తిరుప్పావై పాశురం - 30- (అగ్గరాజు నాగలక్ష్మి గారు)

  Рет қаралды 218

Chamarru Rural Development Society

Chamarru Rural Development Society

Күн бұрын

భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( ఆండాళ్ ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది
30.పాశురము : గానం : అగ్గిరాజు నాగలక్ష్మి గారు
వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ
అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై
పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న
శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే
ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్
శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్
అణ్దాల్ తిరువడిగళే శరణమ్
భావం : ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు.
వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.
ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్
శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్
అవతారిక :
ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన (మాలిక). ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ 'తిరుప్పావై' దివ్య ప్రపందాన్ని అనుసంధించి మనమూ తరిద్దా౦! అమ్మా ఋణాన్ని తీర్చుకొందాం
#chamarrutemples
#tiruppavaipasuram

Пікірлер
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН