Рет қаралды 260,033
తెలుగు రైతుబడి చానెల్లో చూసిన వీడియో ద్వారా షేక్ బాషా గారు చేస్తున్న మెట్ట వరి సాగు విధానం పై ఆసక్తితో అదే పద్దతిలో వరి సాగు చేస్తున్న రైతు మదుసూదన్ రెడ్డి గారు ఈ వీడియోలో తన అనుభవాన్ని పంచుకున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన మదుసూదన్ రెడ్డి గారు.. 18 ఎకరాల తన భూమిలో దమ్ము చేయకుండా పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సీడ్ డ్రిల్ సాయంతో వరి విత్తనాలు వేసుకున్నారు. ఒక్క కూలీ అవసరం కూడా లేకుండానే వేసుకున్న ఈ విధానంతో.. ఎకరానికి సగటున 10 వేల వరకు సాగు ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. నెల రోజుల చేను పెరిగే సమయానికే తనకు ఎకరానికి కనీసం 8500 వరకు ఖర్చు మిగిలిందని వివరించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 18 ఎకరాల్లో పొడి దుక్కిలోనే వడ్లు విత్తినం.. 1.5 లక్షల ఖర్చు తగ్గింది | రైతు బడి
#RythuBadi #మెట్టవరి #వెదవరి