл бұрын
Adavallu chadvavachha
@arunkagithala4706
@arunkagithala4706 Жыл бұрын
ఆహా అమ్మ మీరు చాలా వివరంగా చెప్తున్నారు. మీకు సెతకోటి వందనాలు.
@padma2207
@padma2207 4 жыл бұрын
బీజాపూర గదేక్షు కార్ముక రుజా చక్రాబ్జ పాశోత్పల| వ్రీహ్య గ్రస్వ విషాణ రత్నకలశ ప్రోద్యత్ కరామ్భోరుహః|| ధ్యేయో వల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్జ్వలద్భూషయా| విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః||
@padma2207
@padma2207 4 жыл бұрын
🌺ప్రాణాయామం శ్రీ మహా గణపతయే నమః అనే మంత్రంతో ముమ్మార్లు ప్రాణాయామం చేయాలి.
@RameshBabu-rq1xs
@RameshBabu-rq1xs 4 жыл бұрын
om gum ganapatiye namahaa
@yedidasrinivasu4264
@yedidasrinivasu4264 3 жыл бұрын
om sri mahaganadhipatheye namaham namasivaya parvathi pathaye namaham govinda govinda 🙇‍♂️🙇‍♀️🙇‍♂️🙇‍♀️👨‍👩‍👧‍👦
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇక్కడ విశేషం ఏమిటంటే 'పవన నందనః' అంటే హనుమంతుడు అని అర్థం.గణపతికి, హనుమంతుడికి వున్నటువంటి మంత్రశాస్త్ర సమన్వయం ఇందులో మనకు గోచరిస్తుంది.ఈ రహస్యం ఉపాసకులకు తెలుస్తుంది.త్యాగరాజ స్వామి వారు గణపతి కీర్తన రచిస్తూ శ్రీ గణనాథం భజామ్యహం అనే కీర్తన లో "ఆంజనేయావతారం గుణాకరం కుంజరముఖం త్యాగరాజ వందితం"అని అంటారు.ఆయన ఎందుకు ఆంజనేయావతారం అని గణపతిని అన్నారో ఉపాసకులకు తెలుస్తుంది.హనుమంతుడు రామ కార్యంలో విఘ్నాలు తొలగించి సిద్ధిని ఇచ్చాడు.కార్యసిద్ధికారకుడు, గణపతి స్వభావం అదే.ఆగమాల ప్రకారం గణపతి, హనుమంతుని తత్త్వం ఒకటే.ఇది తెలుసుకోవాలి.'కలౌ కపి వినాయకౌ' అని పెద్దలు చెప్తారు.కలియుగంలో హనుమంతుడు,గణపతి.వారు ఉభయులూ తొందరగా అనుగ్రహించి అభీష్టాన్ని సిద్ధింపచేస్తారు కనుక ఆ రహస్యాన్ని సహస్రనామంలో చూపించారు.ఇక్కడ గణపతి హనుమంతుడు గా కనబడుతున్నాడు. హనుమత్స్వరూపుడైన ఆ గణపతికి కూడా నమస్కారము. చేసుకుందాము.
@blogworldexpo6099
@blogworldexpo6099 3 жыл бұрын
Evaryna chadavacha .... Guru mukatha ne chadavala....theliyajeyandi
@ak7096
@ak7096 2 жыл бұрын
Om narasimha 🙏🙏🙏🙏🙏🙏🙏
@ravik-hc9hp
@ravik-hc9hp 2 жыл бұрын
@@blogworldexpo6099 ఎవరైనా చదవవచ్చు,ఒకసారి గురువు దగ్గరనేర్చుకుని తరువాత తప్పులు లేకుండా చేసుకోవచ్చు..లేదా కుదరకపోతే శ్రీ గణేశాయ నమః అని చేసుకోవచ్చు, నామాని కి మహిమ ఎక్కువ
@krishnavyakaranam9345
@krishnavyakaranam9345 18 күн бұрын
ఆద్యంత ప్రభు ఉపాసనా పద్ధతి అని తమిళనాడులో ఒకటి ఉంది. ఒకే విగ్రహంలో హనుమంతుల వారు, వినాయకుల వారు కలిసి ఉంటారు
@padma2207
@padma2207 4 жыл бұрын
ఋణత్రయ విమోచకః ఋణహర గణపతి అని మంత్రశాస్త్రము ఒకటి చెప్పబడుతున్నది.ఋణ బాధలు అన్నీ పోగొట్టేవాడు.ఇది అప్పులు పడ్డవారే కాకుండా అప్పులు ఇచ్చినవారికి కూడా కొన్ని బాధలు వుంటాయి.అయ్యో తీర్చట్లేదు అని,ఆ బాధలు కూడా పోగొడతాడు.అటు,ఇటు వున్న ఋణబాధలు పోగొట్టేవాడు 'ఋణహర గణపతి' ఆయనను ఈ నామాలలో స్మరించుకూన్నాము.
