Рет қаралды 31,017
బ్రహ్మ విద్య అయిన త్రైత సిద్ధాంత భగవద్గీత లోని కొన్ని ముఖ్య శ్లోకములు, వాటి భావము.
శ్రీ గురుభ్యో నమః
త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి
ఇందుజ్ఞాన ప్రధాత
సంచలనాత్మక రచయిత
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే దైవ భాష అయిన తెలుగులో రచింపబడిన భగవద్గీత, త్రైత సిద్ధాంత భగవద్గీత.
దేవుడి జ్ఞానం దేవుడే తెలియచేయాలి అన్న దైవ వాక్కు ప్రకారం, విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మ భగవంతుడుగా అవతారమంది తెలియచేసిన దైవ జ్ఞానమే శ్రీమద్భగవద్గీత.
ఇది ఏ ఉపనిషత్తుల, ఏ 4 వేదాల సారం కాదు.
స్వయాన దేవుడు మనిషిగా అవతరించి, మానవ జీవితానికి గల హద్దును తెలియచేసినది ఈ గీతలోనే.
ఈ గీతను తెలుసుకోవడంతోనే జీవుని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది.
శ్రీమద్భగవద్గీతలోని ప్రతీ శ్లోకం శరీర పరిధిలోని ధర్మములను తెలియచేశాయి తప్ప ఏ శ్లోకము శరీర పరిధి దాటి చెప్పలేదు.
దేవుడు సృష్టించినదే శరీర హద్దు.
భగవంతుడు చెప్పినదే భగవద్గీత.
ఈ హద్దును శ్రీకృష్ణ భగవానుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివర సహితంగా శ్రీమద్భగవద్గీతలో అందించారు.
ఇప్పటికి ఎవరూ గుర్తించని ఆ మూడు ఆత్మల వివరంను మొట్టమొదటగా గుర్తించి, త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించి, "త్రైత సిద్ధాంత భగవద్గీత"ను సంచలనాత్మకంగా రచించారు, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు.
త్రైత సిద్ధాంతానికి ఆధారం శ్రీమద్భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 16,17 శ్లోకములు.
శ్రీమద్భగవద్గీతలో మాయాప్రభావం వల్ల, చేర్చబడిన ప్రక్షిప్తాలను, కల్పితాలను శాస్త్రబద్ధoగా, సూత్రబద్ధoగా ఏరివేసి, శాస్త్రబద్ధమైన ప్రతీ సంస్కృత శ్లోకానికీ భావమును, వివరమును సరళమైన తెలుగుభాషలో
పామరుల నుంచి పండితుల దాకా, అందరికీ సులభంగా అర్ధమయ్యే విధంగా త్రైతసిద్ధాoత భగవద్గీతను రచించారు యోగీశ్వరులవారు.
యోగము అనగా కలయిక. జీవుడు దేవునిలో కలవడమే యోగము.
జ్ఞాన యోగము లేక బ్రహ్మ యోగము, రాజ యోగము లేక కర్మ యోగము, భక్తి యోగము లేక విశ్వాస యోగం అన్న మూడు భాగాలతో కూడుకొన్న యోగ శాస్త్రమైన శ్రీమద్భగవద్గీత.
జనన మరణ చక్రంలో చిక్కిన ప్రతి జీవునకు విషాదం తప్పదని, ఆ విషాదం నుండి తప్పించుకొని జననమరణ చక్రము నుండి విడుదల అయ్యి మోక్షం పొందటానికి శ్రీమద్భగవద్గీతలోని భగవానుని వాక్కు ఒక్కటే మార్గము.
బ్రహ్మ విద్య అయిన త్రైత సిద్ధాంత భగవద్గీతా గ్రంథము, గీతలో భగవానుని మొదటి వాక్కు అయిన, సాంఖ్యయోగములోని 11 వ శ్లోకము "అశోచ్యానన్వ శోచస్త్వం...." అన్న శ్లోక వివరణతో మొదలయ్యి, మోక్షసన్న్యాసయోగములోని 66వ శ్లోకం "సర్వ ధర్మాన్ పరిత్యజ్య...." అన్న శ్లోక వివరంతో పూర్తి అవుతుంది.
త్రైత సిద్ధాంత భగవద్గీత 4 సూత్రాలను అనుసరించి వ్రాయబడినది. అవేమనగా
1. చదువుతున్న శ్లోకము జీవాత్మకా, ఆత్మకా, పరమాత్మకా, ప్రకృతికా? ఎవరిని గూర్చి చెప్పబడినది.
2. చదువుతున్న శ్లోకము బ్రహ్మ యోగమునకా, కర్మ యోగమునకా లేదా భక్తి యోగమునకా? దేనికి సంబంధించినది.
3చదువుతున్న శ్లోకము సాకారమునకా, నిరాకారమునకా ఎవరిని గూర్చి చెప్పినది .
4చదువుతున్న శ్లోకము శాస్త్రబద్ధమా! కాదా?
గీతలోని శ్లోకాలను ఈ నాల్గు సూత్రములను అనుసరించి చూడకపోతే శ్రీమద్భగవద్గీత అర్థ సహితం కాదు.
భగవాన్ శ్రీకృష్ణుని నిజ భావమును, కుల మత వర్గ ప్రాంత బేధ భావం లేకుండా దేవుని జ్ఞానమును సమస్త మానవాళికి తెలుపునది త్రైత సిద్ధాంత భగవద్గీత.
అంతటి మహోన్నతమైన, యోగ శాస్త్రమైన, బ్రహ్మ విద్య అయిన త్రైత సిద్ధాంత భగవద్గీత లోని కొన్ని ముఖ్య శ్లోకములు, వాటి భావముతో ఈ వీడియో యొక్క ఆడియో లో ఇవ్వబడినవి.
ఇంకా వివరంగా తెలుసుకోవటానికి
#ThraithasiddanthaBhagavadgeetha
ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకొనుటకు
visit..... thraithashakam....
అలాగే మీ మొబైల్ నందు త్రైతసిద్దాంత భగవద్గీత app ని
www.youtube.co... ఈ లింక్ ద్వార ఉచితముగ Download చేస్కోవచ్చు
త్రైతసిద్దాంత భగవద్గీత pdf గ్రంథం కొరకు
thraithashakam....