Telugu ప. దారిని తెలుసుకొంటి త్రిపుర సుందరి నిన్నే శరణంటి అ. మారుని జనకుడైన మా దశరథ కుమారుని సోదరి దయా-పరి మోక్ష (దా) చ1. అంబ త్రి-జగదీశ్వరి ముఖ జిత విధు బింబ ఆది పురమున నెలకొన్న కనకాంబరి నమ్మిన వారికభీష్ట వరంబులొసగు దీన లోక రక్షకి అంబుజ భవ పురుహూత సనందన తుంబురు నారదులందరు నీదు పదంబును కోరి సదా నిత్యానందాంబుధిలోనోలలాడుచుండే (దా) చ2. మహదైశ్వర్యమొసగి తొలి కర్మ గహనమును కొట్టి బ్రోచు తల్లి గుహ గజ ముఖ జనని అరుణ పంకే- రుహ నయనే యోగి హృత్సదనే తుహినాచల తనయా నీ చక్కని మహిమాతిశయమ్ముల చేతను ఈ మహిలో ముని గణములు ప్రకృతి విరహితులై నిత్యానందులైన (దా) చ3. రాజిత మణి గణ భూషణి మద గజ రాజ గమని లోక శంకరి దనుజ రాజ గురుని వాసర సేవ తనకే జన్మ ఫలమో కనుగొంటిని ఆ-జన్మము పెద్దలు తమ మదిలో నీ జపమే ముక్తి మార్గమనుకొన రాజ శేఖరుండగు శ్రీ త్యాగరాజ మనో-హరి గౌరి పరాత్పరి (దా)