@padma2207
@padma2207 4 жыл бұрын
కాశీ క్షేత్రంలో వున్నటువంటి మహా గణపతి స్వరూపం ఢుంఢి వినాయకుడు.అంటే శివ విజయాన్ని చాటించినటువంటి తన తొండమెత్తి ఓంకారం,ఘీంకారం చేసేటటువంటి స్వామి ఢుంఢి వినాయకుడు. శబ్ద స్వరూపుడు.ఆయన్ని స్మరించుకున్నాము.కొన్ని కొన్ని నామాలు చాలా పటిష్టంగా వుంటాయి.ఎందుకంటే గణపతి అంటేనే పటిష్టం.ఆ పటిష్టమైన నామాలు ఉచ్చరించినప్పుడు ఏర్పడే ప్రకంపనలు కూడా పటిష్టమైన దేవతా శక్తిని ఆవిష్కరింపచేస్తాయి.అందుకే ఈ శబ్దములు చాలా దివ్యమైన ప్రకంపనలతో వుంటాయి. ఠద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రైక సిద్ధిదః" ‖87 ‖ డిండిముండో డాకినీశో-డామరో- డిండిమ ప్రియః | ఠద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రైక సిద్ధిదః" ‖87 ‖ డిండిముండో డాకినీశో-డామరో- డిండిమ ప్రియః | ఢక్కా నినాద ముదితో- ఢౌకో- ఢుంఢి వినాయకః ‖ 89 ‖
@padma2207
@padma2207 4 жыл бұрын
Meanings: ఋణత్రయ విమోచకః ఋణహర గణపతి అని మంత్రశాస్త్రము ఒకటి చెప్పబడుతున్నది.ఋణ బాధలు అన్నీ పోగొట్టేవాడు.ఇది అప్పులు పడ్డవారే కాకుండా అప్పులు ఇచ్చినవారికి కూడా కొన్ని బాధలు వుంటాయి.అయ్యో తీర్చట్లేదు అని,ఆ బాధలు కూడా పోగొడతాడు.అటు,ఇటు వున్న ఋణబాధలు పోగొట్టేవాడు 'ఋణహర గణపతి' ఆయనను ఈ నామాలలో స్మరించుకూన్నాము. లూతావిస్ఫోట నాశనః ప్రస్తుతం వున్న కరోనా అనే రుగ్మత కు సంబంధించి,దాన్ని పరిహరించే నామము.అంటే శ్వాసకు సంబంధించి ఎలర్జీ, ఇన్ఫెక్షన్లు లాంటి రోగములను పోగొట్టేవాడు అని ఈ నామంలో మరొక అర్థం వున్నది.
@padma2207
@padma2207 4 жыл бұрын
కల్పవృక్షం స్వర్గలోకానికి వెడితే దొరుకుతుందట.కానీ భూమియందు స్మరిస్తే చాలు కల్పవృక్షంలా అనుగ్రహిస్తాడు కనుక 'క్షోణీ సుర ద్రుమః'
@padma2207
@padma2207 4 жыл бұрын
ఈ మహా గణపతి సహస్రనామ ఉచ్చారణ వల్ల వచ్చేటటువంటి ప్రకంపనలు మన శరీరంలో ప్రతి అణువును స్పదింపచేసి గణపతి శక్తిని మనలో జాగృతం చేయటమే కాకుండా మొత్తం విశ్వమంతా కూడా ఒక దివ్యశక్తి వ్యాపించి అతి త్వరలోనే అంటే క్షిప్రమే ఈ రుగ్మత,రుగ్మత లక్షణాలు తొలగిపోయి ప్రపంచం అంతా అభ్యుదయాన్ని సాధిస్తుంది అని శాస్త్ర వాక్యం.
@padma2207
@padma2207 4 жыл бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ మహాగణపతయే నమః అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సభాహ్యా అభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష కుడిచేతిని కుడిచెవిపై పెట్టుకుని ఇది గంగా స్థానం కనుక ఒక్క సారి ఈ మూడు నామాలు అనుకోవాలి. 🌺ప్రాణాయామం శ్రీ మహా గణపతయే నమః అనే మంత్రంతో ముమ్మార్లు ప్రాణాయామం చేయాలి. 🌺సంకల్పం
@padma2207
@padma2207 4 жыл бұрын
శంభుశక్తి గణేశ్వరః ఇక్కడ విశేషం శివ పార్వతుల తనయుడు అని చెప్పటంలో శివ శక్తుల ఏక స్వరూపుడని అద్భుతమైన అంశం.ఆ శంభు శక్తి గణములకి ఈశ్వరుడు.
@padma2207
@padma2207 4 жыл бұрын
తరువాత నుంచి వరుసగా అక్షరాలతో కూర్చిన నామాలు రాబోతున్నాయి.దానికి నాందిగా ఉచ్చిష్ట గణ అన్నారు.అంటే గణపతి సహస్రనామ స్తోత్రము, ఒక స్తోత్రం మాత్రమే కాదు ఒక శాస్త్రం.దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఎంతో అద్భుతమైన సనాతనధర్మ విజ్ఞానం లభిస్తుంది.
@govindrao6862
@govindrao6862 3 жыл бұрын
Thank you Gurubhoyo namaha🙏🙏 Loka samastha Sukinobhavanthu🙏🙏💐🙏
@adhinaidu6965
@adhinaidu6965 4 жыл бұрын
🌸🌹🙏🙏🌹🌸
@chaitanyamandaleeka4489
@chaitanyamandaleeka4489 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🌸🌺🌼Sri Ganeshaya namah
@padma2207
@padma2207 4 жыл бұрын
శ్రీ తత్వనిధి,ముద్గల పురాణం మహాగణపతి ఆరాధన లేనిదే ఏ దేవతా అనుగ్రహించదు.అంతేకాదు మహాగణపతిని ఆరాధిస్తే సర్వ దేవతలను ఆరాధించినట్లే. జ్ఞానము,బలము, ఐశ్వర్యము ఈ మూడింటికి అధి దేవత మహా గణపతి. ఈయన ప్రథమ దేవుడు మరియు ప్రధాన దేవుడు కూడా.ఆగమాలు వర్ణించిన గణపతి రూపాలు, మంత్రాలు మనకు తెలియకపోయినా ఆ దేవతల అద్భుతమైన నామాలు అనుకున్నా ధన్యులము అయిపోతాము. ఈ మహా గణపతికే లోకవ్యవహారంలో లక్ష్మీ గణపతి అని పేరు వుంది.అదేవిధంగా ఉపనిషత్ భాషలో ఈయన్నే వల్లభ గణపతి అని అంటారు.ఈ మహాగణపతి స్వరూపమే ఈ పదహరు గణపతులు 1.శ్రీ బాల గణపతయే నమః 2.శ్రీ తరుణ గణపతయే నమః 3.శ్రీ భక్త గణపతయే నమః 4.శ్రీ వీర గణపతయే నమః 5.శ్రీ శక్తి గణపతయే నమః 6 శ్రీ ద్విజ గణపతయే నమః 7.శ్రీ సిద్ధి గణపతయే నమః 8.శ్రీ ఉచ్చిష్ట గణపతయే నమః 9.శ్రీ విఘ్న గణపతయే నమః 10.శ్రీ క్షిప్ర గణపతయే నమః 11.శ్రీ హేరంబ గణపతయే నమః 12.శ్రీ లక్ష్మీ గణపతయే నమః 13.శ్రీ విజయ గణపతయే నమః 14.శ్రీ నృత్య గణపతయే నమః 15.శ్రీ త్రయక్షర గణపతయే నమః 16.శ్రీ మహా గణపతయే నమః *శ్రీ వల్లభా దేవీ సమేత శ్రీ మహా గణపతయే నమః* 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే శ్రీ మహాగణపతే పాహి పాహి మామ్ శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే శ్రీ మహాగణపతే రక్ష రక్ష మామ్ జయ్ గణేశా జయ్ జయ్ గణేశా -బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇంత విరాట్ పురుషుడు కూడా భక్తులు భక్తి గా ధ్యానిస్తే వాళ్ళ హృదయపద్మంలో వుంటాడు అని తర్వాతి నామములు చెపుతున్నాయి.
