ఉమా దేవి గారు, రచయితకుండాల్సిన కనీస అర్హతలేమిటో..మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా చక్కగా తెలియచేసారు. మీ స్వరం చాలా స్వీట్ గా, వినసొంపుగా వుండటం తో - ఇంటర్వ్యూ ఆద్యంతమూ శ్రధ్ధగా వినింపింప చేస్తుంది. కుదురుగా కూర్చో బెడుతుంది. కథ ఎందుకు రాయాలి, దాని ప్రయోజనం ఎలా వుండాలి, రచయితకు సామాజిక బాధ్యత ఎంతవరకు వుండాలి? వుంటుంది ? అనే సందేహాలన్నిటికీ చక్కని జవాబుదారీ గా నిలుస్తాయి, ఈ ఇంటర్వ్యూ లో ని మీ అభిప్రాయాలు, సమాధానాలు! మీరు కథ చెబుతుంటె ఎంత ఆసక్తి కరం గా వుందో తెలుసా? కొన్ని టికి మనసు చెదరింది కూడ. కథల్ని రాయ కూడదండి. కథలు మన చేత రాయించాలి. రాసే దాకా నిద్రపోనియని అవస్థ కి గురిచేయాలి. ఆ బాధ వెంటాడాలి. వేటాడాలి. ఆ వేదనా వ్యధ పురిటి నొప్పులు అక్షర ప్రసవం తో తీరాలి. అప్పుడా కథ జీవమై, సజీవమై నిలుస్తుంది. మీ కథలు కల్పనలోంచి పుట్టలేదు. అవేదన లోంచి, స్పందనలోంచి పుట్టుకొచ్చాయి. అందుకే వాటికి అంత ఆదరణ. మీరు ఇంకా ఇంకా, ఎన్నో, ఎన్నెన్నో మంచి మంచి కథలు రాసి, తెలుగు రచయిత్రులందరూ గర్వపడే లా ఉన్నత కీర్తి శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ..ఆకాంక్షిస్తూ..ఆశిస్తూ.. శుభాభినందనలతో.. -ఆర్.దమయంతి.