Рет қаралды 41,529
రైతుల జీవన విధానం, వ్యవసాయంలో వారు చేస్తున్న అలుపెరుగని కృషి, ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, అనుభవంతో సాధించిన విజయాలను తోటి రైతు సోదరులకి తెలియ చెప్పాలనే ఉద్దేశంతో... రైతు నేస్తం రైతుతో ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా తారమతిలో 17 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్న గుడివాడ నాగరత్నం నాయుడుతో తొలిగా రైతుతో ఒకరోజు ప్రారంభించింది. రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు నాగరత్నం నాయుడి నుంచి ఎన్నో విషయాలు ఇంటర్వ్యూ ద్వారా రాబట్టారు
ప్రతి రైతు ఆర్థికంగా శక్తిమంతుడు కావాలనేది నాగరత్నంనాయుడి ఆలోచన.
ప్రతి రైతు తన పిల్లలని కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థాయికి ఎదగాలనేది వారి ఆశ.
మార్కెటింగ్‌లో దిట్ట అయిన నాగరత్నం నాయుడు ప్రతి రైతు మిశ్రమ వ్యవసాయం చేయాలని సూచిస్తారు.
తన పొలం ఒక పరిశోధన కేంద్రం, విశ్రాంత ఉద్యానవనం, విహార క్షేత్రంగా ఉండాలన్న లక్ష్యంతో... జీవ వైవిధ్యం ఉట్టిపడే మొక్కలని వారు పెంచారు.
నాగరత్నం నాయుడి సహజ తోట విశేషాలను రైతుతో ఒక రోజులో చూడండి.