@padma2207
@padma2207 4 жыл бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ మహాగణపతయే నమః
@padma2207
@padma2207 4 жыл бұрын
ఫాణిత ప్రియః, ఉండేరక బలిప్రియః ఫాణిత=పటికబెల్లం. పటికబెల్లం నివేదన చేస్తే గణపతి చాలా ప్రీతిచెందుతాడు.ఉండేరక బలి ప్రియః=ఉండ్రాళ్ళు.అలాగే మోదకాలు,లడ్డుకాలు అంటే ఇష్టం ఆయనకు.ఇవికూడా ఈ నామాలలో చెప్పబడుతున్నాయి.అంటే ఉపాసింపబడే దేవతకు ఉపాస్యవిధానం,ఆయనకు ప్రీతిపాత్రమైన పదార్థాలు కూడా చెప్పబడుతున్న ఈ స్తోత్రరూప శాస్త్రానికి నమస్కారము.
@ratnakaul2095
@ratnakaul2095 3 жыл бұрын
Om Gana Ganapatye Namah!!! Vakra Tunda Maha kaya, Surya Koti Samaprabh, Nirvignam Kuru mey Dev, Sarva Karyeshu Sarvada.!!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉🕉🕉🚩🚩🚩 Om Pranam.Naman,Vandan.🙏🏻🙏🏻🕉
@padma2207
@padma2207 4 жыл бұрын
శ్రీ ఉచ్చిష్ట గణేశాయ నమః ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థము.ఇక్కడ ఎంగిలి అంటే అర్థం ఏమిటంటే మన నోటినుంచి బయటకు వచ్చేది ఎంగిలి.అంటే మన నోటినుంచి పలికేది అక్షరాలు.ఈ అక్షరములే ఉచ్చిష్టములు.ఈ అక్షరములు అన్నీ కలిపితే గణములు అవుతాయి.అక్షర గణపతి అయిన విద్యా స్వరూపుడు కనుక 'ఉచ్చిష్ట గణేశః' అంటే అక్షర గణపతి అని అర్థం.తరువాతి నామాలలో "జీహ్వా సింహాసన ప్రభుః" అని వస్తుంది.అంటే నాలికనే సింహాసనం గా కలిగినవాడు.అంటే నోరు అనే కలుగులో నాలుక అనే ఎలకమీద అక్షర గణపతి సంచరిస్తుంటాడు అనే దర్శనం మనకు కనబడుతుంది ఇందులో.అందుకే ఈ నామం పలికేవారికి విద్య లభిస్తుంది.ఉచ్చిష్ట గణపతి ఒక చేతిలో వీణ పట్టుకుని వుంటాడు.ఇంకోచేత్తో పుస్తకం పట్టుకుని వుంటాడు.అలాంటి ఉచ్చిష్ట గణపతి అనుగ్రహం విద్య లభింపచేస్తుంది కనుక విద్యార్థులు అందరికీ కూడా శ్రీ ఉచ్చిష్ట గణేశాయ నమః అనే మంత్రం చాలా అవసరం.అదేవిధంగా ఇంతకు మునుపు నామాలలో 'శ్రీ క్షిప్ర ప్రసాదనాయ నమః' అనే నామం వున్నది, అదిగాని పఠిస్తే తొందరగా గణపతి అనుగ్రహం లభిస్తుంది.ఈ పారాయణం లో ఒకేసారి భావన చేసుకుందాము.
@lakkojuramakrishna7999
@lakkojuramakrishna7999 3 жыл бұрын
Om Maha ganapataye namaha om
@padma2207
@padma2207 4 жыл бұрын
కుడిచేతిని కుడిచెవిపై పెట్టుకుని ఇది గంగా స్థానం కనుక ఒక్క సారి ఈ మూడు నామాలు అనుకోవాలి.1.శ్రీ అచ్యుతాయ నమః 2.శ్రీ అనంతాయ నమః 3.శ్రీ గోవిందాయ నమః
@balarammurthy413
@balarammurthy413 3 жыл бұрын
and Shanta... ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే గణేశాయ
@padma2207
@padma2207 2 жыл бұрын
నమః పార్వతీ సుతాయ మహాగణపతయే జయ్ గణేశ జయ్ జయ్ గణేశ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@laxminarasimhaduggaraju2671
@laxminarasimhaduggaraju2671 3 жыл бұрын
Sri ganeshaya namaha...
@user-dx4is3mr5f
@user-dx4is3mr5f 4 жыл бұрын
Super andi
@padma2207
@padma2207 4 жыл бұрын
సర్వ భేషజ భేషజమ్ సంసారవైద్యః సర్వజ్ఞః సర్వ భేషజ భేషజమ్ ఔషధాలకే ఔషధం అని దీని అర్థం.అందుకే ఔషధమే లేదు అనిపించే రోగాన్ని పోగొట్టగలిగే ఔషధమే గణపతి యొక్క నామస్మరణ.అందుకే గణపతి అనుగ్రహం వల్ల అతి త్వరగా ఔషధం లభించి అతి శీఘ్రంగా రోగములు నశించుగాక "సర్వ భేషజ భేషజమ్"
@MVKrishnaRao56
@MVKrishnaRao56 3 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం
@pediredlasatyanarayana6036
@pediredlasatyanarayana6036 4 жыл бұрын
Excellent sir please continue like that programs
@ratnacharyamallavemula2158
@ratnacharyamallavemula2158 4 жыл бұрын
అధ్బుతః
@rameshkolluri7232
@rameshkolluri7232 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padma2207
@padma2207 4 жыл бұрын
🙏 ఇక్కడ మహా గణపతి స్వరూపం పది చేతులతో ఉన్నటువంటిది.గజవదనంతో భాసిస్తున్నది.అదేవిధంగా ఆయన అంకంలో సిద్ధి లక్ష్మీ దేవి కొలువుతీరి వున్నది ‌.ఈపది చేతుల్లోకూడా ఆయన శంఖము,చక్రము-త్రిశూలము, పాశము-చెరకు విల్లు,నల్ల కలువ-గద,వరి కంకులు-ఇటు చివరిగా వున్న రెండు చేతుల్లో ఏకదంతము,బీజాపూరము పట్టుకొని వుంటాడు.ఇవి మొత్తం పది చేతులు ఐదు జంటలకు సంకేతం.లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు,రతీ కందర్పులు,భూమి,వారాహీ స్వామి- పుష్టి, పుష్టిపతి అనబడే ఐదు మిథున దేవతలు.ఈ ఐదు మిథున దేవతలు పంచభూత తత్త్వములకు ప్రతీకలు. ఈ పంచభూత తత్త్వములతో వున్న ఇందరి దేవతల సమూహము తో వున్నటువంటి వాడు మహాగణపతి అనే భావం తో ఇక్కడ మనం దర్శిస్తున్నాము.ఆ స్వరూపాన్ని ఇక్కడ ఇంతవరకు 🙏రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః (ఉమా మహేశ్వరః) మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః అనే మాటల్లో చెప్పబడుతున్నాయి.
@chikram.ashok.9568
@chikram.ashok.9568 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🪔ఓం శ్రీ మహాగణపతయే నమః🪔🙏 🌹🌹🍎🍎🌻🌻🌷🌷🌼🌼🥀🥀
@padma2207
@padma2207 4 жыл бұрын
స్వతంత్రః సత్యసంకల్పఃసామగానరతః సుఖీ గణపతి యొక్క స్వానందలోకంలో సామవేద పురుషుడు అక్కడ వుంటూ నిరంతరం సామగానం చేస్తూవుంటాడుట స్వామి వారికి ప్రీతిగా.అది వింటూ ఆనందిస్తూ వుంటాడు స్వామి.ఆ భావమే ఇక్కడ సామగానరతః సుఖీ,
@vanajabommakanti451
@vanajabommakanti451 4 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏
@funmath3835
@funmath3835 Жыл бұрын
bhakthi tv great.
