Рет қаралды 141,965
శ్రీ ప్రణవపీఠాధిపతి, అభినవశుక, త్రిభాషామహాసహస్రావధాని
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు
కౌసల్యామాత చేసిన
శ్రీరామరక్షాస్తోత్రం శ్లోక పారాయణం
శ్రీమద్రామాయణం
ఫలశ్రుతి: శ్రీమద్రామాయణం సకలశుభాలకీ నిలయం. వాల్మీకి మహర్షి అపూర్వ తపశ్శక్తితో లోకశ్రేయస్సు కోసం శ్రీమద్రామాయణాన్ని రచించాడు. వనవాసానికి వెళుతున్న శ్రీరాముడికి కౌసల్యామాత రక్ష కలగాలని దీవిస్తూ చేసిన శ్లోకాలు. ఇది అత్యద్భుత రామరక్షాస్తోత్రం, కౌసల్య రాముడి కోసం చేసిన స్తోత్రం.
అనేకమైన విఘ్నములు కలిగించే భూతాలు, మనుషులు, రాక్షసులు పెట్టే కష్టాల నుండి మనలను బయటపడవేసే అపూర్వ స్తోత్రం. నిత్యం విజయం లభించాలంటే ఈ స్తోత్రపారాయణం భక్తితో చేసుకున్నవాడికి ఎటువంటి కష్టములున్నా, దుఃఖములున్నా, శత్రుపీడ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. మన ప్రయాణాలప్పుడు తెలియకుండా వచ్చే కష్టాలు, మన పిల్లలకు తెలియకుండా వచ్చే ఇబ్బందులు, గండాలు, ఉద్యోగాలలో వచ్చే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
ముఖ్యంగా ఎనిమిదేళ్ళలోపు చిన్నపిల్లలకు ఇది వినిపిస్తే లేదా చదివించినా వాళ్ళకున్న గండాలన్నీ తొలగిపోతాయి, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ స్తోత్రప్రభావం వల్లే అరణ్యవాసం కూడా శుభం కలిగించిందని, రావణుడిని వధించగలిగి, తన భార్య తనకు దక్కిందని శ్రీరామచంద్రుడే చెప్పాడు. మానవులకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగడానికి ఈ స్తోత్రం చాలా అవసరం.
అయోధ్యకాండము - 25 వ సర్గము (2వ శ్లో నుండి 36 శ్లో)
నశక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమ |
శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే || 2.25.2
యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ|
స వై రాఘవశార్దూల! ధర్మస్త్వామభిరక్షతు || 2.25.3
యేభ్యః ప్రణమసే పుత్ర! చైత్యేష్వాయతనేషు చ |
తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః || 2.25.4
యాని దత్తాని తేఽస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా |
తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా || 2.25.5
పితృ శుశ్రూషయా పుత్ర! మాతృశుశ్రూషయా తథా |
సత్యేన చ మహాబాహో! చిరంజీవాఽభిరక్షితః || 2.25.6
సమిత్కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ |
స్థండిలాని చ చిత్రాణి శైలాః వృక్షాః క్షుపా హ్రదాః || 2.25.
పతంగాః పన్నగాః సింహాః త్వాం రక్షంతు నరోత్తమ |
స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః |
స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగో ర్యమా || 2.25.8
లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా |
ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాస్సంవత్సరాః క్షపాః || 2.25.9
దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా |
స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాంతు త్వాం పుత్ర! సర్వతః || 2.25.10
స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ స బృహస్పతిః |
సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః || 2.25.11
యాశ్చాపి సర్వతః సిద్ధాః దిశశ్చ సదిగీశ్వరాః |
స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః ||2.25.12
శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ |
ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాః తథైవ చ || 2.25.13
నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవతాః |
అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితమ్ || 2.25.14
ఋతవశ్చైవ షట్ పుణ్యా మాసాః సంవత్సరాస్తథా |
కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే || 2.25.15
మహావనే విచరతో మునివేషస్య ధీమతః |
తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా || 2.25.16
రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణామ్ |
క్రవ్యాదానాం చ సర్వేషాం మాభూత్ పుత్రక తే భయమ్ ||2.25.17
ప్లవగాః వృశ్చికాః దంశాః మశకాశ్చైవ కాననే |
సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ || 2.25.18
మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రాః ఋక్షాశ్చ దంష్ట్రినః |
మహిషాః శృంగిణో రౌద్రాః న తే ద్రుహ్యంతు పుత్రక||2.25.19
నృమాంసభోజనా రౌద్రా యే చాన్యే సత్వ జాతయః |
మాచ త్వాం హింసిషుఃపుత్ర మయా సంపూజితా స్త్విహ ||2.25.20
ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః |
సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్ఛ పుత్రక || 2.25.21
స్వస్తి తే స్త్వంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః |
సర్వేభ్యశ్చైవ దేవేభ్యో యే చ తే పరిపంథినః || 2.25.22
గురుస్సోమశ్చ సూర్యశ్చ ధనదో థ యమస్తథా |
పాంతు త్వామర్చితా రామ! దండకారణ్యవాసినమ్ ||2.25.23
అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షి ముఖాచ్చ్యుతాః |
ఉపస్పర్శనకాలే తు పాంతు త్వాం రఘునందన || 2.25.24
సర్వలోకప్రభుర్బ్రహ్మా భూతభర్తా తథర్షయః |
యే చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినమ్ || 2.25.25
ఇతి మాల్యైః సురగణాన్ గంధైశ్చాపి యశస్వినీ |
స్తుతిభిశ్చానురూపాభిః ఆనర్చా యతలోచనా || 2.25.26
జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా |
హావయామాస విధినా రామమంగళకారణాత్ || 2.25.27
ఘృతం శ్వేతాని మాల్యాని సమిధః శ్వేతసర్షపాన్ |
ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా || 2.25.28
ఉపాధ్యాయః సవిధినా హుత్వా శాంతిమనాయమ్ |
హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్ || 2.25.29
మధు దధ్యక్షతఘృతైః స్వస్తివాచ్య ద్విజాం స్తతః |
వాచయామాస రామస్య వనే స్వస్త్య యనక్రియాః || 2.25.30
తత స్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్వినీ |
దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్ || 2.25.31
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే |
వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళమ్ || 2.25.32
యన్మంగళం సువర్ణస్య వినతా కల్పయత్ పురా |
అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళమ్ || 2.25.33
అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ |
అదితిర్మంగళం ప్రాదాత్తత్తే భవతు మంగళమ్ || 2.25.34
త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమితతేజసః |
యదాసీన్మంగళం రామ తత్తే భవతు మంగళమ్ ||2.25.35
ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే |
మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా || 2.25.36
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే అయోధ్యాకాణ్డే పఞ్చవింశస్సర్గః ৷
సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు బలం గురోః ప్రవర్ధతాం సమస్త లోకాః సుఖినో భవంతు