ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమాలంటే ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. అవినీతి రహితుడిగా, నిష్కళంకుడుగా పేరు తెచ్చుకున్న ఆయనకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది.కాపులకు గుర్తింపు తీసుకొని వచ్చారు.ఆయన కాపుజాతి పిత. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ సానుభూతి పరుడిగా 1970 దశకంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.