Рет қаралды 49,069
షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 06 ||సాయిభక్త మహల్సాపతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకునే ధైర్యం మనకు ఎందుకులేదు!? మహల్సా జీవితాన్ని తెలుసుకోవడానికి ఈ కధ వినండి // Shiridi SaiBaba Story // SaiLeela ||
ఒకసారి బాబా మహల్సాపతికి రూ ॥ 3/-లు ఇచ్చి "రోజూ నేనిచ్చే డబ్బులు తీసుకుంటూ ఉండు త్వరలోనే గొప్ప ధనవంతడవౌతావు "అన్నారు ఎంతో పేదవాడైనప్పటికీ మహల్సాపతి ఏ మాత్రమూ చలించలేదు అతడెంతో వివేకంతో "బాబా నాకు అవేవీ వద్దు నాకు మీ నిరంతర పాదసేవ మాత్రమే కావాలి" అన్నాడు అంతటి గొప్ప విరాగి వివేకవంతుడు మహల్సాపతి.
సం: 1886 లో ఒకసారి బాబా మహల్సాపతి తొడమీద తన తల ఉంచి, "భగత్" నేను అల్లా వద్దకు వెళుతున్నాను మరలా మూడు రోజులలో తిరిగివస్తాను అప్పటి వరకూ నా శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించు ఆ తర్వాత కూడా నేను రాకపోతే వేపచెట్టు క్రింద సమాధి చెయ్యి "అని చెప్పి తన శరీరాన్ని వదిలివేశారు బాబా మీద విశ్వాసంతో మూడు రోజులపాటు కొంచెం కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు మహల్సాపతి ఆ తర్వాత బాబా తిరిగి జీవించారు అంతటి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాడు మహల్సాపతి.
బాబా అతనిని అడుగడుగునా కాపాడుతూ ఉండేవారు అంతేకాదు బాబా అతని భక్తికి మెచ్చి అతనికి తమ పాదుకలు, కఫ్నీ, రూపాయి నాణాలు మూడు, ఒక బెత్తము ప్రసాదించారు.అతడు వాటిని భక్తితో భద్రపరచుకున్నాడు.బాబా మహాసమాధి చెందిన 4 సం:లకు ఒక పవిత్రమైన రోజున తన కుటుంబ సభ్యులకు తాను ఆ రోజు స్వర్గానికి వెళుతున్నానని చెప్పి మహల్సాపతి భోజనం ముగించి తాంబూలం వేసుకుని కఫ్నీ ధరించి అందరినీ రామనామం జపించమన్నాడు. తర్వాత తన కుమారుడైన మార్తాండ్ ను పిలిచి "భక్తి మార్గంలో జీవితం గడుపు" అని చెప్పి రామనామం జపిస్తూ ప్రాణం వదిలాడు అంతటి ఉత్తమమైన మరణాన్ని మహల్సాపతికి ప్రసాదించారు బాబా అలా బాబా అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన మహాభక్తుడు మహల్సాపతి.