Рет қаралды 503
సంప్రదాయాలు ఉట్టిపడేలా రాయలంలో సంక్రాంతి సంబరాలు
సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత
భీమవరం:
సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు సందడి చేస్తూ రంగ వల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమ వరం మండలం రాయలం గ్రామం శ్రీ కామాక్షమ్మ గుడి వీధిలో రాయలం జనసేన పార్టీ పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాలను ప్రారంభించి ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మహిళలు అధిక సంఖ్యలో రంగవల్లులు పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే అంజిబాబు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి అరకాసు బంగారం, రెండవ బహుమతి రిఫ్రిజిరేటర్ 3వ బహుమతి గ్యాస్ స్టవ్ విజేతలకు అందించారు. కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, పులపర్తి ప్రశాంత్, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, బండి రమేష్ కుమార్, హరివర్ధన్, యర్రంశెట్టి శివకృష్ణ, వబిలిశెట్టి రామకృష్ణ, దారపత్తుల శ్రీనివాస్, కున శ్రీనివాస్, మోకా శ్రీనివాస్, గుసిడి సూరిబాబు, చెరుకువాడ సతీష్, కొప్పినిడి భాస్కరరావు, తోట శ్రీను, తోట నాగు, వీర మహిళలు చినమిల్లి వల్లి, చినమిల్లి ప్రతిభ, యాదాల అనుషా, పూర్ణిమ, తులసి, భవానీ తదితరులు పాల్గొన్నారు.