@padma2207
@padma2207 4 жыл бұрын
20వ శ్లోకము నుండి 26వ శ్లోకము వరకు గణపతి యొక్క విరాడ్ పురుష వర్ణన వర్ణింపబడుతోంది.దాన్ని మనసు లో ధ్యానిస్తూ ఈ నామాలు ఉచ్చరించాలి.ఇది గణేశ తాపినీ ఉపనిషత్తులో చెప్పబడిన శబ్దములతోనే కూర్చబడినది.అంటే గణపతి సహస్రం ఉపనిషత్తుల్లో మంత్రశాస్త్రాలలో ఉన్న రహస్యాలతో వున్నది అని చెప్పటానాకి ఇదో ఉదాహరణ 🙏 యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః | సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్ శృతిః ‖ 20 ‖ బ్రహ్మాండకుంభః చిత్ వ్యోమఫాలః సత్యశిరోరుహః | జగజ్జన్మలయోన్మేషనిమేషోఅగ్న్యర్కసోమదృక్ ‖ 21 ‖ గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః | గ్రహర్క్షదశనో వాణీజిహ్వో - వాసవ నాసికః ‖ 22 ‖ కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః ‖ 23 ‖ నదీనదభుజః సర్పాంగులీకః తారకా నఖః | భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోత్కటః | వ్యోమనాభిః శ్రీహృదయో - మేరుపృష్ఠోఽర్ణవోదరః ‖ 24 ‖ కుక్షిస్థ యక్ష గంధర్వ రక్షః కిన్నర మానుషః | పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరుర్ దస్రజానుకః ‖ 25 ‖ పాతాలజంఘో మునిపాత్ - కాలాంగుష్ఠ స్త్రయీతనుః | జ్యోతిర్మండల లాంగూలో హృదయాలాన నిశ్చలః ‖ 26 ‖
@padma2207
@padma2207 4 жыл бұрын
మహాగణపతి చింతామణి ద్వీపంలో కల్పవృక్ష వనంలో రత్న సింహాసనంపై ఎలా కూర్చుని వుంటాడు అని వర్ణిస్తూ ఆ సింహాసనం పీఠం నుంచి ఏ ఏ శక్తులు వుంటాయో చెపుతున్నారు.ఆ శక్తులు మనం స్మరిస్తే చాలు మనల్ని రక్షిస్తాయి.అలాంటి శక్తుల పీఠంపై మహాగణపతి కూర్చుని వున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఆయన పాదముల గోళ్ళ మొదలుకుని ఆయన శిరస్సు వరకు అద్భుత స్వరూప వర్ణన ఈ నామాలలో కనపడుతున్నది.అది మనసులో భావిస్తూ ఆ చింతామణి ద్వీపంలోకి మనం ప్రవేశిద్దాము.
@padma2207
@padma2207 4 жыл бұрын
ఉభయసంధ్యలలో దీపం ఇంట్లో వెలిగితే దీపేన సాధ్యతే సర్వం ఏదైనా సిద్ధిస్తుంది.దేవతలు కాంతి శరీరులు కనుక దీపం వెలిగే చోట సర్వ దేవతలు ఉంటారు.సర్వదేవ గణములతో గణపతి ఆ దీప జ్యోతిలో ఉన్నాడు అని భావన చెయ్యాలి.ఇది నిత్యాభ్యాసంగా గృహక్షేమం కోసం అలవాటు చేసుకోవాలి..సనాతన ధర్మం అంటేనే రెండుపూట్ల దీపం వెలిగే ఇల్లు.అందరి హృదయాల్లో వున్న మహా గణపతి కి నమస్కారం చేసుకుని గణపతి సహస్రనామ పారాయణం ప్రారంభం చేసుకోవాలి.
