నిజమే 53 అంటే మరీ పెద్ద వయసేమీ కాదు.జరిగినంత వరకు సహజీవనానికి సిద్ధపడిందని అనుకోవచ్చు. భర్త తాలూకు పాత జ్ఞాపకాలు ఆమెను మరల బందిఖానాలో ఉంచదలుచుకోలేదు. ఇప్పుడైనా వీలైనంతవరకు స్వేచ్ఛగా సరదాగా ఉంచ తలచు కున్నట్లుగా నిర్ణయించుకుందనుకోవచ్చు. అన్నట్లు ఇప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ కూడా సహజీవనానికి ఆమోదముద్ర వేసిన విషయం మనకు తెలిసిందే. ఆమె ఎన్నుకున్న వ్యక్తి తెలిసిన వ్యక్తి అంటున్నారు కనుక ఏ సమస్య ఉండకపోవచ్చు. ఒకవేళ సమస్య అనుకున్న కూడా పిల్లలు సంసారం వంటి గొడవలు ఏమి ఉండవు కనుక బయటపడటం తేలికే. మనదేశంలో మన వ్యవస్థను పిల్లలు తలో పక్క వెళ్లిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గం చూపించే కథగా దీన్ని భావించవచ్చు. మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ఇలాంటి Scripted stories మీరు post చేస్తే చాలామందికి నేనుshare చేస్తాను. తెలుగు చదవడం కష్టం అనుకుంటున్న ఈ తరం వారికి ఇలాంటివి చాలా ఉపయోగకరంగ ఉంటాయి ఆలోచించగలరు.