+thejaswini sai మీరు చెప్పింది కూడా ప్రాచుర్యంలో ఉండండి. నాకు తెలిసింది చెప్తాను.. కుంతల శాతకర్ణి : ఇతడి కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామం.. సంస్కృతం రాజభాషగా మారింది. మహారాష్ట్ర లోని దక్షిణ ప్రాంతాలను, కర్ణాటక లోని ఉత్తర ప్రాంతాలను జయించి.. వాటికి కుంతల దేశమని పేరుపెట్టి పాలించాడు కాబట్టి కుంతల శాతకర్ణి అనే పేరు వచ్చింది. రాజశేఖరుని కావ్యమీమాంస, వాత్సాయనుని కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్కథలలో కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది. కుంతల శాతకర్ణి భార్య మలయావతి కరిర్త అనే కామ క్రీడ వలన చనిపోయింది. నోట్: కామసూత్ర రాసిన వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు. కామసూత్ర కేవలం శృంగారపరమైన రచనే కాదు. ఆనాటి ప్రజల జీవన విధానం, మనస్తత్వం, రాజకీయ విధానం కళ్లకు కట్టినట్లు వివరించాడు. ప్రపంచంలోనే 58 భాషల్లోకి అనువాదం చేయబడిన ఏకైక గ్రంథం ఇదే. నోట్: వాత్సాయనుడి కామసూత్రపై యశోధరుడు అనే కవి జయమంగళ అనే వ్యాఖ్యానం రాశాడు. శర్వవర్మ కాతంత్ర్య వ్యాకరణం ( సంస్కృత గ్రంథం ) దీనిని కుంతల శాతకర్ణికి నెలరోజుల్లో సంస్కృతాన్ని నేర్పించడానికి రచించాడు. నోట్: ఇతడి ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన సవాల్ ను గూర్చి వివరించిన గ్రంథం సోమదేవుడి కథా సరిత్సాగరం. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం : శర్వవర్మ, గుణాఢ్యుడు హాలుడి ఆస్థానంలో ఉన్నారనే వాదన కూడా కలదు. గుణాడ్యుడి బృహత్ కథ : దీనిని పైశాచీ పాకృతంలో రాశారు. ఇతడు తొలి తెలంగాణా కవి ( పాల్కురికి కూడా తెలంగాణా ఆదికవి అంటారు ). బృహత్కథలో హీరో నరవాహనుడు.