@v.lakshmisundar4570
@v.lakshmisundar4570 3 жыл бұрын
🙏🙏🙏
@ramalakshmi4688
@ramalakshmi4688 11 ай бұрын
Very God bless sir thank you very
@cherithmadderla270
@cherithmadderla270 4 жыл бұрын
Thank you sir 🙏
@murthyvadlamani4856
@murthyvadlamani4856 3 жыл бұрын
Qqqq
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇంత విరాట్ పురుషుడు కూడా భక్తులు భక్తి గా ధ్యానిస్తే వాళ్ళ హృదయపద్మంలో వుంటాడు అని తర్వాతి నామములు చెపుతున్నాయి. "హృత్పద్మకర్ణికాశాలీ వియత్కేలిసరోవరః" | సద్భక్తధ్యాన నిగడః -పూజావారి నివారితః ‖ 27 ‖ ప్రతాపీ- కశ్యప సుతో - గణపో విష్టపీ బలీ | యశస్వీ ధార్మికః స్వోజాః ప్రథమః ప్రథమేశ్వరః ‖ 28 ‖
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇవి గణపతి అనుగ్రహం చెప్పే నామాలు. కాలంలో చిన్నకాలం మొదలుకుని కల్పకాలం వరకు సూక్ష్మ భాగములన్నీ చెప్పబడుతూ, కాలస్వరూపుడు గణపతి అని చెపుతున్నారు. అటుతరువాత గ్రహాల పేర్లు అన్నీ వస్తాయి.ఈ గ్రహగణములకు పతి అని చెపుతున్నారు. పంచభుతముల పేర్లు చెప్పబడుతున్నాయి. అలాగే దేవతలు పితృదేవతలు సిద్ధులు వీళ్ళందరి పేర్లు వున్నాయి.ఇవి అద్భుతమైన నామాలు.అందుకే కాలము, గ్రహములు ఈ గణములు అన్నిటికీ పతి అని అన్నప్పుడు గణపతిని ప్రార్ధించేవారికి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి.కాలాలన్నీ అనుకూలాలే అవుతాయి అని తెలుసుకోవాలి. ఆయన శాసనాన్ని అనుసరించి గ్రహాలు నడుస్తాయి.అందుకే కాలసర్పకూటమి వుందనో లేదా గ్రహములు బాధించేటటువంటి కాలము వుందనో మనము భయపడనవసరం లేదు.గణపతిని పట్టుకుంటే గ్రహిలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కనుక ఏ గ్రహమైనా మనకు అనుకూలం అవుతుంది.కాలసర్పకూటాలను అయినా ఆయన తన పొట్టకు చుట్టుకుని మనల్ని అనుగ్రహించగలడు అని అంటూ ఆ దివ్యమైన కాలనామాలు,గ్రహనామాలు,దేవనామాలు అనుసంధానం చేసుకునే నామాలు ఇక్కడినుండి వస్తున్నాయి. లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరక్షణః ‖ 118 ‖
@bsr5480
@bsr5480 2 жыл бұрын
Emandi madam garu kudurtay artham chepandi madam🙏
@vishnumohan999
@vishnumohan999 8 ай бұрын
సామవేదం గారి1000నామాలు బాష్యం పుస్తకం ఎక్కడైనా దొరికెతే వివరాలు తెలుపగలరు
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Please
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే శ్రీ మహా గణపతి ప్రోక్తం శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం సంపూర్ణం శ్రీ గణేశ జయ్ గణేశ- జయ గణేశ పాహిమాం శ్రీ గణేశ జయ్ గణేశ -జయ్ గణేశ రక్షమాం
@padma2207
@padma2207 4 жыл бұрын
గకార ప్రియుడు గణపతి.ఇవి గకారనామాలు.గణపతి తత్త్వము గొప్పది ఎందుకంటే గురు స్వరూపము కనుక. "కోరిన విద్యలకెల్ల ఒజ్జయై అన్నారు కదా గురువు ఆయన.అందుకే "బృహస్పతి, బ్రహ్మణస్పతి,గణపతి" ఈ మూడూ ఒకే దేవతా స్వరూపములు వేదం ప్రకారంగా.అంటే గణపతికి నమస్కారించిన వారికి ఒక గురువు వలే బుద్ధిని తీర్చిదిద్దుతాడు.అటువంటి గురుస్వరూపుడైన గణపతికి నమస్కారము.
@lakshmisudha9432
@lakshmisudha9432 2 жыл бұрын
Thks a lot guruvu gaaru....
@tarunavasa1140
@tarunavasa1140 2 жыл бұрын
🙏🏻🙏🏻
@padma2207
@padma2207 4 жыл бұрын
*Ganesha Sahasranama* *Bhashyam* Brahmasri Samavedam Shanmukha Sarma Guruvugaru🙏 kzbin.info/www/bejne/bZycq3tqgcejedE
@padma2207
@padma2207 2 жыл бұрын
సత్ చిత్ సుఖ స్వరూపాయ శివ శక్తి మయాయచ వల్లభా ప్రాణ కాంతాయా శ్రీ గణేశాయ మంగళం నమః పార్వతీ సుతాయ మహాగణపతయే జయ్ గణేశ జయ్ జయ్ గణేశ ఓం భద్రం కర్ణేభిః
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Please Ganapati sahasranamastotram lyrics pettandi
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Memu nithyam parayanam chesukuntam
@padma2207
@padma2207 4 жыл бұрын
లూతావిస్ఫోట నాశనః ప్రస్తుతం వున్న కరోనా అనే రుగ్మత కు సంబంధించి,దాన్ని పరిహరించే నామము.అంటే శ్వాసకు సంబంధించి ఎలర్జీ, ఇన్ఫెక్షన్లు లాంటి రోగములను పోగొట్టేవాడు అని ఈ నామంలో మరొక అర్థం వున్నది.
@arunkagithala4706
@arunkagithala4706 Жыл бұрын
అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ గణపతి సహస్రణామం రోజు చేసుకోడానికి పిడిఎఫ్ ఉంటే పెట్టండి అమ్మ. Plz.
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Maaku Ganapati Sahasranamam mottam lyrics pettandi memu rasukuntam
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Please daya chesi Ganapati sahasram mottam words pettandi
@rajeswarinandam7357
@rajeswarinandam7357 Жыл бұрын
Please listen today
@sivadevichakrapani876
@sivadevichakrapani876 4 жыл бұрын
Ganesh Sahasranamam lo 125 slokam nunchi ending varaku confusion ga vundandi lyrics dayachesi pettandi.
@padma2207
@padma2207 4 жыл бұрын
m.facebook.com/groups/436422516371067?view=permalink&id=3268281196518504&ref=m_notif&notif_t=feedback_reaction_generic
@subhasiniats6480
@subhasiniats6480 2 жыл бұрын
0
@sammaiahvajja6480
@sammaiahvajja6480 2 жыл бұрын
don't give ads plz........
@nageswararao6586
@nageswararao6586 2 жыл бұрын
please remove adds
@cherithmadderla270
@cherithmadderla270 4 жыл бұрын
Thank you sir 🙏
@padma2207
@padma2207 4 жыл бұрын
ఇవి గణపతి అనుగ్రహం చెప్పే నామాలు. కాలంలో చిన్నకాలం మొదలుకుని కల్పకాలం వరకు సూక్ష్మ భాగములన్నీ చెప్పబడుతూ, కాలస్వరూపుడు గణపతి అని చెపుతున్నారు. అటుతరువాత గ్రహాల పేర్లు అన్నీ వస్తాయి.ఈ గ్రహగణములకు పతి అని చెపుతున్నారు. పంచభుతముల పేర్లు చెప్పబడుతున్నాయి. అలాగే దేవతలు పితృదేవతలు సిద్ధులు వీళ్ళందరి పేర్లు వున్నాయి.ఇవి అద్భుతమైన నామాలు.అందుకే కాలము, గ్రహములు ఈ గణములు అన్నిటికీ పతి అని అన్నప్పుడు గణపతిని ప్రార్ధించేవారికి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి.కాలాలన్నీ అనుకూలాలే అవుతాయి అని తెలుసుకోవాలి.
@lalitha7411
@lalitha7411 2 жыл бұрын
🙏🙏🙏
Sri Ganesha Sahasranama Stotram
27:51
Bhakthi TV
Рет қаралды 4,3 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 43 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 17 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 47 МЛН
Sri Ganesha Sahasranama Stotram | Telugu Lyrics | By Brahmasri Vaddiparti Padmakar Garu
45:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 277 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН